అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, January 20, 2012

రాక్షస చట్టాలను వ్యతిరేకిస్తున్నాం



  • పిపా, సోపాపై ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడ
  • ఇంటర్నెట్‌ను అడ్డుకోవద్దు
ఆన్‌లైన్‌ పైరసీ నిరోధం కోసం ప్రతిపాదించిన చట్టాలపై వ్యక్తమవుతున్న నిరసనతో ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌
జుకెర్‌బర్గ్‌ కూడా గొంతు కలిపారు. ప్రతిపాదిత ఐపి పరిరక్షణ చట్టం (పిపా), ఆన్‌లైన్‌ పైరసీ నిరోధక చట్టం (సోపా) 'ముందుచూపు కొరవడిన వారు' రూపొందించిన చట్టాలని ఆయన తన సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్‌ వాల్‌లో ప్రచురించారు. ఆయన తన అభిప్రాయాన్ని పోస్ట్‌ చేసిన రెండు గంటల్లోనే దాదాపు 2.8 లక్షల మంది నెటిజన్లు ఆయన అభిప్రాయానికి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌ అత్యంత శక్తిమంతమైన మీడియాగా మారి ప్రపంచం నలుమూలలా వున్న ప్రజలను ఒక్కటి చేస్తోందని, అటువంటి మీడియా అభివృద్ధికి ఇటువంటి రాక్షస చట్టాలు అవరోధంగా మారతాయని మార్క్‌ అభిప్రాయపడ్డారు. సోపా, పిపా చట్టాలను ఫేస్‌బుక్‌ వ్యతిరేకిస్తోందని, ఇంటర్నెట్‌ మాధ్యమాన్ని అడ్డుకునే ఎటువంటి చట్టాలనైనా తాము నిరసిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్నెట్‌ అనుకూలవాదులైన ప్రపంచ నేతలు ప్రస్తుతం అవసరమన్నారు.

సామాజిక వెబ్‌సైట్ల బ్లాక్‌డే
ఇదిలా వుండగా ప్రతిపాదిత పైరసీ నిరోధక చట్టాలకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌, గూగుల్‌, వికిపీడియా వంటి సామాజిక వెబ్‌సైట్లు తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి. రాక్షస చట్టాలను నిరసిస్తూ వికిపీడియా తన వెబ్‌సైట్‌ను గురువారం పూర్తిగా మూసివేయగా గూగుల్‌ మాత్రం తన లోగోకు నల్లరిబ్బన్‌ చుట్టి నిరసన వ్యక్తంచేసింది. మరో సామాజిక వెబ్‌సైట్‌ రెడిట్‌ను 12 గంటలసేపు మూసివేస్తున్నట్లు దాని యాజమాన్యం ప్రకటించింది. క్రెయిగ్స్‌లిస్ట్‌ వెబ్‌సైట్‌ తన హోంపేజిని నల్లరంగుతో నింపివేసింది. ప్రతిపాదిత చట్టాలపై ఆన్‌లైన్‌ నిరసనలు క్రమంగా బలపడుతుండటంతో దీని ప్రభావం చట్టాల ప్రతిపాదకులు, వాటిని సమర్ధించే వారిపై పడుతోంది. ఇప్పటి వరకూ ఈ చట్టాలను గట్టిగా సమర్ధించిన రిపబ్లికన్‌ సెనేటర్‌ మార్కో రూబియో తాను ఇంటర్నెట్‌ పైరసీ నిరోధక చట్టాన్ని సమర్ధించబోనని తేల్చి చెప్పారు.
టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్‌ సెనేటర్‌ జాన్‌ కార్నిన్‌ కూడా ఆయన బాటలోనే తన మద్దతును ఉపసంహరించుకున్నారు. అయితే ఈ బిల్లులను అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలతో పాటు అమెరికా చలనచిత్ర సంఘాలు కూడా గట్టిగా సమర్ధిస్తున్నాయి.

No comments:

Post a Comment