అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Tuesday, January 31, 2012

తెలుగు మీడియా వృత్తి నైపుణ్యం కోల్పోతున్నదా?

 Mon, 30 Jan 2012, IST

నేటి దేశకాల పరిస్థితులలో రాజకీయ ప్రత్యామ్నాయం ఏమిటన్న విషయంలో సిపియం చాల స్పష్టమైన ప్రకటన చేసింది. ఇంతకన్నా కొద్దిగా ముందు ప్రకటించిన సిపిఐ ముసాయిదా రాజకీయ తీర్మానంలో కూడా ఈవిషయంపై
వివరణ ఉంది. గత ఎన్నికల్లో ముందుకు వచ్చిన మూడోఫ్రంటు నినాదం ఈసారి అటు సిపిఐ కానీ లేదా ఇటు సిపియం కానీ ప్రస్తావించలేదు. విధానాల మధ్య ఏకీభావం లేకుండా, నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయం చూపకుండా, లేదా తాము అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఆచరించకుండా, ప్రతిపక్షంలోకి రాగానే పల్లవి మార్చే ఆవకాశవాద పార్టీలతో కలసి నిర్మించే ఫ్రంటులను ప్రజలు విశ్వసించరని తేలిపోయింది. ఆలస్యమయినా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేయడం ద్వారానే ప్రజలకు ప్రత్యామ్నాయం చూపాలని వామపక్షపార్టీలు నిర్ణయించుకున్నాయి. ఆ మార్పును మీడియా గుర్తించలేదు.


జనవరి 28న ఢిల్లీలో సిపిఐ(యం) రాజకీయ తీర్మానం విడుదలయింది. దానితో పాటే అందులోని సారాంశాన్ని మీడియా కోసం నాలుగుపేజీల్లో క్లుప్తంగా వివరిస్తూ ప్రత్యేకంగా ప్రకటన కూడా విడుదల చేశారు. తీరా 29వ తేదీ తెలుగు పత్రికలు చూస్తే తెలంగాణా సమస్యపై ఉన్న పేరా మినహా మరే అంశమూ కనపడలేదు. ఎలక్ట్రానిక్ మీడియా దాదాపు దీనిపై ఎలాంటి ఆసక్తి ప్రదర్శించలేదు. మీడియా స్వభావం ఎలా ఉన్నా వ్యాపారరీత్యానైనా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. చదవేస్తే ఉన్న మతి కూడా పోయినట్లు తెలుగు పత్రికారంగం వృత్తినైపుణ్యాన్నీ కోల్పోతున్నదా? అన్న సందేహం వచ్చింది. తెలంగాణాపై సిపియం వైఖరి అందరికీ తెలుసు. దాని కోసం తెలంగాణా ప్రజలు సహా ఆంధ్రప్రదేశ్లో ఎవరూ ఎదురు చూడటం లేదు. పైగా ఇటీవల ఆందోళన తర్వాత సిపియం సూత్రబద్ధ్దవైఖరిపై ప్రజల్లో గౌరవం పెరిగిందే తప్ప తగ్గలేదు. సిపియం తన మార్గం నుండి తప్పుకోవాలని కూడా ఎవరూ కోరుకోవడం లేదు. అలాంటి సాధారణ పరిస్థితుల్లో అందరికీ తెలిసిన విషయాన్నే పదేపదే ఎందుకు పత్రికలు ముందుకు తెస్తున్నాయో అర్థ్దం కాదు. తెలంగాణాపై సిపియం వైఖరి రాయడం తప్పుకాదు. మొత్తం రాజకీయపత్రంలో అదొక చిన్నభాగం మాత్రమే. కుళ్లిపోతున్న దేశరాజకీయాలకు సిపియం చూపిస్తున్న ప్రత్యామ్నాయం అందులో ప్రధాన అంశం. దాని గురించి రాయకుండా ఉద్దేశపూర్వకంగానే విస్మరించినట్లు కనిపిస్తున్నది. దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో కాంగ్రెసు, బిజేపీలు విశ్వసనీయత కోల్పోతున్నాయి. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో సిపిఎం రాజకీయ విధానం తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో సహజంగానే వుంటుంది. దీనిని మీడియా గుర్తించకపోవడం శోచనీయం. సిపిఎం రాజకీయ విధానాన్ని ప్రజలకు వినిపిస్తే ఈ దోపిడీ వ్యవస్థకు నష్టం జరుగుతుందన్న భయం వారిని పీడిస్తున్నదేమో. అందుకే దేశ, రాష్ట్ర రాజకీయాల గురించి సిపియం ఏమంటున్నదో చెప్పదలచుకున్నట్లు లేదు. జాతీయంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల్ని అదెలా అంచనా వేస్తున్నదో పట్టించుకోకపోవడం తప్పు. సిపియం రాజకీయ విధానంపై రకరకాల ఊహాగానాలు చేసిన మీడియా తీరా రాజకీయ తీర్మానం వచ్చాక దానిపై మౌనం వహించడం ఆశ్చర్యకరంగా ఉంది. మీడియాకు పాఠకులు, వీక్షకులను పెంచుకోవడమే వృత్తినైపుణ్యానికి కొలబద్దగా ఈ పత్రికలు చూస్తుంటాయి. అందుకోసమే సెన్సేషన్వార్తల కోసం ఎదురు చూస్తుంటాయి. చిన్నది దొరికినా పెద్దది చేసి వదులుతాయి. అవీ దొరక్కపోతే లేనిదాన్నయినా సృష్టిస్తాయి. ప్రపంచీకరణ యుగంలో మీడియాలో వచ్చిన అతి పెద్దమార్పు అదే. కనీసం ఈ విషయాన్ని కూడా సిపియం రాజకీయ తీర్మానంలో వారు చూసినట్లు లేదు. మన రాష్ట్రానికి సంబంధించిన అంశం ఏముందో చూసుకొని దాన్ని మాత్రమే ముద్రించినట్లు కనిపిస్తుంది. కాకుంటే దాన్ని వక్రీకరించకుండా ఇచ్చినందుకు వారిని తప్పకుండా అభినందించాలి. రాజకీయ తీర్మానం మొత్తంగా ఒకపక్క ఉంచినా కనీసం అందులోని ఎత్తుగడల ప్రభావం మన రాష్ట్ర రాజకీయాలపై ఎలా ఉంటుందో కూడా అంచనా వేయడానికి వారు ప్రయత్నించలేదంటే వారి వృత్తినైపుణ్యంలోని దృష్టిలోపం తప్పకుండా అర్థమవుతుంది. 60పేజీలు చదివే ఓపిక లేదనుకున్నా కనీసం నాలుగుపేజీలు కూడా చదవడానికి తీరిక చేసుకోలేకపోయారంటే దాన్ని ఏ తరహా వృత్తినైపుణ్యం అనుకోవాలి. ప్రాంతీయ భాషా పత్రికలంటే జాతీయ, అంతర్జాతీయ విషయాలను అసలు పట్టించుకోకూడదని అర్థమా? కమ్యూనిస్టులపై రాళ్లు విసరడానికి ఏ నైపుణ్యమూ అవసరం లేదు. ఊహించి కథనాలు రాయడానికి కూడా ఏ కొలబద్దలూ అవసరం ఉండదు. పార్టీలో గందరగోళం సృష్టించాలనుకునే దుర్బుద్ధ్దికి కూడా ఎలాంటి రచనాకౌశల్యమూ అవసరం లేదు. ఈ విషయంలో మీడియా ఇప్పటికే ఆరితేరింది. రోజూ పుంఖానుపుంఖాలుగా రాసేస్తూనే ఉంది. దాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో కమ్యూనిస్టుపార్టీలు మినహా మరే ఇతర పార్టీ బహిరంగంగా చర్చ కోసం తన ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని విడుదల చేయదు. ఒకపార్టీ ఇలా ప్రజాస్వామ్యబద్ధ్దంగా రాజకీయ విధానాన్ని రూపొందించుకోవడాన్ని అభినందించి తీరాల్సిన విషయం. అయినా ఏ పత్రికా ఆ విషయాన్ని కనీసం గమనించినట్లు కూడా లేదు. కరడుగట్టిన కార్పోరేట్ రాజకీయాల్లో మునిగితేలుతూ తాము ఆ బురదలోనే ఇరుక్కొని రాజకీయాల్లో ప్రగతిశీలతకు ప్రతిబింబాలను చూడలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన దుర్గతేనని చెప్పాలి. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన నాలుగో స్తంభం పరిస్థితి ఇలా ఉంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంకెంత భద్రంగా ఉంటుందో ఆలోచించాలి.

ఒక ప్రత్యేక పరిస్థితులలో సిపిఐ(యం) 20వ మహాసభలు జరగనున్నాయి. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం సోవియట్ యూనియన్ కూలిపోయింది. కమ్యూనిస్టు వ్యతిరేకత ప్రపంచవ్యాపితంగా అంటువ్యాధిలా వ్యాపించింది. ప్రగతిశీలంగా ఆలోచించేవాళ్లు కూడా కొంతమంది ఈ వ్యాధి బారినపడి తిరోముఖం పట్టారు. అదే సమయంలో నయా ఉదారవాద విధానాలు ఊపందుకున్నాయి. ఫైనాన్స్ పెట్టుబడి ప్రపంచమంతా విస్తరించింది. ప్రభుత్వ ఆస్థులు ప్రైవేటుపరమయ్యాయి. ప్రజల సంపద కొద్దిమంది శతకోటీశ్వరుల జేబుల్లోకి పోయింది. సహజవనరులు మాఫియాల పరమయ్యాయి. (వీటికి సంబంధించిన వివరమైన వార్తలు తమ స్వప్రయోజనాల కోసమైనా మీడియా ప్రముఖంగానే ఇస్తూ వచ్చింది.) ఫలితంగా అసమానతలు పెరిగి పెట్టుబడిదారీ వ్యవస్థే తీవ్ర సంక్షోభంలో పడింది. మన యువతరం రోజూ కలలుకనే అమెరికా సంక్షోభంలో కుతికలోతుల్లో మునిగిపోయింది. అక్కడ యువతరం మేం 99శాతానికి ప్రతినిధులం మాకీ ఒక్కశాతం కార్పోరేట్ రాజ్యమొద్దు బాబోరు అంటూ వాల్స్ట్రీట్కెక్కి గర్జిస్తోంది. మరల సోషలిస్టు నినాదాలు ప్రపంచమంతా మార్మోగుతున్నాయి. లాటిన్అమెరికా ఈ విధానాలకు ప్రత్యామ్నాయం చూపిస్తోంది. మనదేశ ఆర్థిక వ్యవస్థా మందగమనంలో పడిందని పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్సింగు విధానాలు విఫలమయ్యాయి. చంద్రబాబు విధానాలూ ఆవిరయ్యాయి. రాహుల్గాంధీ సహా అందరూ సంక్షేమ నినాదాలను భుజాలకెత్తుకుంటున్నారు. రైతు నాయకుల అవతారమెత్తుతున్నారు. రాజకీయ నాయకుల్లో వచ్చిన ఈ మార్పు దేని ఫలితం? వామపక్ష విధానాలకు ఇది నైతిక విజయం కాదా? మారుతున్న ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టుల వాణి భారతదేశంలో కచ్చితంగా మార్పుకు నాంది అవుతుంది. కాలపరీక్షలో తట్టుకొని నిలబడ్డ కమ్యూనిస్టుల విధానాలను పరిశీలించాల్సిన బాధ్యత మీడియాపై లేదా? వారు వాటితో అంగీకరించవచ్చు లేకపోవచ్చు. బాధ్యత కలిగిన మీడియా సిపియం విశ్లేషణను పరిశీలించి సుహృద్భావంతో విమర్శలు చేస్తే అది ప్రజాస్వామ్య ఆకాంక్షగల ప్రజలకు మేలు చేస్తుంది.

నేటి దేశకాల పరిస్థితులలో రాజకీయ ప్రత్యామ్నాయం ఏమిటన్న విషయంలో సిపియం చాల స్పష్టమైన ప్రకటన చేసింది. ఇంతకన్నా కొద్దిగా ముందు ప్రకటించిన సిపిఐ ముసాయిదా రాజకీయ తీర్మానంలో కూడా ఈవిషయంపై వివరణ ఉంది. గత ఎన్నికల్లో ముందుకు వచ్చిన మూడోఫ్రంటు నినాదం ఈసారి అటు సిపిఐ కానీ లేదా ఇటు సిపియం కానీ ప్రస్తావించలేదు. విధానాల మధ్య ఏకీభావం లేకుండా, నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయం చూపకుండా, లేదా తాము అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఆచరించకుండా, ప్రతిపక్షంలోకి రాగానే పల్లవి మార్చే ఆవకాశవాద పార్టీలతో కలసి నిర్మించే ఫ్రంటులను ప్రజలు విశ్వసించరని తేలిపోయింది. ఆలస్యమయినా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేయడం ద్వారానే ప్రజలకు ప్రత్యామ్నాయం చూపాలని వామపక్షపార్టీలు నిర్ణయించుకున్నాయి. ఆ మార్పును మీడియా గుర్తించలేదు. తక్షణం ముందుకు వచ్చిన ప్రజా సమస్యలపై విశాల వేదికలపై కాంగ్రెసు, బిజేపీయేతర పార్టీలతో కలసి పనిచేయడానికి వామపక్షపార్టీలు సిద్ధ్దంగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులను బట్టి అవసరమనుకుంటే ఇలాంటి కొన్నిపార్టీలతో ఎన్నికల సర్దుబాట్లూ చేసుకోవచ్చునని కూడా ముసాయిదా చెప్పింది. కాని ప్రాధాన్యత కలిగిన విషయం కమ్యూనిస్టు ఉద్యమాన్ని స్వతంత్ర రాజకీయ శక్తిగా మలచడం. అందుకు స్వతంత్ర కార్యకలాపాలతో పాటు వామపక్షపార్టీల మధ్య ఐక్యతను పెంపొందించడం. ఈ ఐక్యత చుట్టూ కలసివచ్చే ప్రజాతంత్ర శక్తులను కలుపుకోవడం. ఇక్కడ ప్రజాతంత్ర శక్తులంటే నయా ఉదారవాద విధానాలను, మతోన్మాదాన్ని వ్యతిరేకించడమనేది ముఖ్యమైన అంశం. సిపియం ముసాయిదాలో ముఖ్యమైన రాజకీయ కర్తవ్యం నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడటం. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయ శక్తుల బలాబాలను మార్చి ముందుకు నడిపించే ప్రధాన రాజకీయ కర్తవ్యం అదే అవుతుంది. ప్రస్తుత ప్రపంచ గమనం దాన్నే చాటిచెపుతోంది. మారిన పరిస్థితులను గుర్తించకుండా రాసిందే రాసుకుంటూ, చెప్పిందే చెప్పుకుంటూ అరిగిపోయిన రికార్డులా మారితే అలాంటి మీడియాకు కూడా చరిత్ర చెల్లుచీటి ఇస్తుందని గుర్తించాలి. బ్రిటీషు లేబర్పార్టీ నాయకుడు మిలిబ్యాండ్ న్యూయార్క్టైమ్స్లో రాసిన వ్యాసం (29-1-12)లో 21వ శతాబ్దంలో పెట్టుబడిదారీ విధానం విఫలమయిందా? పనికిరాని ఆర్థిక నమూనా రాజకీయ వ్యవస్థకు సవాల్గా మారనుందా? అంటూ ప్రశ్నించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక దినపత్రిక ఫైనాన్సియల్టైమ్స్లో ''ప్రపంచాన్ని మార్క్సిజం ఆవహించనుందా?'' అంటూ వ్యాఖ్యానించింది. తాజాగా దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థ్దిక వేదికలో మాడిన మొఖాలతో పెట్టుబడిదారీ ప్రముఖులు ఈ వ్యవస్థను ఎలా కాపాడుకోవాలా అంటూ తలలు పట్టుకున్నారు. ఇదంతా మన మీడియాకు కనిపిస్తుందా? దీన్ని గుర్తించి తదనుగుణంగా తన నడకను మార్చుకుంటుందా లేక పాత దారిలోనే పోయి ఊబిలో దిగబడుతుందా వేచి చూద్దాం.

-వి.శ్రీనివాసరావు

No comments:

Post a Comment