అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, January 30, 2012

' కేటు' గాళ్లు మాయం !

ప్రజాశక్తి-హైదరాబాద్‌బ్యూరో   Mon, 30 Jan 2012, IST
  • రాజకీయ నేతల గుట్టు విప్పని ఎసిబి
  • ఎక్సయిజ్‌ సిబ్బందికే పరిమితం
  • చదరంగం ఆడుతున్న సిఎం
మద్యం సిండికేట్ల వ్యవహారాన్ని ప్రభుత్వం తుస్సుమనిపిస్తోంది. కొండంత రాగం తీసి లల్లాయి పాట పాడినట్లుంది అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) తీరు. వేల కోట్ల రూపాయల సిండికేట్‌ దందాలో ప్రజా ప్రతినిధుల పాత్రను
మరుగుపరిచేందుకు ఎసిబి మార్గాలు వెతుకుతోంది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లు మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేకి తెలీకుండా ఒక్క మద్యం దుకాణమైనా నడవదన్న సంగతి బహిరంగ రహస్యం. అయినా నేతల ప్రమేయంపై ఎసిబి దోబూచులాడుతోంది. కొందరు బడా సిండి'కేట్లు’ తప్పించుకుంటారని భోగట్టా. ఆదివారం ఎసిబి చీఫ్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కేవలం ఎక్సయిజ్‌ అధికారుల పాత్రనే తెలిపారు. రాజకీయ నాయకుల ఊసు అందులో లేదు. నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా దాడులు నిర్వహించి మద్యం సిండికేట్లలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నేతలు ఉన్నట్లు మీడియాకు లీకులిచ్చారు. ఎంఆర్‌పి కంటే ఎక్కువకు లిక్కర్‌ను అమ్ముతున్న వ్యాపారులు తమ దందాకు అడ్డు రాకుండా చేసుకొనేందుకు ఎక్సయిజ్‌ అధికారులతో ఎక్కడికక్కడ రింగైనట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ సిండికేట్లు ప్రజాప్రతినిధులకు భారీగా ముడుపులు ఇచ్చినట్లు ఎసిబికి ఆధారాలు లభిం చాయని ప్రచారం జరిగింది.


'ఆదాయ' వనరులను తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు, కాంగ్రెస్‌ పార్టీలో ఆధిపత్యం సాధిం చేందుకు ముఖ్యమంత్రే మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు చేయించారని అప్పట్లో విమర్శలొచ్చాయి. పిసిసి అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని జిల్లాల్లో మద్యం సిండికేట్లను నిర్వహిస్తున్నందున, ఆయనకు చెక్‌ పెట్టేందుకు ముఖ్యమంత్రే ఎసిబితో దాడులు చేయించారని కాంగ్రెస్‌ నేతలే విమర్శించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బొత్స స్పందించి సిబిఐ విచారణ జరిపించాలని సిఎంను డిమాండ్‌ చేశారు. ఒక కేబినెట్‌ మంత్రి సిఎంను ఈ విధంగా విచారణ కోరడం రాష్ట్ర చరిత్రలో బహుశ ఎప్పుడూ జరగలేదు. ప్రతిపక్షాలు సైతం మద్యం సిండికేట్లపై సమగ్ర విచారణ జరిపించి నిందితుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్‌ చేశాయి. కాగా మద్యం సిండికేట్లలో టిడిపి నేతలు సైతం ఉన్నారని బొత్సతో సహా పలువురు నేతలు ఎదురుదాడి చేశారు. ప్రతిపక్షాల నుండి, అధికార పక్షం నుండి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో నెల కింద ఎసిబి చీఫ్‌ నేరుగా సిఎంకు ఒక నివేదిక అందజేశారు. దానిలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల పేర్లు ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అంతలోనే ఎసిబి అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో కేవలం కొందరు ఎక్సయిజ్‌ అధికారుల పేర్లను మాత్రమే ప్రస్తావించారు. తమకు దొరికిన ఆధారాల ప్రకారం సిండికేట్లలో మరికొంత మంది పబ్లిక్‌ సర్వెంట్లు ఉండొచ్చని అనుమానం వెలిబుచ్చారు.


దీనిపై సమగ్ర విచారణ జరిపితే నిజాలు వెల్లడవుతా యన్నారు. పబ్లిక్‌ సర్వెంట్లంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదని, ప్రజా ప్రతి నిధులు సైతం పబ్లిక్‌ సర్వెంట్ల కిందకి వస్తారని అప్పట్లో ఎసిబి అధికారులు పరో క్షంగా పేర్కొన్నారు. దాదాపు నెల రోజుల విరామం తర్వాత ఎసిబి అధికారులు మరో సారి మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహిం చారు. రెండు రోజులుగా పలు జిల్లాల్లో జరిపిన దాడుల్లో వ్యాపారుల్ని, ఎక్సయిజ్‌ అధికారులనే టార్గెట్‌గా చేసుకున్నారు. రాజకీయ నాయకుల జోలికి పోలేదు. కాంగ్రెస్‌లో అంతర్గతంగా కుదిరిన సర్దుబాట్ల నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల కార్యకలా పాలకు ఎసిబి ముసుగు తొడిగి నట్లు సమా చారం. నేతల గురించి ఎసిబికి లభించిన సమాచారాన్ని చూపించి సదరు నేతలను తన గుప్పెట్లో పెట్టుకోవాలని, ఎప్పుడైనా ఆ నాయకులు తోక ఆడిస్తే సిద్ధంగా ఉన్న సిండికేట్‌ అస్త్రాన్ని ప్రయో గించి దారికి తెచ్చుకోవాలని ప్రభుత్వాధినేత పావులు కదుపుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఎసిబి చీఫ్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం... వరంగల్‌, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, హైదరాబాద్‌ జిల్లాల్లో మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహించి 11 మంది

వ్యాపారులు, ఎనిమిది మంది ఎక్సైజ్‌ సిబ్బందిని అరెస్టు చేశారు. ఓ ఎక్సైజ్‌ అధికారికి మద్యం వ్యాపారులు రూ.2.44 కోట్ల మామూళ్లు అందజేసినట్లు విచారణలో తేలింది.


ఒక జిల్లాలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ వ్యాపారులతో కుమ్ముక్కై రూ. 53 లక్షలను పెట్టుబడి పెట్టారు. ఒక జిల్లాలో ఓ సిఐకి 37 లక్షలు, మరో జిల్లాలో ఇద్దరు ఎక్సైజ్‌ సిఐలకు 22 లక్షలు, మరో జిల్లాలో ఎక్సైజ్‌ ఎస్‌ఐకి 10లక్షలను మద్యం సిండికేట్లు లంచం ఇచ్చారు. వీరే కాకుండా చాలా మంది పోలీసు అధికారులకు కూడా మద్యం సిండికేట్లతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. డిసెంబర్‌లో జరిపిన దాడుల్లో లభ్యమైన ప్రకారమే మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహించారు. మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు తీసుకున్న వారిపౖౖె కేసులు నమోదు చేశారు. ఈనెల 25, 27 తేదీల్లో అయిదు జిల్లాల్లో మద్యం సిండికేట్లపై దాడులు జరిపారు. వీటికి సంబంధించి 750 పేజీల రిపోర్టును తయారు చేసి ఏసిబి న్యాయస్థానానికి అందజేస్తారు...ఇదిలావుండగా ఎక్సైజ్‌ శాఖలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అందరికీ మద్యం వ్యాపారులు లంచాలు ఇచ్చినట్లు ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు. వీరి పేర్లను రిమాండ్‌ రిపోర్టులో స్పష్టంగా తెలిజేయనప్పటికీ ఫలాన ప్రాంతంలో ఎక్సైజ్‌ సిఐలు, ఏసిలు, డిసిలు, ఈఎస్‌లు, సిబ్బంది ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. దాని ప్రకారం నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని ఏసిబి ప్రకటించింది.

No comments:

Post a Comment