- కొనసాగుతున్న రబీనాట్లు
- అపరాల సాగుపై ప్రతికూల ప్రభావం
- రూ.45 కోట్ల ఉత్పత్తికి దెబ్బ
(న్యూస్‌టుడే,పి.గన్నవరం): అన్నదాతకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఈ రబీ సీజన్‌లో వరికి తీవ్ర నీటిఎద్దడి ఏర్పడింది. మరో వైపు ఎక్కడెక్కడ రబీ ఆయకట్టును అనుమతించాలనే విషయంలో అధికారులు,
ప్రజాప్రతినిధులు సుమారు నెల రోజలు పైగా తాత్సారం చేశారు. దీంతో నెలకొన్న అయోమయ పరిస్థితులతో రబీ పంట బాగా ఆలస్యంగా మొదలైంది. దీంతో రైతులు బోనస్ పంటైన అపరాలను కోల్పోవాల్సి వస్తోంది. సాధారణంగా రబీ సీజన్ 120 రోజులు... ఇప్పటికే 60 రోజల పంటకాలం పూర్తికావాల్సి ఉండగా జిల్లాలో ఇంకా నాట్లు పడుతూనే ఉన్నాయి. సాధారణంగా నవంబరు, డిసెంబరు నెలల్లో ప్రారంభమయ్యే రబీపంట మార్చి మాసాంతానికి చేతికొస్తుంది. రబీ పంటకు... ఖరీఫ్ ప్రాంరంభానికి మధ్యలో ఉన్న రెండు నెలల 15 రోజుల ఖాళీ వ్యవధిలో అపరాలు పండిచేందుకు వీలుంటుంది. సాధారణంగా జూన్ మొదటి వారానికి ఆ పంట చేతికొస్తుంది. ప్రస్తుతం రబీసాగు ఆలస్యం కావడంతో ఆ పర్యవసానం వచ్చే అపరాల సాగుపై పడే పరిస్థితి కనిపిస్తోంది. నాట్లు ఆలస్యంగా పడటంతో సుమారు లక్ష ఎకరాల విస్తీర్ణంలో అపరాలు వేసేందుకు సీజన్ దక్కని పరిస్థితి నెలకొంది. లక్ష ఎకరాల్లో సుమారు రూ.45 కోట్లు విలువచేసే 15 వేల మెట్రిక్‌టన్నుల అపరాలు ఉత్పత్తి అవుతాయి. నాట్లు ఆలస్యం కావటంతో ఈ మేరకు రైతుకు నష్టం జరగనుంది.
No comments:
Post a Comment