అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, March 28, 2013

బ్యాడ్‌ ఏప్రిల్‌

  • సగటు మనిషిపై భారాల సమ్మెట దెబ్బ
  • కొత్త ఆర్థిక సంవత్సర ఆగమన వేళ డీలా!
ఏప్రిల్‌ ఒకటి.. కొత్త ఆర్థిక సంవత్సర ప్రారంభ దినం.. ఎవరైనా కొత్త ఆర్థిక సంవత్సరంలో తన ఇంటి బడ్జెట్‌.. వస్తున్న ఆదాయానికి అనుగుణంగా ఉండాలని, ఉన్నంతలో కాస్త మిగుల్చుకోవాలని ఆశిస్తాడు. రానున్న ఏప్రిల్‌ ఒకటో తేదీ

రూపు మారుతున్న కేబుల్‌ టీవీ ప్రసారాలు

కేబుల్‌ టీవీలకు డిజిటలైజేషన్‌ రెండోదశ గడువు దూసుకొచ్చే సింది. దేశవ్యాప్తంగా ఈ నెల 31లోగా సెట్‌ టాప్‌ బాక్స్‌ (ఎస్‌.టి.బి) లను ప్రతి టీవీ వినియోగదారుడూ తప్పనిసరిగా బిగించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మరో నాలుగురోజుల్లో అమలులోకి రానుంది. ఈ ఎస్‌.టి.బిలు లేకుంటే టీవీ ప్రసారాలు ఆటోమేటిగ్గా ఆగిపోతాయనే సూచనను ఇప్పటికే కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా పంపించారు. ఈ బాక్స్‌ల వల్ల వినియోగదారులకు ఎటువంటి లాభం కలుగుతుంది? వాటి మార్కెట్‌ విలువ ఎంత? ఎక్కడ దొరుకుతాయనేది సాధారణ వినియోగదార్లకు సమస్యగా... కేబుల్‌ ఆపరేటర్లకు వరంగా మారింది.

లెక్క తేలడంలేదు - దగ్గరపడుతున్న డిజిటైజేషన్‌ గడువు


నూరు శాతం దాటిందంటున్న మంత్రిత్వ శాఖ
సగం కూడా కాలేదంటున్న ఆపరేటర్లు 
పొంతన లేని గణాంకాలతో అంతా గజిబిజి
అందుబాటులో లేని సెట్‌టాప్‌ బాక్సులు 
1నుంచి టీవీ ప్రసారాలపై అసందిగ్ధత 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 25 పంచాయతీల విలీనం!



పక్షం రోజుల్లోగా ప్రజాభిప్రాయ సేకరణ
నోటిఫికేషన్‌ జారీ
ఈనాడు, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా
హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో మరో 25 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నగరానికి అత్యంత సమీపంలో ఉండి, అభివృద్ధి చెందుతున్న ఆయా పంచాయతీలను

Monday, March 11, 2013

ఫోన్ల ట్యాపింగ్‌, మెయిల్స్‌ తనిఖీ : మొబైళ్లు, అంతర్జాలంపై పెరిగిన నిఘా

అనుమతి కోసం సగటున రోజూ 13 వినతులు
అమెరికా తర్వాత అధిక ఆరా మనదే
రాష్ట్రంలోనూ పెరుగుతున్న ఫోన్ల ట్యాపింగ్‌
మెయిల్లో ఏముంది..!
ఆ వెబ్‌సైట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారు?
ఏ వీడియోను ఎవరు అప్‌లోడ్‌ చేశారు!
అనుమానాస్పద వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారు..!

ఈఎస్‌ఐ ఉనికి ప్రశ్నార్థకం!



ఆసుపత్రి తరలింపునకు రంగం సిద్ధం
స్వాధీనానికి కార్పొరేషన్‌ ప్రయత్నం
వైద్య కళాశాలకు కేటాయించే యోచన
ఈనాడు- హైదరాబాద్‌, న్యూస్‌టుడే- సనత్‌నగర్‌
తరతరాలుగా లక్షలాది కార్మికులకు సేవలు అందిస్తున్న సతన్‌నగర్‌ ఈఎస్‌ఐ

మంత్రిగారి 'మాస్టర్‌ప్లాన్‌' - eenadu


హైదరాబాద్‌ విస్తరిత ప్రాంత బృహత్‌ ప్రణాళిక-2031లో మాయాజాలం
ఇష్టానుసారం జోన్ల మార్పిడి
ప్రజోపయోగ ప్రాంతాలు నివాస ప్రాంతాలుగా మార్పు
అమాత్యుడి ఒత్తిడికి తలొగ్గిన అధికారులు
మాస్టర్‌ప్లాన్‌ ముసుగులో 'రియల్‌' దందా
పర్యావరణం, సామాజిక అవసరాలకు నష్టమంటున్న నిపుణులు

Friday, March 1, 2013

తినకు... చూడకు... మాట్లాడకు...


వేసవి రాకమునుపే కోత!




నేటి నుంచి అధికారికంగా రెండు గంటల కరెంటు కోతలు
ఈనాడు, హైదరాబాద్‌
వేసవి రాకమునుపే నగరంలో విద్యుత్తు కోతలు మొదలయ్యాయి. శుక్రవారం

నగర జీవికి నిరాశే

ఆశలపై నీళ్లు...
కేంద్ర బడ్జెట్ మాయాజాలం
వేతనజీవుల ఆశ అడియాశే
వీకెండ్ జోష్‌కు కళ్లెం
బ్రాండెడ్ వస్తువులతో విలాసాలు ‘ఖరీదు’
లగ్జరీకి మధ్యతరగతి దూరం..దూరం

సాక్షి, సిటీబ్యూరో: అర్థం కాని అంకెలు.. గణాంకాల గారడి.. జనానికి బురిడీ.. అంతా చిదంబర రహస్యం. వేతన జీవుల, మధ్య తరగతి వాసుల ఆశలపై కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లింది. సిమెంటు, స్టీలు ధరలు పెరగడంతో సగటు జీవులకు సొంతింటి కల కల్లగానే మిగలనుంది. గృహ రుణాలపై ఒక శాతం వడ్డీ రాయితీ ఒకింత ఊరట. నగరంలో

నేటి నుంచి ‘కోత’లు షురూ..


Thursday, February 28, 2013

రైల్వే బడ్జెట్‌లో రంగారెడ్డిజిల్లా ఊసేలేదు...

కలల్లోనే రైళ్లు.. కాగితాల్లో హామీలు..
కొత్త బడ్జెట్‌లోనూ జిల్లా వాసికి నిరాశే
ఈనాడు, రంగారెడ్డిజిల్లా
కొత్త రైళ్లు వస్తాయన్న ఆశలు ఆవిరైపోయాయి. .ఆదర్శ రైల్వేస్టేషన్లుగా

మెదక్‌ జిల్లాకు అరకొర కేటాయింపులు

మోదం... ఖేదం
మనోహరబాద్‌-కొత్తపల్లి లైన్‌కు రూ.20 కోట్లు
అక్కన్నపేట-మెదక్‌ లైన్‌కు రూ.1.10 కోట్లు
సిద్దిపేట-అక్కన్నపేట కొత్త లైన్‌ సర్వే
ఇదీ రైల్వే బడ్జెట్‌ తీరు
న్యూస్‌టుడే, మెదక్‌
రైల్వే బడ్జెట్‌పై జిల్లావాసులు పెట్టుకొన్న ఆశలు పూర్తిస్థాయిలో నెరవేరలేదు. ఆయా ప్రాజెక్టులకు వందల కోట్లు అవసరమైతే నామమాత్రం నిధుల

'లైఫ్‌ ఆఫ్‌ పై' అద్భుతాల వెనుక ఓ తెలుగమ్మాయి

నార్నియా', 'లైఫ్‌ ఆఫ్‌ పై' సినిమాల్లోని అద్భుతమైన గాఫిక్స్‌ వెనుక వందల మంది యానిమేటర్ల శ్రమ ఉందన్నది తెలిసిందే! కానీ వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి, అద్భుతాలు ఆవిష్కరించడం వెనుక ఓ తెలుగమ్మాయి ఉంది. ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఆస్కార్‌ సాధించిన 'లైఫ్‌ ఆఫ్‌ పై'కి గ్రాఫిక్స్‌ అందించిన రిథమ్‌ అండ్‌ హ్యూస్‌ సంస్థ ఆసియా విభాగానికి విజయనగరానికి చెందిన వాణి సరస్వతి వెలగం నేతృత్వం వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో 'ఆస్కార్‌'ముంది! : యానిమేషన్‌ హబ్‌గా రాజధాని

విజువల్‌ ఎఫెక్ట్స్‌లో ప్రత్యేక ముద్ర
'లైఫ్‌ ఆఫ్‌ పై' ఆస్కార్‌లో భాగ్యనగరానికి భాగస్వామ్యం
ఈనాడు ప్రత్యేక విభాగం
చిన్న పడవలో ఓ పులి, పై పటేల్‌. ఉన్నట్టుండి సాగరంలో ఒక్క కుదుపు.

రాష్ట్రానికి 9 ఎక్స్‌ప్రెస్‌లు



రాష్ట్రం మీదుగా ప్రయాణించేవి మరో 6
ఒక మెము, ప్యాసింజర్‌ రైలు కూడా
దేశవ్యాప్తంగా మొత్తం 67 ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు
26 కొత్త ప్యాసింజర్లు
57 రైళ్ల పొడిగింపు
24 రైళ్ల రాకపోకల సంఖ్య పెంపు
ఈనాడు - న్యూఢిల్లీ
రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 9 కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ఒక ప్యాసింజర్‌

రాష్ట్రానికి సున్నం : ఈసారీ కేటాయింపుల్లో రిక్తహస్తం




డబ్లింగ్‌కు గత ఏడాది కంటే రూ.54 కోట్ల తగ్గింపు
కొత్త లైన్లకు పెరగని కేటాయింపులు
సర్వే పూర్తయిన ప్రాజెక్టులూ బేఖాతరు
కొత్త రైళ్ల ప్రకటనలోనూ తీవ్ర అన్యాయమే
ఈనాడు - హైదరాబాద్‌
లాభార్జనలో బంగారు బాతులాంటి దక్షిణ మధ్య రైల్వేకు ఈ బడ్జెట్‌లోనూ

1 సర్వే... 2 రైళ్లు... 3 పొడిగింపులు : గ్రేటర్‌కి దక్కింది అంతే


హైదరాబాదీలకు అందని బన్సాల్‌ రైలు
సికింద్రాబాద్‌లో ఆర్థిక నిర్వహణపై శిక్షణా కేంద్రం ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, సికింద్రాబాద్‌
నగరవాసులకు బన్సాల్‌ రైలు బండి అందకుండాపోయింది. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తీవ్రంగా నిరాశపరిచింది. రైల్వేలపరంగా ఎన్నో ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్న హైదరాబాదీలకు ఎప్పటిలాగే మొండిచేయి చూపారు. పాత ప్రకటనలను, హామీలను,

Friday, February 22, 2013

ఉగ్రవాదుల అడ్డా ఆంధ్రప్రదేశ్‌


లష్కర్‌ ఏ తోయిబా, ఇండియన్‌ ముజాహిదీన్‌ల పాగా
ఎంతోమంది తీవ్రవాదుల ఆశ్రయం
కర్ణాటక, మహారాష్ట్రాల్లోనూ తిష్ఠ
కోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఉగ్రవాదుల అడ్డాగా మారిందా అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ పోలీసులు. మొన్న గోకుల్‌ చాట్‌, లుంబిని పార్కు, నేడు దిల్‌షుక్‌నగర్‌ వరుస బాంబు పేలుళ్లలో అట్టుడికిన రాష్ట్రం ఉగ్రవాదుల

నగరంలో బాంబు పేలుళ్ల ఘటనలివీ...

 హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని మరోమారు బాంబుపేలుళ్లతో రక్తసిక్తమైంది. దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో గురువారం వరుస పేలుళ్లు సంభవించాయి.

Thursday, February 21, 2013

నిర్భయమేదీ?

ఐటీ జోన్‌లో భద్రత అంతంతమాత్రమే
అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, మాదాపూర్‌
హైటెక్‌ సిటీ... భారతదేశపు సిలికాన్‌ వ్యాలీ... అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానమున్నా అక్కడ భద్రత అంతంతమాత్రమేనని తేలిపోయింది. పెట్రోలింగ్‌ పెంచామంటూ పోలీసులు చెబుతున్నా అది కొద్దిరోజులకే పరిమితం. అనుకోని ఘటనలు, నేరాలు, ఘోరాలు జరిగిన సమయంలో వాటిని

కామాంధులపై 'కారప్పొడి' అస్త్రం

పెప్పర్‌ స్ప్రే చల్లి, ఆటోలోంచి దూకి
తప్పించుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని
24 గంటల్లోపే నిందితుల అరెస్టు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
హైటెక్‌ సిటీలో మంగళవారం అపహరణ యత్నానికి గురైన యువతి తనను తాను రక్షించుకున్న వైనం మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తాగిన మైకంలో ఉన్న ఆటోడ్రైవర్‌ అతని స్నేహితులు ఆటో దారి మళ్లించి ఒంటరిగా

Sunday, January 27, 2013

అభివృద్ధికి 'మహా' నిర్దేశం

2031 వరకు ప్రణాళికబద్ధమైన పురోగతి
వ్యవసాయ, నివాస జోన్లకే పెద్దపీట
బృహత్‌ ప్రణాళికలో అనేక కీలక మార్పులు
రవాణా వ్యవస్థకు సమగ్ర రూపం
చర్చనీయాంశంగా మారిన 'మారటోరియం'

(ఈనాడు, హైదరాబాద్‌) January 26, 2013
నడవాలంటే ఒక దారి కావాలి. మరి అభివృద్ధికి.. ఒక వ్యూహం.. అంతకుమించిన ప్రణాళిక ఉంటేనే అది అర్థవంతమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంచనాలకు మించి దూసుకుపోతున్న పట్టణీకరణ దరిమిలా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ప్రాధాన్యం ఎంతో పెరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న హైదరాబాద్‌ నగరం రోజురోజకీ శరవేగంగా విస్తరిస్తోంది. గణనీయమైన అభివృద్ధి సాధిస్తోంది. హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి రూపొందించిన బృహత్‌ ప్రణాళిక-2031 ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల కసరత్తుతో రానున్న 20 ఏళ్లకు వేసిన ప్రణాళికలోని ప్రధాన అంశాలను ఓసారి పరిశీలిస్తే...

మహా ప్రణాళిక... ఆహా అభివృద్ధి


రూ.లక్ష కోట్లు కావాలి!

భారీగా 'హైమా' సమగ్ర ప్రణాళిక భారం
నిధులు కేటాయింపు అంత సులువు కాదు

ఈనాడు, హైదరాబాద్‌, January 25, 2013
అవును... నిజమే... తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన హైదరాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేయాలంటే ఒకటి కాదు... రెండు కాదు... అక్షరాల లక్ష కోట్ల రూపాయలు అవసరం. రానున్న 20 ఏళ్లలో ఇంత భారీ మొత్తం కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమేనా? లేక మునుపటి ప్రణాళికల మాదిరిగానే ఇదీ కాగితాలకే పరిమితం కానుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నగరంతో పాటు సరిహద్దున ఉన్న అయిదు జిల్లాల్లోని 5,965 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హైమా) అభివృద్ధి మాస్టర్‌ ప్లాన్‌ ఖరారైంది. సుమారు రెండేళ్ల కసరత్తు అనంతరం ఒక కొలిక్కివచ్చిన దీనికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

ఇక 'మహా' అభివృద్ధి!

నగరం చుట్టూ ప్రణాళికాబద్ధంగా..
అడ్డదిడ్డ కట్టడాలకు చెల్లుచీటీ
సహజ వారసత్వ ప్రాంతం నుంచి వూరట
300 మీటర్ల వరకూ గ్రామ కంఠ పరిధి
బృహత్తర ప్రణాళికపై ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

ఈనాడు - హైదరాబాద్‌ Friday, January 25, 2013
హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి బృహత్తర ప్రణాళికకు ఎట్టకేలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ముసాయిదాను విడుదల చేసిన దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రణాళికను అమల్లోకి తెస్తూ గురువారం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ముసాయిదాలో స్వల్ప మార్పులు చేర్పులు చేసింది. వచ్చే 20 ఏళ్లలో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి అంతా ఈ ప్రణాళికను అనుసరించే జరగనుంది. 2031 వరకూ హైదరాబాద్‌ చుట్టూ 5 జిల్లాల్లోని 35 మండలాలు... 849 గ్రామాలు... 5,965 చదరపు కిలోమీటర్ల విస్తరిత ప్రాంతం కోసం హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించింది.

Thursday, January 24, 2013

బాలికలు తగ్గారు! - జాతీయ బాలికల దినోత్సవం



సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా గత దశాబ్ద కాలంలో బాలికల శాతం తగ్గింది. గత దశాబ్ద కాలంలో సుమారు 30 లక్షల మంది బాలికలు అదృశ్యమయ్యారు.
Written by Parvathi On 1/24/2013 11:41:00 AM
ఆడపిల్ల పుడితే ఆడపిల్ల కాదు... పాడు పిల్ల అనే అవగాహన నుంచి బయటపడితే మహిళల మీద జరుగుతున్న హింసకు అడ్డుకట్ట పడుతుంది. ఆడపిల్ల పుట్టుక భారంగా భావించి పురిటిలోనో, గర్భస్థ శిశువుగానో కడతేర్చే పరిస్థితులున్న సమాజంలో వారి భద్రత ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే మారింది. చాలా సందర్భాల్లో ఆడ శిశువులను పిండంగానే పరిమారుస్తున్న పరిస్థితి నిత్యం జరుగుతోంది.