బలవర్థకమైన ఆహారం గురించి అనుకోగానే చటుక్కున చెప్పేసేవి పిస్తా, బాదం, జీడిపప్పు. ఎప్పుడూ అవేనా? ఇంకేంటి అని ఆలోచిస్తే... ఆరోగ్యానికి అన్నివిధాలా ఉపయోగపడే వాల్‌నట్లు మేమున్నామంటాయి. కొవ్వుని తగ్గించి.. జ్ఞాపకశక్తిని పెంచి.. గుండె ఆరోగ్యానికి మేలుచేసే వాటి ఉపయోగాలు తెలుసుకుందాం.
పల్లీలు, పిస్తాలు.. బాదంపలుకులు, జీడిపప్పులు రుచిలో కాదు పోషకాల్లోనూ వేటికవే సాటని మనకి తెలుసు. అయితే ఆరోగ్యకరమైన పోషకాలని అందించే క్రమంలో మాత్రం
వాల్‌నట్ కంటే ఇంకేవి ముందు ఉండవు అంటున్నాయి తాజా అధ్యయనాలు. పైకి ముదురు గోధుమ రంగులో గుండ్రంగా కనిపిస్తూ.. పగలకొట్టి చూస్తే గజిబిజిగా మెదడు ఆకృతిలో కనిపించే ఈ వాల్‌నట్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ముందుంటాయి. అంతటితో అయిపోలేదు.. దీని సుగుణాలు తెలుసుకొంటూ పోతే బోలెడు.
అధిక బరువు అదుపులో..
రోజులో కనీసం గుప్పెడయినా సరే ఈ గింజలని తింటే.. భోజనానికి సంపూర్ణత్వం వచ్చినట్టే అంటున్నారు పోషకాహార నిపుణులు. కారణం.. రోజువారీ అవసరాలకు సరిపడే యాంటీఆక్సిడెంట్లు వీటి నుంచి అందుతాయి కనుక. కాకపోతే చాలామందిలో గింజలని తినడం వల్ల కొవ్వు పేరుకు పోతుందని, అధికంగా కెలొరీలు చేరిపోతాయనే అపోహ ఉంది. వాస్తవానికి గింజలన్నింటిలోనూ శరీరానికి మేలు చేసే పాలీ అన్‌సాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఈ మేళవింపు వాల్‌నట్‌లలో సమపాళ్లలో ఉండటం వల్ల ప్రయోజనాలు అధికం. సాయంత్రాలు స్నాక్స్‌కు బదులుగా వీటిని కాసిన్ని తినడంవల్ల.. వీటిల్లోని పీచు, మాంసకృత్తుల వల్ల వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో జంక్‌ఫుడ్‌పై మనసు మళ్లదు. రోజులో ఏడు నుంచి ఎనిమిది గింజలని తింటే సరిపోతుంది. దీని వల్ల అధిక బరువు అదుపులో ఉంటుంది. అలాని వేయించి రుచిగా ఉప్పు వేసి లాగించేద్దాం అనుకొంటే మాత్రం దానిలోని యాంటీఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. మితం అవసరం. బరువును తగ్గించుకొనేందుకు చేసే వ్యాయామాల అనంతరం ఈ గింజలను తినడం వల్ల తక్షణం ఒత్తిడి తగ్గి ఉత్సాహం పుంజుకొంటారు. వాల్‌నట్లు నిద్ర సమస్యలను దూరం చేసే యాంటీడిప్రసెంట్లుగా పనికొస్తాయి.
గుండె జబ్బుల నివారణకు..
సుమారు నలభై గ్రాముల వాల్‌నట్ పప్పుని నిత్యం తినేవారిలో గుండెజబ్బులు దూరం అంటున్నారు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్లు. కారణం వీటిలోని పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులతో పాటు.. ఒమెగాత్రీ సుగుణాలు గుండె నాళాల్లో అడ్డంకులు లేకుండా చూస్తాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి హానిచేసే కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. దీనిలోని అల్ఫాలినోలీనిక్ యాసిడ్ గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా రక్షణ కల్పిస్తుంది. అయితే రుచికోసం వెన్న, ఉప్పు, పంచదార వంటి వాటిని కలిపితే మాత్రం ప్రయోజనాలు శూన్యం.
క్యాన్సర్లని అధిగమించేందుకు...
సాయంత్రం పూట వేడివేడిగా ఫ్రెంచ్‌ఫ్రైస్, కారంకారంగా సమోసాలు తినడానికి బదులు పప్పుని తింటే రొమ్ముక్యాన్సర్ వచ్చే సమస్య రెండు రెట్లు తక్కువగా ఉంటుందని వెస్ట్‌వర్జీనియాలోని మార్షల్ విశ్వవిద్యాలయ అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లోని ఫైటోస్టిరాల్స్, ఒమెగాత్రీ ఫ్యాటీ ఆమ్లాలు, పాలీఫినాల్స్... క్యాన్సర్ కణుతులు ఎదుగుదలని అడ్డు కొంటాయి.
మతిమరుపు సమస్యలకు చెక్... చూడ్డానికి మెదడు ఆకృతిలో ఉండే వాల్‌నట్లు జ్ఞాపకశక్తికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా చిన్నారుల్లో.. వయసుమళ్లిన వారిలో జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు రాకుండా చూస్తాయి. గర్భిణులు కొద్ది మోతాదులో తినడం వల్ల గర్భస్థ శిశువు కళ్లు, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. బాలింతలు తినడం వల్ల దీనిలోని మాంసకృత్తుల కారణంగా పాల వృద్ధి చెందుతాయి.
సౌందర్య పోషణలో భాగంగా...
వాల్‌నట్లని 'హెయిర్‌ఫుడ్'గా కూడా వ్యవహరిస్తారు.. శిరోజాల రక్షణకు ఉపయోగపడే బయోటిన్ పదార్థం దీనిలో పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.. కురులు పట్టుకుచ్చులా, పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతాయి. చివర్లు చిట్లే సమస్య క్రమంగా తగ్గుతుంది. దీనిలోని కాపర్ చర్మానికి సాగే గుణాన్ని అందిస్తుంది. వయసుతో పాటు ఎదురయ్యే చర్మ సమస్యలని నివారిస్తుంది. వృద్ధాప్య లక్షణాలు తగ్గించి చర్మం నిగారింపుతో మెరిసిపోయేట్టు చేస్తుంది. ఎముక బలానికి సహకరిస్తుంది. మృతకణాలు తొలగించేందుకు దీనితో చేసిన స్క్రబ్‌లు కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి.
చివాల్‌నట్ నూనెకు తీవ్రమైన ఒత్తిడిని తక్షణం నివారించే గుణం ఉంది. మనకు అందుబాటులో ఉన్న తొమ్మిది రకాల గింజలతో పోలిస్తే వాల్‌నట్లలో అత్యధిక యాంటీఆక్సిడెంట్ సుగుణాలున్నాయి. ఇతర రకాల నట్స్‌ని రెండు వంతులు తీసుకొంటే ఎన్ని సుగుణాలు అందుతాయో.. ఒకవంతు వాల్‌నట్ నుంచీ అన్నే అందుతాయి.
చిటైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి.
చిఓట్స్, పాలతో.. వాల్‌నట్లని తినడం వల్ల రోజంతా హుషారుగా పనిచేస్తారు.
చిసూపుల్లో చిక్కదనం కోసం.. పెరుగుతో పాటు తినడం వల్ల కూడా మేలు ఫలితాలు అందుతాయి.
దీనిలోని విటమిన్ 'ఇ' చర్మానికి నిగారింపును తీసుకొస్తుంది. కళాగా కనిపించడానికి తోడ్పడుతుంది.
No comments:
Post a Comment