అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, January 20, 2012

ఇవి తింటే ఆలోచనలు అద్భుతం....?

ఆరోగ్యవంతమైన మనస్సు మరియు శరీరం సంవత్సరాల తరబడి మిమ్మల్ని ఆరోగ్యంగాను, చురుకుగాను వుంచుతుంది. మరి వీటిని పొందాలంటే అది యోగా చేయటం ద్వారానే కాదు ఆరోగ్యకర ఆహారం ద్వారా కూడా సాధ్యం. మానసిక చురుకుదనం పుట్టించటానికి మైండ్ ను ఆరోగ్యంగా వుంచటానికి కొన్ని ఆహారాలున్నాయి. అవేమిటో పరిశీలిద్దాం. 

విటమిన్ బి కాంప్లెక్స్ - బ్రెయిన్ కు విటమిన్ బి కాంప్లెక్స్ ఎంతో అవసరం. బ్రెయిన్ సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ బి కావాలి. అది వుండే ఆహారాలు, బంగాళదుంపలు, బీన్స్, బ్రక్కోలి, బచ్చలి, తోటకూరలు, మష్ రూమ్స్, సోయా ఉత్పత్తులు, బీట్ రూట్, అరటిపండ్లు, గుడ్డు, బాదం.

ధాన్య ఆహారాలు - గోధుమ, సిరియల్స్, గోధుమ బ్రెడ్, బ్రౌన్ రైస్, జొన్నలు, మొలకెత్తిన గోధుమలు, బ్రెయిన్ కు మంచి చురుకునిస్తాయి. అవగాహన, ఏకాగ్రత వస్తుంది. 

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు - మంచి జ్ఞాపక శక్తి, ఏకాగ్రతలుండాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా వుండే ఆహారాలు చేపనూనె, వెల్లుల్లి, టూనా చేప, టర్కీ, సల్మాన్, గుడ్లు, రైస్, సిరియల్స్, పస్తా వంటివి తినండి. 

కార్బోహైడ్రేట్లు - బ్రౌన్ రైస్, ఆపిల్స్, అరటిపండు, మొలకెత్తిన విత్తనాలు వంటివి కార్బోహైడ్రేట్లు అధికంగా కలిగి వుంటాయి. మైండ్ బాగా వుండి, అవగాహన, ఏకాగ్రత, చురుకుదనం వంటివి నిరంతరం కలిగి వుండాలంటే దానికి తగిన శక్తి అందించటానికిగాను ఈ ఆహారాలు తప్పక ప్రతిరోజూ తినాలి.

No comments:

Post a Comment