అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Saturday, October 18, 2014

ప్రేమ‌ - విప్ల‌వం...2

- మార్క్స్‌, జెన్నీ ప్రేమ కథ
- స్వేచ్ఛానువాదం: ముక్తవరం పార్థసారథి
        తనలో ఏదో మార్పు వస్తోంది. ఈ పరిస్థితి గురించి మొదటి సంవత్సరంలోనే తండ్రికో లేఖ రాశాడు కార్ల్‌ :
'డియర్‌ ఫాదర్‌,
               మిమ్మల్ని వదలి వచ్చినప్పుడు నా ముందు ఓ కొత్త లోకం ఆవిష్కృతమైంది. అది ప్రేమ లోకం. ఇంకా నేను చేరుకోలేని ఓ ప్రేమ లోకం. బెర్లిన్‌కు రావటం ఒక అద్భుతమైన అనుభవంగా మిగలాలి. కానీ అది కూడా నాకు ఆనందం ఇవ్వలేదు. శిలగా మారిన నా మనసుకన్నా కరకు శిలలేమీ నాకు దారిలో కనిపించలేదు. భోజనం

ప్రేమ - విప్ల‌వం

 ప్రపంచాన్ని మార్చే సిద్ధాంతాన్ని సృజించిన కారల్‌ మార్క్స్‌ జీవితం అత్యంత ఆసక్తికరమైంది. మార్క్స్‌ను ప్రేమించి, ఆ ప్రేమలో ఆయన బతుకును వెలిగించిన జెన్నీ మార్క్స్‌ జీవితం వైవిధ్యమైంది. సహజీవనం ఆరంభించడానికి ముందు వారిద్దరి మధ్యన ప్రేమలేఖల పర్వం కొనసాగింది. పీడిత సమాజాన్ని గురించి కలలు గని, ఆ కలల సాకారం కోసం యత్నించిన ధీశాలిలోని సున్నితమైన కోణాలు ఆ ఉత్తరాల్లో ఆవిష్కృతమయ్యాయి. అయితే ఇద్దరూ సహజీవనం ఆరంభించిన తర్వాత అసలు కష్టాలు మొదలయ్యాయి. కానీ వారిద్దరి మధ్యన గల ప్రేమ