కీరదోస కాయ మామూలు దోస రెండూ మనకు మేలు చేస్తాయి.
1. రక్తపోటులో తేడా ఏర్పడిన వారికి దోసకాయ తినడం మంచిది. అందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుంది.
2. దోసలోని లవణాలు గోళ్లను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి.
3. కళ్లకింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలుగా తొలగించగలవు. కళ్ళు ఉబ్బినట్లు ఉంటే వాటి మీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితాలు ఇస్తుంది.
4. శిరోజాల ఎదుగుదలకు కీర మంచిదే. అందులో సల్ఫర్, సిలికాన్ శిరోజాలకు ఆరోగ్యాన్నిస్తాయి.
5. దోసకాయ రసం కడుపులో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీరా బాగా పని చేస్తుంది.
6. దోసకాయను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్ 'కె' సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో వుంది. దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు.
7. కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి.
8. ముఖం కాంతిమంతంగా ఉండాలంటే రెండు టీ స్పూన్ల కీరదోసకాయ రసంలో రెండు టీ స్పూన్ల నిమ్మ రసం, రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మెరుస్తూ కోమలంగా ఉంటుంది
9. కీరదోసకాయ, కోడిగుడ్డు తెల్లసొన, టీ స్పూను నిమ్మరసం, గుప్పెడు పుదీనా ఆకులు... అన్నిటినీ మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను సుమారు పది నిమిషాల సేపు ఫ్రిజ్ లో ఉంచి తీసేయాలి. చల్లగా ఉండగానే ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తరవాత ముఖాన్ని చన్నీటితో కడగాలి. ఇలాచేస్తే జిడ్డు పోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది.
10. కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి.
No comments:
Post a Comment