అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label వ్యాసాలు. Show all posts
Showing posts with label వ్యాసాలు. Show all posts

Thursday, December 25, 2014

క్రిస్టియన్ మిషనరీలు 100 plus

Sakshi | Updated: December 25, 2014
క్రిస్టియన్ మిషనరీలు 100 plus
తెలుగు ప్రాంతంలో క్రైస్తవ మత పరిచయం ఏ సంవత్సరంలో జరిగిందో ఇతమిద్ధంగా చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ... 16వ శతాబ్దం తొలినాళ్లలో పోర్చుగీసులు అడుగుపెట్టిన నాటి నుంచి తెలుగువారికి ఏసు క్రీస్త్రు పరిచయమయ్యాడని క్రైస్తవ పెద్దల అభిప్రాయం.

1753లో ఫ్రెంచి నుంచి క్రిస్టియన్ మిషనరీలు కొన్ని తెలుగునాట క్రైస్తవ మతంపై గట్టి నమ్మకం కలగజేశాయని ఓ వాదన. 1800 నాటికి గోల్కొండ రాజ్యంలో

శాంతి సంబరం

    
     శాంతి, ప్రేమ, కరుణ రూపమే జీసస్‌. ఆదరణ, అభిమానం... సామరస్యం, సౌభ్రాతృత్వాల గడ్డ మన దేశం. అలాంటి దేశంలో ఏసుప్రభువు స్మరణతో జనం తరిస్తున్నది. మిన్నంటుతున్న ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్‌ సంబరాలను ఆస్వాదిస్తున్నారు. ఆకాశంలోని నక్షత్రాల్లా జీవన గమనంలో అందరికీ నవోదయం కావాలని ఆకాంక్షిస్తూ...
ఏసుకు మరో పేరు కాపరి. గొర్రెల పాకలో జన్మించాడు. ఆయన గురించి తెలుసుకోవాలంటే బైబిలు చదవాల్సిందే.కొత్త పాత నిబంధనలతో 66 పుస్తకములు కలిపితే బైబిల్‌. ఆ బైబిల్‌ను ఏసు సహచరులు,

Friday, March 2, 2012

అమెరికా ఒత్తిడికి దాసోహం


prajasakti   Thu, 1 Mar 2012, IST

సిరియా విషయంలో తీరు మార్చుకోవడం, ఇరాన్‌ విషయంలో వ్యవహరిస్తున్న వైఖరి భారత విదేశాంగ నీతిలో వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నాయి. విశాల జాతీయ ప్రయోజనాల ప్రాతిపదికగా స్వతంత్ర విధానాన్ని ఇంకెంతమాత్రం అనుసరించడం లేదు. సామ్రాజ్యవాద ఒత్తిళ్లు, అమెరికా భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలకు దాసోహమంటోంది.

Tuesday, January 31, 2012

తెలుగు మీడియా వృత్తి నైపుణ్యం కోల్పోతున్నదా?

 Mon, 30 Jan 2012, IST

నేటి దేశకాల పరిస్థితులలో రాజకీయ ప్రత్యామ్నాయం ఏమిటన్న విషయంలో సిపియం చాల స్పష్టమైన ప్రకటన చేసింది. ఇంతకన్నా కొద్దిగా ముందు ప్రకటించిన సిపిఐ ముసాయిదా రాజకీయ తీర్మానంలో కూడా ఈవిషయంపై

Monday, January 30, 2012

ప్రపంచీకరణ విధానాల పరాకాష్ట 'యానాం' ఘటనలు


 Sun, 29 Jan 2012, IST
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు యానాం ఘటననుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రపంచీకరణ విధానాలపేరుతో కార్మిక వర్గాన్ని నిస్సహాయులుగా చేయాలని పూనుకోవడం పొరపాటు. కార్మిక వర్గానికి యూనియన్లు లేకుండా ''డియానినైజేషన్‌'' చేయాలనే విధానం శుద్ధ తప్పు. కార్మిక చట్టాలు, కనీస వేతనాలు, బోనస్‌, శెలవు దినాలు, పి.ఎఫ్‌ వగైరా చట్టాలను అమలుచేయించే బాధ్యత ప్రభుత్వాలదే.

ప్రజలపై భారాలు కార్పొరేట్లకు రాయితీలా?


Mon, 23 Jan 2012, IST
ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రభావం నుండి దేశ ఆర్థిక వ్యవస్థ బయటపడేందుకు పెండింగ్‌లో ఉన్న సంస్కరణలను తిరిగి వేగవంతం చేయడం ఒక్కటే మార్గం అన్నట్లుగా ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ సెలవిచ్చారు. పెన్షన్‌ బిల్లు, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల నిర్ణయం ప్రస్తుతానికి పక్కన పెట్టినా, రాజకీయ ఏకాభిప్రాయం సాధించి వాటిని అమల్లోకి తెస్తామని భారత పారిశ్రామిక మండలికి హామీ ఇచ్చారు.

Friday, January 20, 2012

గణాంకాల గందరగోళం


ద్రవ్యోల్బణం తగ్గినట్లు కనిపించిన అంశాన్ని సైతం పారిశ్రామిక వేత్తలు, సంపన్నులు తమకు అనుకూలంగా రాయితీలు రాబట్టుకోవడానికి వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటిదాకా ద్రవ్యోల్బణం దాదాపు రెండంకెల స్థాయికి చేరుకుంది కాబట్టి, దాన్ని తగ్గించడానికి అనే పేరుతో రిజర్వుబ్యాంకు వడ్డీరేట్లను వరుసగా పెంచుతూ వచ్చింది. గత నెలలో ప్రకటించిన విధానం

స్వేచ్ఛకు సంకెళ్లా?

సామాజిక మీడియా పీక నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం తెర వెనుక కుట్రలు సాగిస్తోంది. ప్రజా ఉద్యమాలకు ప్రచార కర్తగా, ఆందోళన, నిరసనకారునిగా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ పని చేస్తోందన్న భయమే కేంద్రాన్ని కుట్రలు కుతంత్రాల వైపునకు లాక్కుపోతోంది. సోషల్‌ మీడియా విస్తృతికి చెక్‌ పెట్టాలని, నిబంధనల మాటున సమాచారాన్ని నాలుగ్గోడల మధ్య బంధించాలని పన్నాగం పన్నుతోంది. గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర వెబ్‌సైట్లలో అశ్లీల, అసభ్యకర, జాతి