అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, January 20, 2012

నిద్రతో పెరిగే అందం?

బరువు తగ్గాలంటూ వ్యాయా మాలు చేయడం, ఆహారాలను ఎంపిక చేసుకుని తినటం అంతా బాగానే వుంటుంది. కాని శరీరానికి కావలసిన మరో ప్రధానమైన అవసరం తగిన విశ్రాంతి. సరైన నిద్ర కొద్ది రోజులు లేకుంటే దాని ప్రభావం ముఖంలో కనపడుతుంది. కళ్ళకింద నల్లని చారలు వచ్చేస్తాయి. కళ్ళలో మెరుపు పోతుంది. మెల్లగా అది ముఖం అంతా పాకుతుంది. కనుక గాఢ నిద్ర మనిషికి అత్యవసరం. ప్రతిఒక్కరూ రోజుకు కనీసం 7 నుండి 8 గంటలపాటు నిద్రించాలని నిపుణులు చెపుతున్నారు. నిద్రను అశ్రద్ధ చేయరాదనటానికి కొన్ని కారణాలు చూడండి. 



1. వయసు పెరిగినట్లు కనపడతారు - 30 సంవత్సరాల వయసులోనే 40 సంవత్సరాలు పైబడి కనపడతారు. ప్రయాణాలు చేసిన వారంలో సరైన నిద్ర లేకుంటే దాని ప్రభావం అలసిన మీ ముఖంలో స్పష్టంగా కళ్ళలోను, పెదవులలోను సన్నని ముడుతలుగా కనపడుతుంది. అలసటకు అవే చిహ్నాలు. 
2. కళ్ళు ఎంతో ప్రధానం - మెరిసే కళ్ళు మేకప్ తో రావు. సహజంగా మెరిసే కళ్ళు అందానికి అద్దం పడతాయి. మంచి నిద్ర లేకుంటే, జబ్బుపడ్డవారుగా కనపడతారు. మరల పుంజుకోడానికి చాలా సమయం పడుతుంది. 
3. అలసిన చర్మం - చర్మం కూడా మెరుపు కోల్పోతుంది. డల్ గా కనపడుతుంది. మంచి నిద్ర పోయి లేచిన తర్వాత వచ్చే ముఖంలోని కాంతిని దేనితోనూ పొందలేము. 
4. చర్మంలోని నూనెల అసమతుల్యత - మీ చర్మంలోని ఆయిల్ బ్యాలన్స్ అవాలంటే కనీసం 7 గంటలు నిద్ర కావాలి. నిద్రించేటపుడు శరీరం సహజ ఆయిల్స్ తయారు చేస్తుంది. చర్మాన్ని తేమగా వుంచుతుంది. నిద్ర లేకుండా చర్మం బిరుసుగాను, చేప చర్మం వంటి పొలుసులతోను కనపడి మీకు వయసు పైబడ్డట్లు అనిపిస్తుంది. 
5. మరో ఆశ్చర్యకర విషయం నిద్ర సరిగా లేకుంటే బరువు పెరుగుతారనేది. కారణం ...నిద్ర సరిలేని వారు వ్యాయామం వంటివి చేయరు. అంతే కాక తినటానికి ప్రాధాన్యతనిస్తారు. నిద్రసరిగా లేకుంటే రెండు వారాలలో కనీసం 5 పౌండ్ల బరువు పెరగటం ఖాయం అంటారు నిపుణులు. 
6. హార్మోన్ల అసమతుల్యత - నిద్ర సరిలేకుంటే ఒత్తిడికి హార్మోన్లలో అసమతుల్యత కలుగుతుంది. హార్మోన్లు సరైన నిష్పత్తిలో లేకుంటే చర్మం ఆరోగ్యంగా వుండదు. 
7. నిద్ర సరిలేకుంటే ప్రధానంగా తలనొప్పులు సైతం వచ్చేస్తాయి. ఇక అందంగా వుందామనే భావనలు కూడా మీకు రావు. 

కనుక సూచించిన సహజ చిట్కాలు పాటించి అందంగా, కాంతివంతంగా కనపడుతూ ఉల్లాసంతో ఆనందించండి.

No comments:

Post a Comment