అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label మిరప. Show all posts
Showing posts with label మిరప. Show all posts

Thursday, April 26, 2012

మిర్చి రైతు కంట్లో ‘కారం’!



వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు సంబంధించి దళారుల మోసాలను కాసేపు పక్కన పెడితే... అనేక కారణాల వలన కూడా ధరలకు నిలకడ కొరవడుతున్నదని చెప్పక తప్పదు. ప్రభుత్వ యంత్రాంగం ధరల స్థిరీకరణకు వ్యవస్థాగతంగా ఇప్పటివరకూ సానుకూల చర్యలు చేపట్టలేదు. ధరల స్థిరీకరణ జరగకనే దళారులు దండుకుంటున్నారనే వాస్తవాన్ని ప్రభుత్వం గమనించనట్టు నటిస్తున్నది.వ్యవసాయ ఉత్పత్తుల ధరలను దళారులతో పాటు రాష్ట్రీయ, అంతర్రాష్ట్రీయ మార్కెట్ శక్తులు నిర్ధారిస్తాయనేది ఓ నగ్న సత్యం. ఈ పరిస్థితుల్లో బక్కచిక్కిన సన్న, చిన్నకారు రైతన్నల బాగోగులకు బాధ్యత వహించాల్సింది వ్యవస్థే! రైతు

Monday, April 23, 2012

అమ్ముకోలేక.. దాచుకోలేక..


పంట అమ్మాలంటే ధరల్లేవు.. నిల్వ చేద్దామంటే గిడ్డంగులు లేవు
గిడ్డంగుల అద్దెలు పైపైకి.. పంటల ధరలు కిందికి
ఆరుగాలం కష్టపడినా మార్కెట్ మాయతో దగా
దళారుల నిలువు దోపిడీతో నష్టాలే మిగులు..
రైతు కష్టాలకు కేరాఫ్‌గా మారిన మిర్చి మార్కెట్లు
పసుపు రైతులదీ ఇదే వ్యథ..
రాష్ట్రంలో 5 లక్షల టన్నుల పంట ఉత్పత్తి అయితే.. 600 క్వింటాళ్లు సేకరించిన సర్కారు


Sunday, February 26, 2012

రైతు కంట్లో కారం


ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి   Mon, 20 Feb 2012,

గతేడాది క్వింటాలు మిర్చి ధర 14 వేలు
ప్రస్తుత కనిష్టం రూ.2,550; గరిష్టంగా రూ.3,800
తగ్గిన దిగుబడి.. పెరగని ధర
వినియోగదారులకు షాక్‌ షరా మామూలు!

గతేడాది సిరులు కురిపించిన మిరప ఈయేడు రైతుల కంట్లో కారం కొట్టింది. మిరప ధర భారీగా పతనమైంది. ఈ సాగుపై పెట్టిన పెట్టుబడులు చేతికొచ్చే పరిస్థితీ కనిపించడంలేదు. దీంతో అప్పు తీర్చే మార్గం లేక మిరప రైతులు

Monday, January 23, 2012

చీడపీడలను వెంట తెచ్చిన చలి


వరంగల్ అగ్రికల్చర్: రాష్ట్రంలో చలి ప్రభావం తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మిరప పంటపై పలు రకాల చీడపీడలు దాడి చేసి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడంతో మొక్కల పెరుగుదల ఆగిపోయింది. ఈనెలు పసుపు రంగుకు మారుతున్నాయి.

మిరప రైతు కంట నీరు


పడిపోయిన మిర్చి, పసుపు పంట ధరలు 
అప్పుల వూబిలో వ్యవసాయదారులు 
గత ఏడాది అధిక ధరలతో రైతులను ఊరించిన మిర్చి, పసుపు పంటలు ఈ ఏడాది వారిని నిలువునా ముంచాయి. లాభాల మాట దేవుడెరుగు పంటల కోసం వెచ్చించిన ఖర్చులు సైతం తిరిగిరాని పరిస్థితుల్లో సాగుదారులు విలవిలలాడుతున్నాడు. ఇవి వాణిజ్య పంటలన్న సాకుతో సాయం అందించేందుకు ప్రభుత్వమూ ముందుకురావడం లేదు. గతేడాది ఇదే సమయంలో క్వింటా ఎండు మిరపకాయల ధర రూ.10 వేలకు పైగా ఉంది. ఇప్పుడు పంట