అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, January 20, 2012

ఆక్యుపై ది డ్రీమ్‌


  • మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ వారసత్వ కొనసాగింపు
  • ఘనంగా జన్మదిన వేడుకలు
చికాగోలోని మత నేతలు, చికాగో ముట్టడి నిరసనకారులు పౌర హక్కుల నేత రివరెండ్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌
జూనియర్‌ జయంతిని నిర్వహించడం ద్వారా ఆయన వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రతిన బూనారు. అప్పటి పౌర హక్కుల నేత సందేశానికి, నేటి నిరసన ఉద్యమానికీ మధ్య ఉన్న సారూప్యతలను ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో వక్తలు నొక్కి చెప్పారు. దేశంలో మార్పు వచ్చేందుకు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ఆవేశం, లక్ష్యం చేసిన సహాయాన్ని గుర్తు తెచ్చుకోవలసిందిగా ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం పోరాడుతున్న ముట్టడి నిరసనకారులకు వారు విజ్ఞప్తి చేశారు. సంక్షోభంలో ఉన్న సమాజానికీ, దేశానికీ కింగ్‌ ఇచ్చిన సందేశం, పరిష్కారాలు దాదాపు 40 ఏళ్ళ క్రితం ఆయన వెలుగెత్తి చాటినప్పుడు ఎంతగా తగిన విధంగా ఉన్నాయో అవి నేడు కూడా అదే విధంగా ఉన్నాయని ప్రధానోపన్యాసం చేసిన వాయవ్య ఇండియానా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్‌ఫెయిత్‌ ఆర్గనైజేషన్స్‌ అధ్యక్షుడు రివరెండ్‌ డ్వైట్‌ గార్డెనర్‌ తెలిపారు. ఇటీవల లూథర్‌ కింగ్‌ జయంతి సందర్భంగా ది పీపుల్స్‌ చర్చి ఆఫ్‌ చికాగో ముట్టడి నిరసనకారులతో కలిసి పెద్ద ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 'ఆక్యుపై ది డ్రీమ్‌' అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పలు మత, సామాజిక సంస్థలు ఈశాన్య ఇల్లినోయిస్‌, వాయవ్య ఇండియానా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాయి. ఈ కార్యక్రమం జరిగిన పీపుల్స్‌ చర్చిలోని ఆడిటోరియం ప్రజలతో కిటకిటలాడింది. కింగ్‌ వారసత్వాన్ని గురించి పలువురు వక్తలు చర్చించినప్పుడు, ముట్టడి ఉద్యమాన్ని, పెద్ద ఎత్తున సామాజిక మార్పు కోసం ప్రయత్నిస్తున్న ఇతరులను ప్రశంసించినప్పుడు ప్రజలు ఆనందంగా చప్పట్లు చరిచారు. 'ఈ దేశంలో ధనిక, పేదల మధ్య అసమానతలు పెరగడం కొనసాగుతూనే ఉంది. కొద్ది మంది అంటే ముట్టడి ఉద్యమం పేర్కొన్నట్లు ఒక్క శాతం మంది మిగలిన అత్యధిక శాతాన్ని పణంగా పెట్టి ప్రయోజనం పొందుతున్నారు' అని గార్డెనర్‌ చెప్పారు. 'ఇది మనం ఉద్యమించాల్సిన సమయం ! ఇది విప్లవానికి పూనుకోవలసిన సమయం ! మనం 99 శాతం మందిమి !' అని ఆయన గట్టిగా గొంతు పెంచి చెప్పారు. ప్రజలు ఒక్కసారిగా లేచి నిలబడి 'మనం 99 శాతం' అంటూ గట్టిగా ముక్త కంఠంతో గార్డెనర్‌కు సమాధానమిస్తూ ముట్టడి ఉద్యమ ప్రధాన నినాదాన్ని పలుమార్లు చెప్పారు. ఇదే అంశం తరువాత మాట్లాడిన పలువురు వక్తల ఉపన్యాసాల్లో కూడా ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమంలో అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు జేన్‌ స్కాకోస్కీ, జెస్సే జాక్సన్‌ జూనియర్‌, కుక్‌ కౌంటీ బోర్డు అధ్యక్షుడు టోనీ ప్రెక్‌వింక్‌ వంటి ఎన్నికైన ప్రతినిధులు పాల్గొన్నారు. ముట్టడి ఉద్యమానికి సంబంధించిన కొన్ని నినాదాలకు వారు మద్దతు తెలిపినందుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. తాను ప్రజల ఉత్సాహం, ఐక్యత చూసి స్ఫూర్తిని పొందినట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మందిలో ఒకరైన జెనిన్‌ విలియమ్స్‌-నికోల్స్‌ చెప్పారు. నిస్పృహతో ఉన్నది తానొక్కడే కాదనే విషయాన్ని దీని ద్వారా తాను తెలుసుకున్నట్లు ఫ్యాషన్‌ డిజైన్‌ పని చేస్తున్నప్పటికీ తనను తాను నిరుద్యోగిగానే పరిగణించు కుంటున్న ఎరిక్‌ జార్జి(31) తెలిపారు. 'అమెరికా పౌర హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు కింగ్‌ను స్మరించుకున్నాం. ఆయన నిస్సందే హంగా ముట్టడి ఉద్యమానికి, సామాజిక మార్పు కోసం ప్రయత్నిస్తున్న ఇతరులకు మద్దతిచ్చి ఉండేవారే' అని కౌంటీ క్లబ్‌ హిల్స్‌లోని జూబిలీ ఫెయిత్‌ కమ్యూనిటీ చర్చి నుంచి ఇతర సభ్యులతో కలిసి పాల్గొన్న జారుసీ హాస్కెల్‌ చెప్పారు. 'ఆయన ప్రతి ఒక్కరికీ న్యాయం కావాలనుకున్నారు. ఇది నల్లజాతీయుల హక్కులకు సంబం ధించింది ఏమాత్రం కాదు. ఇది అమెరికన్ల హక్కులకు సంబంధి ంచింది. అమెరికాను ధనికులు ఆక్రమించరాదు' అని ఆమె అన్నారు.

వివిధ నగరాల్లో వినూత్న కార్యక్రమాలు
కాగా మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ సిద్ధాంతాలు, ప్రచారాలు, వారసత్వం నుంచి బోస్టన్‌ ముట్టడి, ప్రజలు తెలుసుకోవలసిన వాటి గురించి ప్రజలు ఆలోచించేలా బోస్టన్‌ పీపుల్‌ ఆఫ్‌ కలర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ప్రతి వారం సమావేశాలు నిర్వహిస్తుంది. వీటిలో పాల్గొన్నవారికి 1968 నాటి నేషనల్‌ మాల్‌ టెంట్‌ సిటీ ముట్టడిలో కింగ్‌ ప్రసంగాలు, ఇతర కార్యకర్తలు చెప్పిన విషయాలను విన్పిస్తారు. ఫిలడెల్ఫియాలో సమాజానికి ఉపయోగపడేలా అక్కడ పారిశు ధ్య కార్యక్రమాన్ని అక్యుపై వేకెంట్‌ లాట్స్‌ అండ్‌ ది హౌసింగ్‌ అండ్‌ ఎకనామిక్‌ ఎన్‌పవర్‌మెంట్‌ గ్రూప్‌ నిర్వహిస్తుంది. మిన్నెపోలిస్‌లో ఉద్యోగాలు, గృహవసతి, న్యాయం కోసం ఆక్యుపై ది హుడ్‌ ప్రదర్శన నిర్వహిస్తుంది. చికాగోలో ఇళ్ళ వేలం సంక్షోభంలో తీవ్రంగా దెబ్బతిన్న ప్రజల వద్దకు వెళ్ళి ప్రత్యక్షంగా వారిని కలుసుకోవాలని చికాగో ముట్టడి ఉద్యమం నిర్ణయించింది. వేలాన్ని ఎదుర్కొంటున్న గృహ యజమానులను లక్ష్యంగా చేసుకొని నగరవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తారు. కాగా జువెనైల్‌ డిటెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ప్రదేశాన్ని ఐదు రోజులు పాటు ముట్టడించాలని బాల్టిమోర్‌ ముట్టడి నిర్ణయించింది. అట్లాంటాలోని హయ్యర్‌ గ్రౌండ్‌ ఎంపవర్‌మెంట్‌ సెంటర్‌ ముందు క్యాంపును కొనసాగించాలని అట్లాంటా ముట్టడి ఉద్యమం నిర్ణయించింది.

No comments:

Post a Comment