అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, November 28, 2012

రాష్ట్రంలో 5 జిల్లాల్లో నగదు బదిలీ (జ్యోతి)

హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పుగోదావరి,
అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అమలు
జనవరి 1వ తేదీ నుంచి యూపీఏ శ్రీకారం
పథకంపై కలెక్టర్లకు అవగాహన సదస్సులు..
ఏడాదిన్నర వరకు నో బదిలీ

న్యూఢిల్లీ, నవంబర్ 27 : యూపీఏ ప్రభు త్వం మరో విప్లవాత్మక, వివాదాస్పద సంస్కరణకు తెరతీసింది. జనవరి
ఒకటో తేదీ నుంచి 29 రకాల సంక్షేమ పథకాలకు ఆధార్ ఆధారంగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చే యనున్నారు. ప్రాథమికంగా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లోని 51 జిల్లాల్లో దీన్ని అమలు చేయనున్నారు. అందులో మన రాష్ట్రం నుంచి ఐదు జిల్లాలు.. హైదరాబాద్, రంగారెడ్డి, చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరిలను ఎంపిక చేశారు.

పథకాల్లో అవినీతి, అనర్హులకు సాయం అందడం లాంటివి లేకుం డా నేరుగా లబ్ధిదారులకే సాయం అందడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ఆర్థికమంత్రి చిదంబరం తెలిపారు. ప్రస్తు తం సబ్సిడీలు, పింఛన్ల పంపిణీలో లోపాలున్నాయని, వాటిని నివారించేందుకే నగదు బదిలీని ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. ఒకటి రెండు పథకాల అమలుకు కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు ఆలస్యం కావచ్చని, కానీ చివరకు మొత్తం అన్ని పథకాలనూ ఈ వ్యవస్థలోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమన్నారు.

కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం 42 రకాల పథకాలను అమలుచేస్తుండగా, వీటిలో 29 పథకాలు నగదు బదిలీ వ్యవస్థ పరిధిలోకి రానున్నాయి. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే రెండోదశలో మరిన్ని జిల్లాలను ఇందులో కలుపుతామని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం, సాధికారత; మానవ వనరుల అభివృద్ధి; మైనారిటీ సంక్షేమం; మహిళా శిశు సంక్షేమం; ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; ఉద్యోగకల్పన వంటి శాఖల పరిధిలోని పథకాలకు ప్రస్తుతం ఈ నగదు బదిలీ పథకం వర్తిస్తుంది.

అనర్హుల ఏరివేత, అక్రమాల నిరోధం వల్ల ప్రభుత్వ ఖజానాకు చాలాసొమ్ము ఆదా అవుతుందని భావిస్తున్నట్లు చిదంబరం చెప్పారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్లకు బుల్లి బుల్లి ఏటీఎంలు ఇచ్చి, వారిని బ్యాంకు ఖాతా ఆపరేటర్లుగా నియమిస్తామని, దానివల్ల లబ్ధిదారులు నగదును తీసుకోవడం సులభం అవుతుంది. భవిష్యత్తులో స్వయం సహాయక గ్రూపులు, ప్రాథమిక సహకార సంఘా లు.. ఇలాంటి అన్నిచోట్లా చేత్తో తీసుకెళ్లగల ఏటీఎంలను నడపొచ్చని చిదంబరం వివరించారు.

3.2 లక్షల కోట్ల బదిలీ..
దాదాపు రూ. 3.2 లక్షల కోట్లను ఈ పథకం ద్వారా బదిలీచేయనున్నారు. ఇది రాజకీయంగా పెనుమార్పులకు కారణమవుతుందని ఆర్థికమంత్రి చిదంబరం చెబుతున్నారు. 2013 చివరి నాటికల్లా అన్ని దశల్లోనూ నగదు బదిలీని విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. నగదు బదిలీ పథకంపై అవగాహన కల్పించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లకు సదస్సులు ఏర్పాటు చేస్తామని జైరాం రమేష్ చెప్పారు. ఆ కలెక్టర్లను ఒకటిన్నర సంవత్సరం పాటు బదిలీ చేయకుండా.. అదే జిల్లాల్లో కొనసాగిస్తామన్నారు.

నగదు బదిలీ అంటే ఏమిటి?
ఆహారం, ఎరువులు, ఇంధనాలకిచ్చే సబ్సిడీ బదులుగా బీపీఎల్ కుటుంబాలకు ఏటా 30-40 వేలు జమచేస్తారు. మొత్తమ్మీద 4 లక్షల కోట్లు పంపిణీ చేస్తారు. ఏపీఎల్ కుటుంబాలూ గ్యాస్ సబ్సిడీకి నగదును ఇలాగే పొందుతాయి. ఎలా పనిచేస్తుంది?: ఆధార్ కార్డు ఉండి, సబ్సిడీలు, పెన్షన్లు, స్కాలర్‌షిప్పులకు అర్హత ఉన్నవారికి వారి బ్యాంకు ఖాతాలలో నేరుగా నగదు జమ అవుతుంది. ఇందుకోసం వారు తమ ఆధార్‌సంఖ్యను గ్యాస్ ఏజెన్సీ, బ్యాంకు తదితర వాటికి ఇవ్వాలి.

ఇందులో ఏవేం ఉంటాయి?
తొలుత వంటగ్యాస్‌కు మాత్రమే ఈ నగదు బదిలీ ద్వారా సబ్సిడీ అందుతుంది. ఆహార సబ్సిడీకి కూడా పైలట్ పథకాలను ప్రారంభించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఎరువుల సబ్సిడీపై కూడా ఇప్పటికే కృషి మొదలైంది. త్వరలో అన్ని సబ్సిడీలకూ విస్తరిస్తుంది.

ప్రారంభమయ్యేదెప్పుడు?
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో కిరోసిన్ సబ్సిడీని పైలట్‌ప్రాజెక్టుగా ప్రారంభించారు. మైసూరులో వంటగ్యాస్‌పై ప్రయోగాలు మొదలయ్యాయి. 2013 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అమలుచేస్తారు.

విఫలమయ్యే అవకాశముందా?
అవును. దేశంలోని 120 కోట్ల మంది ప్రజల్లో కేవలం 21 కోట్ల మందికే ఆధార్ కార్డులున్నాయి. చాలావరకు బీపీఎల్ కుటుంబాలకు బ్యాంకు ఖాతాల్లేవు. చాలా గ్రామాల్లో అసలు బ్యాంకు శాఖలు కూడా లేవు.

No comments:

Post a Comment