అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, November 28, 2012

అగ్నికీలల్లో అపార్ట్‌మెంట్‌ : షెడ్డులోని మంటలు భవనంలోకి...



ఐదుగురి మృతి
మృతుల్లో రోజుల చిన్నారి
మణికొండలో ఘోరం
ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మణికొండలో ఆదివారం రాత్రి ఒక అపార్ట్‌మెంటు అగ్ని కీలల్లో చిక్కుకుంది. పక్కనే ఉన్న షెడ్డులో అగ్ని ప్రమాదం జరగడంతో దానికి ఆనుకుని ఉన్న అపార్ట్‌మెంటులోకి మంటలు
వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో రోజుల చిన్నారి ఉన్నారు. మణికొండలోని సెక్రటేరియట్‌ కాలనీలో సినిమా చిత్రీకరణ సామాగ్రిని ఒక షెడ్డులో ఉంచారు. అందులో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. షెడ్డు నుంచి మంటలు పక్కనే ఉన్న బాబానివాస్‌ అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. అక్కడ దుస్తులు ఆరేసి ఉండటంతో వాటికి నిప్పంటుకుని విస్తరించాయి. ఈ అనూహ్య పరిణామానికి అందులో ఉన్నవారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. తేరుకునేలోపు పొగలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. మంటలు ఆర్పేందుకు వ్యవధి లేకపోవడంతో నాలుగో అంతస్తు వరకూ వ్యాపించాయి. దీంతో నివాసితులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఫ్లాట్లలో ఉంటున్న వారిలో కొందరు పొగకు ఉక్కిరిబిక్కిరై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. రాత్రి 8.45 గంటలకు ప్రమాద సమాచారం అగ్నిమాపక శాఖకు అందింది. సమీపంలోని ఫిలింనగర్‌ నుంచి ఫైరింజన్‌ను పంపించారు. ప్రమాద తీవ్రత తెలుసుకుని వెంటనే మాదాపూర్‌, సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌ల నుంచి ఫైరింజన్లను రప్పించారు. రాత్రి 11 గంటల వరకూ మంటలు అదుపులోకి రాలేదు. దట్టమైన పొగ, మంటల కారణంగా సహాయక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని డీసీపీ యోగానంద్‌ వెల్లడించారు. మృతుల్లో ముగ్గురిని గుర్తించారు. వీరిలో ఒకరు మహాలక్ష్మి ((94), మరొకరు కుషాల్‌కాగా మూడో వ్యక్తి వాచ్‌మన్‌ వెంకట సుబ్బయ్య (59). మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. గాయపడిన అనంత రామయ్య, పద్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఒక ఫ్లాట్‌లో బాలింత ఉన్నారు. ఆమెకు రోజుల వయసున్న ఇద్దరు కవల చిన్నారులు ఉన్నారు. ఆరేళ్ల మరో చిన్నారీ ఉన్నారు. మంటలు వ్యాపించగానే ఆరేళ్ల చిన్నారిని తీసుకుని ఇంట్లో వృద్ధురాలు బయటకు వచ్చారు. కవలల్లో ఒకరిని తీసుకుని బాలింత అతి కష్టమ్మీద బయటకు వచ్చారు. మరో చిన్నారిని తీసుకెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా అప్పటికే మంటలు దట్టంగా వ్యాపించాయి. దీంతో ఆమె అసహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది.

No comments:

Post a Comment