9/17/2012 12:48:00 AM
ఆస్పత్రుల్లో చాలా రోగాలకు వైద్యులే కరువు
వైద్య పరీక్షలు బయటే చేయించుకోవాలి
చాలా మందులు బయటే కొనుక్కోవాలి
డాక్టర్లు అసలే ఉండరు.. ఉన్న కొందరైనా దొరకరు..! వైద్య పరికరాలు ఉండవు.. ఉన్నా పనిచేయవు! ఏ చిన్న మందు అయినా బయట కొనాల్సిందే.. చివరకు సెలైన్ బాటిళ్లు, దూది కూడా రోగులే కొనుక్కోవాల్సిన పరిస్థితి! ఇదెక్కడో మారుమూల పల్లెల్లోనో, గిరిజన ప్రాంతాల్లోనో ఉన్న ఆసుపత్రుల సంగతి కాదు. నిత్యం వేలాది మంది పేదలు వచ్చే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోని దుస్థితి!! బడుగుజీవులకు పెద్దదిక్కయిన ఆసుపత్రులకు సుస్తీ చేసింది. రోగానికి మందేయాల్సిన ఆసుపత్రులే మంచానపడ్డాయి. ఫలితంగా రోగులకు కనీస వైద్యం కూడా గగనమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు బోధనాస్పత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రులను ‘న్యూస్‌లైన్’ పరిశీలించినప్పుడు అనేక చేదు వాస్తవాలు బయటపడ్డాయి. ఆసుపత్రులన్నీ వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
డబ్బుల్లేక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేని పేద రోగులను.. సర్కారీ దవాఖానాలు కూడా అప్పులపాలు చేస్తున్నాయి. వైద్య పరీక్షలు, మందుల కోసం వేల రూపాయలు వెచ్చించాల్సి రావడంతో అప్పులు తప్పడం లేదు. పేరుకే సర్కారు దవాఖానా కానీ అన్నీ మందులు బయటే కొనుక్కుంటున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మీ జబ్బును చూసే డాక్టర్ ఇక్కడ లేడు.. వేరే ఆస్పత్రికి పొండి..’ ‘ఇక్కడ వెంటిలేటర్ లేదు.. వేరే చోటుకు పొండి’ అని పంపించటం సర్వసాధారణమైపోయింది. రాష్ట్రం లోని బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసు పత్రుల్లో దుస్థితిపై న్యూస్‌లైన్ నెట్‌వర్క్ కథనం..
ఎంజీఎం..కీలక వైద్యులు ఎక్కడ?
వరంగల్‌లోని ఎంజీఎం పేరుకు నాలుగు జిల్లాలకు పెద్దాస్పత్రి. కానీ కార్డియాలజిస్ట్, నెఫ్రాలజీ, న్యూరో విభాగాలు పూర్తి స్థాయిలో లేక రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అన్ని ఆస్పత్రులకు కలిపి ఇంకా 94 మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్స్‌రే మొదలు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నా రోగులు ప్రైవేటు ల్యాబ్‌లపైనే ఆధారపడాలి. లేబొరేటరీల్లో పనిచేసే సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రి మార్చురీలో కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడ పన్నెండు ఫ్రీజర్ బాక్సుల అవసరం ఉండగా ప్రస్తుతం నాలుగు మాత్రమే అంతంత మాత్రంగా పని చేస్తున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. రోగులకు నాసిరకం భోజనం అందుతోంది.
కేజీహెచ్.. ఇన్సులిన్‌కూ కరువే!
విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిని వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఓపీలో ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వటం చాలాకాలంగా నిలిపివేశారు. పిల్లలకు అత్యవసర మందులను రోగులే ప్రైవేటుగా కొంటున్నారు. పాముకాటుకు, కుక్కకాటుకు కూడా సరిగ్గా మందుల్లేవు. ఇక గుండెజబ్బుల వంటి ప్రధానమైన రోగాలకు అవసరమయ్యే మందుల పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. సీటీ స్కాన్ పరికరం గత మూడు నెలలుగా మూలనపడింది. రోగులంతా ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న మెడాల్ ల్యాబ్‌పై ఆధారపడుతున్నారు. ఓపీ ఎక్స్‌రే విభాగంలో ఉన్న రెండు మేజర్ ఎక్స్‌రే మిషన్లు ఏళ్ల తరబడి మూలనపడ్డాయి. ఐఆర్‌సీయూ, పిల్లల వార్డుల్లో కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్లు సరిపడినంతగా లేవు. పిల్లల వార్డులో వార్మర్లు, ఇంక్యుబేటర్లు, పీడియాట్రిక్ వెంటిలేటర్లు అసలే లేవు. కేజీహెచ్ భవనాలు 150 ఏళ్ల కిందట నిర్మించినవి కావటంతో మురుగునీటి వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. వర్షాల సమయంలో ఆ వార్డుల్లోకి నీరు ప్రవేశించి వార్డులు జలదిగ్బంధమవుతున్నాయి. కేజీహెచ్‌లో అధికారికంగా 1,045 పడకలున్నప్పటికీ అనధికారికంగా మరో 600 నుంచి 700 మంది వైద్యం కోసం చేరుతుంటారు. రోగులకు సరఫరా చేసే ఆహార నాణ్యత అంతంత మాత్రంగానే ఉంది. సాంబారు నీరుని తలపిస్తోంది.
జీజీహెచ్..ఒక్కో పడకకు ఇద్దరు!
గుంటూరులోని సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్) తొమ్మిది కోస్తా జిల్లాలకు పెద్ద దిక్కు. ఇక్కడ 1,177 పడకలు ఉన్నాయి. కానీ ప్రసూతి వార్డు, మెడికల్ వార్డులో రోగులకు సరిపడా మంచాలు లేవు.దీంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరు చొప్పున రోగులను పడుకోబెడుతున్నారు. సీటీ స్కాన్ పనిచేయటం లేదు. చిన్నపిల్లల వార్డులో వెంటిలేటర్లు, ఫొటోథెరపీ, ఇంక్యుబేటర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఒక్కో ఫొటోథెరపీ యూనిట్‌లో ఒకేసారి ఐదారుగురు పిల్లల్ని ఉంచుతున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని వైద్యులే చెప్తున్నారు. వికలాంగులు, వృద్ధులు, అపస్మారక స్థితిలోకెళ్లిన వారిని మోసుకెళ్లాలంటే రోగుల బంధువులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వీల్‌చైర్‌లు ఉన్నా.. వాటిని మందులు, వైద్యపరికరాలు తరలించటానికి ఉపయోగిస్తున్నారు. మత్తువైద్య విభాగంలో బోధనానిపుణుల పోస్టుల కొరత ఉంది.
రుయా..ఎవరూ పట్టించుకోరయా!
రాయలసీమకు పెద్దాసుపత్రిగా పేరున్న తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో స్ట్రెచర్‌ల కొరత తీవ్రంగా ఉంది. ఒకే స్ట్రెచర్‌పై ఇద్దరు రోగులను తరలిస్తున్నారు. సిబ్బంది లేక రోగుల బంధువులే స్ట్రెచర్లు తోసుకెళుతున్నారు. బర్న్స్ వార్డులో ఫ్యాన్లు సరిగా లేవు. వివిధ విభాగాల్లో రోగుల కోసం ఏర్పాటు చేసిన 9 ఎక్స్‌రే మిషన్లలో నెలరోజులుగా ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో పనిచేయటంలేదు. ఈసీజీ యంత్రాలు తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో పరీక్షల కోసం రోగులను ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపుతున్నారు. రోగులకు అవసరమైన మేరకు అన్ని రకాల మందులు ఫార్మసీ విభాగంలో పుష్కలంగా ఉన్నా నామమాత్రంగా సరఫరా చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. పురుగులు పడ్డ సాంబారు, పులిసిపోయిన మజ్జిగ, నాసిరకం అన్నం వడ్డిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ఆస్పత్రిలో మరుగుదొడ్ల పరిస్థితి దారుణంగా ఉంది.
ఉస్మానియా.. పారిశుద్ధ్యం సున్నా..
1400 పడకల సామర్థ్యం ఉన్న హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ప్రధాన సమస్య పారిశుధ్య లోపం. వైద్యం కోసం వెళ్తే.. ఆస్పత్రిలో ఇన్‌ఫెక్షన్ సోకి కొత్త రోగాలు వస్తున్నాయి. ఆస్పత్రిలో ఏ మూల చూసినా చెత్తకుప్పలే. వార్డుల్లో మురుగు నీరు నిల్వ ఉంటుంది. ఏ విభాగంలోకి తొంగిచూసినా కంపు వాసనే . 1,400 పడకల సామర్థ్యం ఉన్నా అందుబాటులో 1,200 పడకలే ఉన్నాయి. ఆస్పత్రిలో 50 మంది ప్రొఫెసర్లు, 50 అసోసియేట్ ప్రొఫెసర్లు, 150 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 200 మంది పీజీలు, 800 ఇంటర్నీలు అందుబాటులో ఉన్నా సరిపోవడం లేదు. 1975 నుంచి కొత్త నియామకాలు లేవు. సుమారు వంద మంది కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్నారు.
గాంధీ..మొరాయిస్తున్న పరికరాలు
1542 పడకల సామర్థ్యం గల గాంధీ ఆసుపత్రిలో సీటీ, ఎమ్మారై, ఎక్స్‌రే యంత్రాలు తరచూ మెరాయిస్తున్నాయి. వెంటిలేటర్లు 50 వరకు ఉన్నా వాటిలో సగానికిపైగా పని చేయడం లేదు. డయాలసిస్ విభాగంలోని 5 యంత్రాల్లో మూడు పని చేయడం లేదు. వైద్యుల పోస్టులు 50 ఖాళీగా ఉన్నాయి. నర్సులు 453 మంది ఉన్నా వీరిలో 200 మంది ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నారు. మరో 200 మంది నర్సులు అవసరం.
కర్నూలు.. దూదికీ దిక్కులేదు..
కర్నూలు ప్రభుత్వ బోధనాసుపత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉంది. మూడు నెలలకు రూ.1.35 కోట్ల మెడికల్, రూ.59 లక్షల సర్జికల్ మందుల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. అయితే రెండు క్వార్టర్లకు కలిపి ఇప్పటిదాకా 20 శాతం మందులను కూడా ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది. సిరంజీలు, నీడిల్స్, గ్లౌజులు, ఐవీ క్యాత్‌లు, ఈజీ స్టిక్‌లు రోగులతోనే కొనిపిస్తున్నారు. ఎముకలు విరిగితే కట్టు కట్టేందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్, కాటన్, బ్యాండేజ్ క్లాత్ సైతం రోగులు సొంత డబ్బు వెచ్చించి బయట నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది.
ప్రసూతి కేసులు కేరాఫ్ ప్రైవేటు..
నిజామాబాద్ జిల్లాలో 98 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని చెబుతున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సర్కారు ప్రసూతి ఆస్పత్రులకు మాత్రం తాళం వేశారు. గైనకాలజిస్టు పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉండటంతో పెద్దాస్పత్రుల్లోనూ ప్రసవాలు ఒక్కటి కూడా జరగటం లేదు. ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. ఎల్లారెడ్డిలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి వార్డును కేవలం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం మాత్రమే తెరుస్తున్నారు. బోధన్ ఏరియా ఆస్పత్రిలో ఉన్న ఒక్క గైనకాలజిస్టు నిజామాబాద్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లారు. దీంతో రెండు నెలలుగా ఇక్కడ గర్భిణులకు ఇబ్బందులే.
మహిళల బాధలు వర్ణనాతీతం..
విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 200 పడకలున్నాయి. ఇక్కడ గైనకాలజిస్టులు లేకపోవడంతో మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలో 13 వెంటిలేటర్లు ఉండాలి. కానీ ఒక్కటీ లేదు. వెంటిలేటర్ టెక్నీషియన్లూ లేరు. ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ పరికరాలు పాడయ్యాయి. రోగులను కేజీహెచ్‌కు కానీ.. కార్పొరేట్ ఆస్పత్రికి కానీ రిఫర్ చేసేస్తున్నారు. ఎముకల విభాగంలో సివిల్ సర్జన్ గత ఆరు నెలలుగా లేరు. శ్వాసకోశ, కిడ్నీ, ఉబ్బసం, మలేరియా, కామెర్లు, గుండె వంటి వ్యాధులకు చికిత్స అందించే జనరల్ ఫిజీషియన్ లేరు.
రిమ్స్.. రోగుల నరకయాతన..
ఆదిలాబాద్ రిమ్స్‌లో 41 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యవసర విభాగంలో పడకలు లేక రోగులను కింద పడుకోబెడుతున్నారు. 646 రకాల మందులు సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 230 రకాలను మాత్రమే ఇస్తున్నారు. రోగులకు కృత్రిమ శ్వాస అందించేందుకు ప్రభుత్వం నాలుగేళ్ల కిందట 10 వెంటిలేటర్లను మంజూరు చేసింది. వీటి విలువ దాదాపు రూ. 80 లక్షలు. కానీ వీటికి సంబంధించిన టెక్నీషియన్లు లేకపోవటంతో అవన్నీ నిరూపయోగంగా మారాయి. వార్డుల్లో ఎక్కడికక్కడ చెత్త పడేస్తున్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి.
‘అనంత’ నిర్లక్ష్యం..
అనంతపురం సర్వజనాస్పత్రిలో 750 పడకలకు జీవో విడుదలై ఏడాది దాటినా అమలుకు నోచులేదు. 350 పడకలకు సరిపడా వైద్య సదుపాయాలు కూడా లేవు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వైద్యులెవరూ అందుబాటులో ఉండడం లేదు. ఫీల్డ్‌వర్క్ పేరుతో వెళ్లిపోతున్నారు. ఆస్పత్రిలో దాదాపు 135 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓపీలను ఎక్కువ శాతం హౌస్‌సర్జన్‌లే చూసుకుంటున్నారు. డెంగీ నిర్ధారణ అయితే ప్రైవేట్ ఆస్పత్రులకో.. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకో పరుగుతీయాల్సి వస్తోంది.

No comments:
Post a Comment