అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, April 23, 2012

రంగారెడ్డి జిల్లా చరిత్ర:
రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కీలకపాత్ర పోషించిన కె.వి.
రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కీలకపాత్ర పోషించిన కె.వి. రంగారెడ్డి పేరుతో ఏర్పాటైన జిల్లా ఇది. రంగారెడ్డి జిల్లాను 1978 ఆగస్టు 15న ఏర్పాటుచేశారు. కె.వి. రంగారెడ్డి హైదరాబాద్‌ పరిసరాల్లోని పెద్దమంగళారం గ్రామంలో పుట్టారు. బానిసగా బతకడం కన్నా చావడం మిన్న అని నినదించిన వ్యక్తి ఆయన. 1959లో నీలం సంజీవరెడ్డి ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా, 1969లో ఉపముఖ్యమంత్రిగా సేవలందించిన రంగారెడ్డి స్త్రీ విద్య పట్ల అత్యంత శ్రద్ధ చూపారు. సంగెం లక్ష్మీబాయి స్థాపించిన ఇందిరాసేవాసదన్‌ సొసైటీ సభ్యునిగా పనిచేశారు. హైదరాబాదులో ఆంధ్ర విద్యాలయ (ఎ.వి. కళాశాల)కళాశాలను ఆయనే ప్రారంభించారు. అనంతరం ఆయన పేరు మీద కూడా ఒక మహిళా కళాశాలను ప్రారంభించారు.రంగారెడ్డి పేరుతో ఏర్పాటైన జిల్లా ఇది. రంగారెడ్డి జిల్లాను 1978 ఆగస్టు 15న ఏర్పాటుచేశారు. కె.వి. రంగారెడ్డి హైదరాబాద్‌ పరిసరాల్లోని పెద్దమంగళారం గ్రామంలో పుట్టారు. బానిసగా బతకడం కన్నా చావడం మిన్న అని నినదించిన వ్యక్తి ఆయన. 1959లో నీలం సంజీవరెడ్డి ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా, 1969లో ఉపముఖ్యమంత్రిగా సేవలందించిన రంగారెడ్డి స్త్రీ విద్య పట్ల అత్యంత శ్రద్ధ చూపారు. సంగెం లక్ష్మీబాయి స్థాపించిన ఇందిరాసేవాసదన్‌ సొసైటీ సభ్యునిగా పనిచేశారు. హైదరాబాదులో ఆంధ్ర విద్యాలయ (ఎ.వి. కళాశాల)కళాశాలను ఆయనే ప్రారంభించారు. అనంతరం ఆయన పేరు మీద కూడా ఒక మహిళా కళాశాలను ప్రారంభించారు.
భౌగోళికంగా రంగారెడ్డి జిల్లా పూర్తిగా దక్కను పీఠభూమి మధ్యన ఉంది. 16 30'' - 18 20' ఉత్తర అక్షాంశాల మధ్య, 77 30' - 79 30'తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. జిల్లా విస్తీర్ణం 7564.88 చదరపు కి. మీ.

చారిత్రక విశేషాలు
స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలను 'అత్రాఫ్‌ ఇ బాల్దా' జిల్లాగా వ్యవహరించేవారు. మెదక్‌ డివిజన్లోని (సుబా) గుల్షన్‌బాద్‌లో ఒక భాగంగా ఇది ఉండేది. 1948లో పోలీసు చర్య అనంతరం ఈ ప్రాంతాన్నంతటినీ హైదరాబాద్‌ జిల్లాలో కలిపారు. 1978లో తిరిగి హైదరాబాద్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాలుగా ముందు విభజించి తరువాత రంగారెడ్డి జిల్లాగా నామకరణం చేశారు.

భౌగోళిక విశేషాలు 
ఉత్తరాన మెదక్‌ జిల్లా, తూర్పున నల్గొండ జిల్లా, దక్షిణాన మహబూబ్‌నగర్‌ జిల్లా, పశ్చిమాన గుల్బర్గ వాయువ్యాన బీదర్‌ (కర్ణాటక) జిల్లాలు ఉన్నాయి. మండల వ్యవస్థ ఏర్పాటయ్యాక జిల్లాలోని ప్రాంతాలను 37 మండలాలుగా విభజించారు. అందులో నాలుగు అర్బన్‌ మండలాలు కాగా 33 రూరల్‌ మండలాలున్నాయి. తూర్పు, చేవెళ్ల, వికారాబాద్‌లుగా మూడు డివిజన్లు ఉన్నాయి.

No comments:

Post a Comment