రాశి తగ్గింది.. ర్యాంకూ పడిపోయింది..
ఇంటర్ ద్వితీయంలో 66 శాతం ఉత్తీర్ణత
రాష్ట్రంలో నాలుగో స్థానంలో జిల్లా
సర్కారు కళాశాలల్లో 53.18 శాతం పాస్
ఉత్తీర్ణతలో అవ్మూరుులదే పైచేరుురంగారెడ్డి రూరల్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు జిల్లాను నిరాశకు గురిచేశాయి. ఉత్తీర్ణత శాతం తగ్గడమే కాకుండా రాష్ట్రస్థాయి ర్యాంకులో రెండు మెట్లు కిందికి పడిపోయింది. మంగళవారం విడుదలైన ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం ఫలితాల్లో జిల్లాలో 66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 82,672 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఇందులో 54,435 మంది విద్యార్థులు పాసయ్యారు. గతేడాది 72 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 6 శాతం ఫలితాలు తగ్గాయి. రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో జిల్లా నిలిచింది. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 2,028 మంది విద్యార్థులకుగాను 1,048 మంది పాసై 52 శాతం ఉత్తీర్ణత సాధించారు.
బాలికలదే హవా..
ఈసారి కూడా బాలికలు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఫలితాల్లో బాలుర కంటే 6 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించి పెమైట్టులో నిలిచా రు. మొత్తం 36,550 మంది బాలికలు పరీక్షకు హాజరవ్వగా 25,420 మంది పాసై 69 శాతం ఉత్తీర్ణులయ్యారు. 46,122 మంది బాలురకు గాను 29,015 మంది పాసై 63 శాతం ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి 4,364 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 53.18 శాతం ఫలితాలు సాధించారు. ఇందులో 2,849 మంది బాలురు, 1,515 మంది బాలికలు పాసయ్యారు.
ర్యాంకు దిగింది..
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా ర్యాంకు పడిపోయింది. రాష్ట్రస్థాయిలో జిల్లా ర్యాంకు రెండు మెట్లు దిగి నాలుగో స్థానానికి దిగజారింది. గతేడాది 72 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. అంతకు ముందు రెండేళ్లుగా రెండో స్థానాన్ని పదిలంగా నిలబెట్టుకుంది. అయితే ఈ ఏడాది ఉత్తీర్ణతలో 6 శాతం తగ్గి ర్యాంకు నాలుగో స్థానానికి పడిపోయింది. ఇంటర్మీడియెట్ ఫలితాలపై సకలజనుల సమ్మె ప్రభావం పడినట్లు స్పష్టమవుతోంది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సకల జనుల సమ్మె కారణంగా కళాశాలలు మూతబడ్డాయి. దీంతో కళాశాలల్లో బోధన పూర్తిగా నిలిచిపోయింది. అయితే నవంబర్ నెల నుంచి తరగతులు కొనసాగినప్పటికీ బోధనలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఫలితాల్లో తగ్గుదల ఏర్పడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment