అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, April 23, 2012

వాణిజ్యం

పరిశ్రమలు :

పారిశ్రామికంగా జిల్లా ప్రత్యేకత సంతరించుకుంది. 1982లో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంది మెదక్‌ పార్లమెంటు సభ్యురాలిగా గెలుపొందినందుకు నజరానాగా పారిశ్రామికవాడలు ఏర్పాటయ్యాయి. ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామికవాడ అయిన పటాన్‌చెరు నియోజకవర్గంలో జాతీయస్థాయి పరిశ్రమలు ఉన్నాయి. జిల్లా సరిహద్దు నుండి ముఖచిత్రంగా బీహెచ్‌ఇఎల్‌ పరిశ్రమ కనిపిస్తుంది. విద్యుత్తుకు వినియోగించే గ్యాస్‌ టర్బైన్స్‌, జనరేటర్‌లు ఇక్కడ తయారవుతున్నాయి. దీనికింద యాన్సిలరీ యూనిట్లు 100కు పైబడి నెలకొల్పారు. ఇందుకు భెల్‌ పరిశ్రమ స్థలాన్ని సమకూర్చి ఏపీఐఐసీకి అప్పగించింది. వ్యవసాయ రంగంలో పరిశోధనలు సాగిస్తున్న అంతర్జాతీయ మెట్టపంటల ఉష్ణమండల పరిశోధనాసంస్థ (ఇక్రిశాట్‌) వల్ల జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆరు రకాల మెట్ట పంటలపై పరిశోధనలు సాగిస్తున్నారు. దాదాపు చిన్నా, పెద్దా కలిపి 80కి పైబడి దేశాలవారికి పరిశోధనా ఫలితాలు అందిస్తున్నారు. పటాన్‌చెరు, పాశమైలారం, ఖాజీపల్లి, ఐడీఏ బొల్లారం, బొంతపల్లి, జహీరాబాద్‌, బుచ్చినల్లిలలో పరిశ్రమలు నెలకొల్పారు. క్షిపణులు తయారుచేసే భారత డైనమిక్‌ లిమిటెడ్‌ (బీడిఎల్‌)ను భానూరులో ఏర్పాటు చేశారు. యుద్ధ ట్యాంకర్లు తయారుచేసే ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీని ఎద్దుమైలారం గ్రామంలో నెలకొల్పారు. ఈ నాలుగు ప్రధానమైన పరిశ్రమలవల్ల జిల్లాకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ప్రైవేటు రంగంలో కూడా భారీ పరిశ్రమలు నెలకొల్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే నిమిత్తం దాదాపు రూ. 300కోట్లతో మహేంద్రా అండ్‌ మహేంద్రా పరిశ్రమను జహీరాబాద్‌లో స్థాపించారు. ఏషియన్‌ పెయింట్స్‌ పరిశ్రమను పటాన్‌చెరులో ప్రారంభించారు. నర్సాపూర్‌ ఎంఎల్‌ఏగా ఉండి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్నాథరావు బొంతపల్లిలో పరిశ్రమలు ఏర్పాటుకు సహకరించారు. ఫార్మా పరిశ్రమలు కూడా నెలకొల్పారు. ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో డాక్టర్‌ రెడ్డీస్‌, పాశమైలారంలో అరబిందో, మ్యాట్రిక్స్‌, న్యూలాండ్‌ వంటి ప్రధాన పరిశ్రమలు ఉన్నాయి. క్షయ నిర్మూలన, హెపటైటిస్‌ బి, ఊపిరితిత్తులకు సంబంధిచిన, వ్యాధినిరోధకశక్తిని పెంచేవి, యాంటీ అల్సర్‌, నొప్పులు, ఎయిడ్స్‌ నివారణ, క్యాన్సర్‌ సంబంధిత, అల్సర్‌లకు మందులు జిల్లాలో తయారవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఫార్మా పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. జిల్లాలో రైస్‌ మిల్లులు 300 పైచిలుకు ఉన్నాయి. చక్కెర పరిశ్రమలు కూడా ఉన్నాయి. మెదక్‌, సంగారెడ్డి ప్రాంతాల్లో నిజాం సుగర్స్‌ లిమిటెడ్‌, గణపతి సుగర్స్‌ లిమిటెడ్‌ పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. జహీరాబాద్‌, సదాశివపేట ప్రాంతాల్లో చిన్నతరహా చక్కెర పరిశ్రమలున్నాయి. సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్‌, పుట్నాలు మిల్లులు స్థానికంగా ఉన్నాయి.
జిల్లాలో చక్కెర కర్మాగారాలు
సంగారెడ్డి: గణపతి చక్కెర కర్మాగారం. ఫసల్‌వాడి, సంగారెడ్డి
జనరల్‌మేనేజర్‌: నాగరాజు, .ఫోన్‌ నెం.9701999466
జహీరాబాద్‌: ట్రైడెంట్‌ కర్మాగారం, మధునగర్‌ జహీరాబాద్‌.
జనరల్‌మేనేజర్‌, ఫొన్‌ నెం. 9493547377

No comments:

Post a Comment