అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...
నిర్భయమేదీ?
ఐటీ జోన్‌లో
భద్రత అంతంతమాత్రమే
అలంకారప్రాయంగా
సీసీ కెమెరాలు
ఈనాడు, హైదరాబాద్,
న్యూస్‌టుడే, మాదాపూర్
హైటెక్ సిటీ...
భారతదేశపు సిలికాన్ వ్యాలీ... అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానమున్నా
అక్కడ భద్రత అంతంతమాత్రమేనని తేలిపోయింది. పెట్రోలింగ్ పెంచామంటూ పోలీసులు
చెబుతున్నా అది కొద్దిరోజులకే పరిమితం. అనుకోని ఘటనలు, నేరాలు, ఘోరాలు జరిగిన
సమయంలో వాటిని చిత్రీకరించేందుకు సీసీ కెమెరాలు ఉన్నా అవి అలంకారప్రాయమే.
పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా రాత్రుళ్లు యువతులు, మహిళలు
'నిర్భయం'గా వెళ్లలేరని మంగళవారం జరిగిన నిఖిల్‌మోరే అపహరణయత్నం
తెలిపింది. ఐటీ జోన్‌లో భద్రతను మరోమారు ప్రశ్నించింది. బాధితురాలు తన
బ్యాగులో పెప్పర్ స్ప్రే పెట్టుకోవడం వల్ల దుండగులను ఎదిరించి ఆటోలోంచి
బయటపడింది. లేదంటే... మరో దుర్ఘటన నమోదయ్యేది. అంతా అయ్యాక నిఖిల్‌మోరేను
పోలీసులు రక్షించినా ఇప్పటివరకూ ఆటోను, ఆటోడ్రైవర్‌ను గుర్తించలేదు.
మాదాపూర్,
గచ్చిబౌలి ఐటీజోన్‌లలో పోలీసుల నిత్యం వీఐపీల బందోబస్తులకే ప్రాధాన్యత నిస్తూ
ఐటీ జోన్‌లో భద్రతపై పెద్దగా దృష్టి సారించడం లేదు. ఏడాదిలో దాదాపు
250 రోజులు వీఐపీల బందోబస్తుకే పోలీసుల సేవలు సరిపోతున్నాయి. దీంతో రహదారులపై
ఆకతాయిల, ఆటోవాలాల ఆగడాలను నిరోధించేందుకు తగిన శ్రద్ధ చూపడం లేదన్న
ఆరోపణలున్నాయి. లక్షల మంది యువతీయువకులు పనిచేసే గచ్చిబౌలి, మాదాపూర్
ప్రాంతంలో 24 గంటలు గస్తీ ఉంటుందని చెబుతున్న పోలీసులు నిఖిల్ అపహరణ లాంటి
సంఘటనలను నివారించడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఆటోవాల
ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు వారికి ప్రత్యేక నెంబర్లు కేటాయించాలని
పోలీసులు నిర్ణయించారు. దీంతో ఏదైనా సంఘటన జరిగినప్పుడు సదరు నంబరును
బాధితులు గుర్తించుకునేందుకు వీలుగా ఉంటుందని భావించారు. ఈ నేపథ్యంలో
ఆటోలకు ప్రత్యేక నెంబర్లు కేటాయించినట్లు చెబుతున్న పోలీసులు దాన్ని పూర్తిస్థాయిలో
అమలుచేయలేదు. ఆటో వెనుక భాగంలో నెంబర్ ఉంటే ప్రయాణికులు అది
గమనించి నమోదు చేసుకోవడం వీలుపడదు. అదే లోపల డ్రైవర్ సీటు వెనుకభాగంలో
నెంబర్ ఉంటే దాన్ని ప్రయాణికులు చూసి గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది.
అలాగే బస్టాప్‌ల వద్ద, ఆటోస్టాండ్‌ల వద్ద పోలీసుల గస్తీ ఉండటం లేదని ఐటీ ఉద్యోగులు
చెబుతున్నారు. ఇక ఐటీ సెక్టార్‌లో 24 గంటల గస్తీ కోసం ఏర్పాటుచేసిన
క్యూఆర్‌టీ (క్విక్‌రెస్పాన్స్ టీం)లో సిబ్బంది ఆయా ప్రాంతాల్లో సక్రమంగా గస్తీ
ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న మద్యం దుకాణాల
వద్ద మందుబాబుల ఆగడాలకు కళ్లెం లేకుండాపోయింది. రోడ్డు పక్కనే కూర్చొని
మద్యం తాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
గుడ్డి
కెమెరాలు..
సైబర్ టవర్స్,
మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన క్లోజ్డ్ సర్క్యూట్(సీసీ) కెమెరాలు
అలంకారంగా మారాయి. రహదారులపై తిరిగే వాహనాలకు సంబంధించిన అనవాళ్లను
ఈ కెమెరాలు స్పష్టంగా నిక్షిప్తం చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గచ్చిబౌలి,
మాదాపూర్ ఐటీ జోనులో దాదాపు 40 వరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి.
ఏదైనా ప్రమాదం, లేదా నేరం జరిగినప్పుడు వీటితో నేరగాళ్లను, వారు ఉపయోగించిన
వాహనాలను గుర్తించేందుకు వీలుగా ఉంటుందని ఏర్పాటు చేశారు. సైబరాబాద్ సెక్యూరిటీ
కౌన్సిల్ సహకారంతో ఆయా ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి ముఖ్య కూడళ్లు,
ప్రధాన రహదారుల్లో వీటిని అమర్చారు. అయితే రాత్రివేళల్లో వీటిల్లో స్పష్టమైన
వీడియో చిత్రీకరణ జరగటం లేదు. దీంతో వీటిని నమ్ముకున్న పోలీసులకు నేరాలు జరిగిన
సమయాల్లో తీరా ఎటువంటి ఆధారం లభించడం లేదు. ఏడాది కిత్రం రాత్రి 11.30
ప్రాంతంలో కొండాపూర్ జయభేరి కౌంటీ వద్ద గుర్తుతెలియని కారులో వచ్చిన
దుండగులు నడిరోడ్డుపై ఓ మారుతీవ్యాన్‌ను అడ్డగించారు. అందులో
ఉన్న వారిని తుపాకులతో బెదిరించి రూ.30 లక్షలతో ఉడాయించారు. ఈ సంఘటనలో
దుండగులు వచ్చిన కారుకు సంబంధించిన అనవాలు తెలుసుకునేందుకు పోలీసులు
సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు. కానీ ఆ సమయంలో కెమెరాలు సక్రమంగా
పనిచేయలేదు. తాజాగా నిఖిల్‌మోరే అపహరణ కేసులో సైతం ఆటోకు సంబంధించిన
స్పష్టమైన సమాచారం సీసీటీవీల్లో లభించకపోవడంతో పోలీసులు తలలు
పట్టుకుంటున్నారు. ఇందులో ఆటో నెంబర్ స్పష్టంగా లేకపోవడంతో నిందితులను
గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. రాత్రిపూట సక్రమంగా పనిచేయని ఈ
కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పలువురు పోలీసులు
అధికారులే అంటున్నారు. కీలకమైన ఐటీ జోన్‌లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు
24 గంటలు పనిచేసేందుకు అధునాతన నిఘా నేత్రాలు అత్యవసరం.
ఉన్నతాధికారులకు
చెప్పినా..
రాయదుర్గం
పోలీస్‌స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి ప్రాంతంలో పోలీసుల గస్తీ సక్రమంగా లేదని
మహిళా ఉద్యోగులు స్వయంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం
కనబడటం లేదు. ఐఎస్‌బీ రోడ్డు, గౌలిదొడ్డి నుంచి గోపన్‌పల్లి రోడ్డులో పోలీసుల
నిఘా అంతంతమాత్రంగానే ఉంది. మాదాపూర్ తరహాలో ఇక్కడ కూడా ఐటీ కంపెనీల
సంఖ్య అధికంగా ఉంది. ఐటీ పార్కులు సైతం ఉన్నాయి.ు కానీ పోలీసులు ఆ సాయిలో
గస్తీ చేయడం లేదన్న వాదనలు ఉన్నాయి.
No comments:
Post a Comment