అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, April 25, 2012

'ఫలితం' సగమేనోయి! - మెదక్


'ఫలితం' సగమేనోయి!
ఇంటర్‌లో 51 శాతమే ఉత్తీర్ణత
వచ్చే ఏడాదైనా ఓ పట్టు పట్టాలి సుమా
న్యూస్‌టుడే - సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, పటాన్‌చెరు, గజ్వేల్‌ టౌన్‌
ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు వెనుకంజ వేశారు. గత ఏడాది ఫలితాలతో పోలిస్తే ఈసారి శాతం చాలా తగ్గింది. 51 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. కిందటేడాదితో పోలిస్తే ఆరు శాతం తక్కువ. ఫలితాల పట్టికలో జిల్లా 16వ స్థానంలో నిలిచింది. 2008-09 తరవాత మళ్లీ ఈ ఏడాదే ఫలితం తక్కువగా వచ్చింది. రాష్ట్రస్థాయిలో ఉత్తీర్ణత 58 శాతం. జిల్లాలో ఉత్తీర్ణులైన 51 శాతంలో విద్యార్థినులదే పైచేయి. ఈ ఏడాది హాజరైన 26,082 మందిలో 13335 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 49.31 శాతం, విద్యార్థినులు 53.31 శాతం పాసయ్యారు.
వృత్తివిద్యలోనూ బాలికలదే హవా
ఇంటర్‌ వృత్తి విద్య (ఒకేషనల్‌) కోర్సుల్లో 60 శాతం ఉత్తీర్ణత ఉంది. మొత్తం 2153 మంది విద్యార్థులకు 1297 మంది పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ కూడా విద్యార్థినులే అధికం. వీరి ఉత్తీర్ణతా శాతం 62.98 కాగా బాలురది 58.85 శాతం మాత్రమే.
తొగుట కళాశాలకు 100 శాతం ఉత్తీర్ణత 
ప్రభుత్వ కళాశాలల్లో చూస్తే మొత్తం 46కు 10 కళాశాలల్లో విద్యార్థులు 50 శాతం కంటే తక్కువగా ఫలితాలు సాధించారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఉత్తీర్ణత శాతం జిల్లాలోనే తక్కువగా ఉంది. ఇక్కడ 20.15 శాతం గట్టెక్కారు. తొగుట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నూటికి నూరు శాతం ఫలితాలు సాధించి శభాష్‌ అనిపించుకుంది. మరో ఐదు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 90 శాతం కంటే ఎక్కువగా ఫలితాలు సాధించాయి.

No comments:

Post a Comment