అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...
పర్యాటక రంగం :
ప్రధాన దేవాలయాలు:
భద్రేశ్వరస్వామి
దేవాలయం
తాండూరు:
భావిగి
భద్రేశ్వర
స్వామి
దేవాలయం.
200 ఏళ్ల కిందట
మహిమ
గల
శరణు
బసవేశ్వరుడు
కర్ణాటక
రాష్ట్రం
నుంచి వచ్చి
అదృశ్యమైన
ప్రదేశం.
ప్రతి ఏటా ఏప్రిల్
నెల చివరి
వారంలో
ఉత్సవాలు
జరుగుతుంటాయి.
నీళ్లపల్లి
శివాలయం
బషీరాబాద్
మండలం
నీళ్లపల్లి
గ్రామ
సమీపంలో
శివాలయం
ఉంది.
త్రేతాయుగంలో
శ్రీరామచంద్రుడు
బ్రహ్మ
హత్య
దోష
నివారణ
కోసం
స్వయంగా
ప్రతిష్ఠించిన
శివాలయమిదని
పూర్వీకులు
చెబుతుంటారు.
ఏటా శ్రావణ
మాసంలో
ఇక్కడ
ఉత్సవాలు
జరుగుతుంటాయి.
అంబురామేశ్వరాలయం
పెద్దేముల్
మండలం
ఇందోల్‌లో
లింగేశ్వరాలయం,
తట్టెపల్లి
గ్రామ
సమీపంలో
అంబురామేశ్వరాలయం
ఉన్నాయి.
త్రేతాయుగంలో
శ్రీరామచంద్రుడు
ఇక్కడే
శివలింగాలను
ప్రతిష్ఠించి
పూజించినట్లు
పురాణ
గాధ. ఏటా
శ్రావణమాసం,
శివరాత్రికి
ఉత్సవాలు
జరుగుతుంటాయి.
అనంతగిరి
పద్మనాభుడు
వికారాబాద్
మండలంలో
దట్టమైన
అనంతగిరి
కొండల్లో
పద్మనాభస్వామి
ఆలయం ఉంది.
మహారుషి
ముచికుందునికి
శ్రీమన్నారాయణుడు
అనంత
పద్మనాభుని
రూపంలో
దర్శన
మిచ్చిన
ప్రదేశమిది.
పద్మనాభుడు
లింగాకృతిలో
ఉన్న
దేవాలయం
జగత్తులో
ఇదొక్కటేనని
పండితులు
చెబుతుంటారు.
మూసీ నది
దేవాలయానికి
సమీపంలోనే
పుట్టింది.
కీసర
రామలింగేశ్వరాలయం
కీసరగుట్టలో
రామలింగేశ్వర
స్వామి
దేవాలయం
ఉంది.
త్రేతాయుగంలో
రావణబ్రహ్మ
హత్యకు
సంబంధించి
దోష
నివారణ
కోసం
శ్రీరామచంద్రుడు
శివలింగాన్ని
ప్రతిష్టించిన
ప్రదేశం.
హనుమంతుడు
తాను
తీసుకువచ్చిన
లింగాలను
పడవేయడంతో
శివలింగాలు
గుడి
చుట్టూ
విసిరేసినట్లుగా
ఉంటాయి.
రాష్ట్రంలో
ప్రసిద్ధి
చెందిన
దేవాలయమిది.
హైదరాబాద్‌కు
సమీపాన
ఉండటంతో
పెద్దసంఖ్యలో
భక్తులు
రామలింగేశ్వరుణ్ని
దర్శించుకుంటుంటారు.
ఏటా
శివరాత్రి
ఘనంగా
నిర్వహిస్తారు.
నందీశ్వరాలయం
యాచారం
మండలంలో
వనపర్తి
గ్రామంలో
చారిత్రక
నందీశ్వరాలయం
ఉంది.
పొలంలో
మేత
మేయటానికి
వచ్చిన నంది
యజమాని
అదిలించగానే
కాలు విరిగి
శిలగా
మారిందని
గాథ.
దీంతో
నందీశ్వరుడికి
గుడి
నిర్మించినట్లు
కథలు
ప్రచారంలో
ఉన్నాయి.
చేవెళ్ల
వేంకటేశ్వరాలయం
చేవెళ్లలోని
వేెంకటేశ్వరాలయానికి
700
సంవత్సరాల
చరిత్ర ఉంది.
తిరుపతికి
వెళ్ల లేని
వారిని దృష్టిలో
పెట్టుకుని
శ్రీరంగదాసు
అనే వ్యక్తి
దేవాలయాన్ని
నిర్మించాడు.
తిరుపతిలో
బ్రహ్మోత్సవాలు
జరిగినపుడు
ఇక్కడా
బ్రహ్మోత్సవాలుజరుగుతాయి.
చిలుకూరు
బాలాజీ
ఆలయం
కోరిన
కోర్కెలు
తీర్చే
ఇలవేలుపుగా
భక్తులను
అలరిస్తున్నాడు
చిలుకూరు
బాలాజీ.
జంటనగరవాసులే
కాక
రాష్ట్రం
నలుమూలలనుంచీ
కూడా
భక్తులు
పెద్దసంఖ్యలో
రోజూ ఈ
దేవాలయానికి
వస్తారు.
ఆర్టీసీ
మెహదీపట్నం
ప్రాంతంనుంచి
ఈ
దేవాలయానికి
దాదాపుగా
ప్రతి
పదినిమిషాలకో
బస్సు
నడుపుతోంది.
ఈ ఆలయం
వెనక 500 ఏళ్ల
నాటి
ఆసక్తికరమైన
కథ
ఒకటి ఉంది.
చిలుకూరు
గ్రామానికి
చెందిన
గున్నాల
మాధవరెడ్డి
అనే
భక్తుడు
ఏటా
తిరుమలకు
కాలినడకన
వెళ్లేవాడు.
వయసుపైబడిన
తర్వాత
కూడా ఓసారి
అలాగే
వెళ్తూ
మార్గమధ్యంలో
సొమ్మసిల్లి
పడిపోగా,
అప్పుడు
ఆయనకు
కలలో
బాలాజీ
కన్పించాడు.
అంత
దూరం
తిరుమల
వెళ్లాల్సిన
అవసరం
లేదని,
తాను
పక్కనే
పుట్టలో
కొలువై
ఉన్నానని, తీసి
గుడి
కట్టించమని
చెప్పి
అదృశ్యమయ్యాడు.
నిద్రనుంచి
తేరుకున్న
మాధవరెడ్డి
తన కల
గురించి
గ్రామపెద్దలకు
తెలియజేయగా
అంతా
కలసి వెళ్లి
పుట్టను
పెకిలించారు.
ఆ
సమయంలో
ఒక
గునపం
బాలాజీ
ఎదభాగంలో
తగలడంతో
అక్కడ
గాయమై
రక్తం
వచ్చింది.
పాలతో
కడిగి
బాలాజీ
విగ్రహాన్ని
బయటకు
తీశారు.
అక్కడే
దేవాలయం
నిర్మించి,
విగ్రహాన్ని
ప్రతిష్ఠించి
పూజించడం
ప్రారంభించారు.
ఇప్పటికీ
బాలాజీ
ఎదభాగంలో
గునపం
గుచ్చుకున్న
ఆనవాళ్లుంటాయి.
ఇటీవలే
పురాతన
ధ్వజస్తంభాన్ని
తొలగించి
కొత్త
ధ్వజస్తంభాన్ని
ఏర్పాటు
చేశారు.
హుండీలేని
దేవాలయం
ఈ ఆలయానికి
ప్రభుత్వం
స్వయం
ప్రతిపత్తి
హోదా
కల్పించింది.
ఇక్కడ
హుండీ
ఉండదు.
నిత్యపూజ నిధి
కోసం
భక్తులు
విరాళాలు
ఇవ్వాలనుకుంటే
బ్యాంకు
ఖాతాలో
జమచేసే
ఏర్పాటు
చేశారు.
ఓ కమిటీ
ఆధ్వర్యంలో
ఇది
పనిచేస్తుంది.
ఉదయం
ఐదునుంచి
సాయంత్రం
7.45 గంటల
వరకు
ఆలయం తెరిచి
వుంటుంది.
వీఐపీ
దర్శనాలు,
ప్రత్యేక
పూజల
టికెట్లంటూ
ఇక్కడ ఏమీ
ఉండవు.
ఎలాంటి
తారతమ్యాలు
లేకుండా
అందరికీ
ఒకటే క్యూ
ఉంటుంది.
స్వామివారి
సన్నిధి
వరకూ
వెళ్లి
దర్శనం
చేసుకునే
వీలుంటుంది.
ఉదయం
ఐదు
గంటలకే
గుడి
తెరుస్తారు.
అర్చకులు
స్వామివారికి
అర్చన
చేసి
పువ్వులతో
అలంకరిస్తారు.
అనంతరం
భక్తులను
అనుమతిస్తారు.
భక్తులు
తమ
సంకల్పం
నెరవేరగానే
మళ్లీ వచ్చి
ఆలయం
చుట్టూ 108
ప్రదక్షిణలు
చేయడం
ఇక్కడ
ప్రత్యేకత.
దాంతో
ఆలయం ఏడాది
పొడుగునా
ప్రదక్షిణలు
చేసే
భక్తులతో
కిటకిటలాడుతుంటుంది.
ఏటా చైత్ర
మాసంలో
చిలుకూరు
బాలాజీ
బ్రహ్మోత్సవాలు
నిర్వహిస్తారు.
పాంబండ
దేవాలయం
కుల్కచర్ల
మండలంలో
పాంబండ
దేవాలయం
ఉంది.
త్రేతాయుగంలో
శ్రీరామ
చంద్రుడు
రావణ
బ్రహ్మ
హత్య
దోషనివారణ
కోసం
శివలింగాన్ని
ప్రతిష్ఠించిన
ప్రదేశం.
ప్రతి ఏటా మార్చి
నెలలో
ఉత్సవాలు
జరుగుతాయి.
దామగుండం
ఆలయం
పూడూరు
మండలం
దామగుండం
గ్రామంలో
రామలింగేశ్వరాలయం
ఉంది. పూర్వం
దాముడు,
గుండుడు
అనే
వ్యక్తులు
శివలింగాన్ని
ప్రతిష్టించి
మోక్షాన్ని
పొందారు.
వీరిద్దరు
ప్రతిష్ఠించిన
లింగం
కావటంతో
వారిద్దరి పేరిటే
దామగుండం
గ్రామం
ఏర్పాటైంది. ఏటా
చైత్రమాసంలో
ఉత్సవాలు
జరుగుతాయి.
ఇక్కడి
రామలింగేశ్వరుణ్ని
దర్శించుకున్న
వారికి
మోక్షం
కలుగుతుందని
పేరుంది.
మహేశ్వరం
అక్కన్న,
మాదన్న
కాలంలో
శివగంగ
రాజరాజేశ్వరి
దేవాలయం
నిర్మాణం జరిగింది.
కోరిన
కోర్కెలు
తీర్చే
దేవుడిగా
పేరుంది.
ప్రతి ఏటా
శివరాత్రి
నాడు
ఉత్సవాలు
జరుగుతాయి.
అమరలింగేశ్వరాలయం
మేడ్చల్‌లో
అమరలింగేశ్వరాలయం
ఉంది.
అక్కన్న
మాదన్నల
కాలంలోనే
ఈ
దేవాలయమూ
నిర్మాణమైంది.
కోరిన
కోర్కెలు
తీర్చే
దేవుడిగా
పేరుంది.
ఏటా
శివరాత్రికి
ఉత్సవాలు
జరుగుతాయి.
మేడ్చల్‌లోనే
క్షేత్రగిరి
వేెంకటేశ్వరాలయం
ఉంది. 300
సంవత్సరాల
కిందట
ఆకారపు
వంశీయులు
దేవాలయాన్ని
నిర్మించారు.
ఏటా
సంక్రాంతి
పండుగ
మరుసటి
రోజున
ఉత్సవాలు
జరుగుతాయి
పర్యాటక ప్రదేశాలు :
రంగారెడ్డి
జిల్లాలో
గండిపేట,
హిమాయత్‌సాగర్,
మృగవని
పార్క్,
వికారాబాద్‌లోని
అనంతగిరి
పర్యాటక
కేంద్రాలు
పర్యాటకులను
ఆకట్టుకుంటున్నాయి.
అనంతగిరి
హిల్స్
వికారాబాద్‌కు
6
కి.మీ
దూరంలో
అనంతగిరిలో
ఎత్తయిన
కొండలపై
ఏర్పాటు
చేసిన
పర్యాటక
కేంద్రం,
కొన్ని వేల
సంవత్సరాల
చరిత్ర కలిగిన
శ్రీ అనంత
పద్మనాభస్వామి
దేవాలయం
ఉన్నాయి.
పర్యాటక
కేంద్రంలో
అతిథిగృహం,
త్రీస్టార్
హోటల్,
ఈతకొలను,
36 విశ్రాంతి
గదులు,
ఆయుర్వేద
కేంద్రం,
మినిస్టేడియంతో
నిర్మించిన
ఈ పర్యాటక
కేంద్రానికి
సందర్శకుల
తాకిడి
ఎక్కువగానే
ఉంటోంది.
ఇక్కడికి
వచ్చేవారు
ఆన్‌లైన్‌లో
లేదా
నేరుగా
గదులు
బుక్
చేసుకోవచ్చు.
గది బుక్
చేసుకొన్నవారు
ఉచితంగానే
ఈతకొలను,
జిమ్‌లను
ఉపయోగించుకోవచ్చు.
బస్సు,
రైలు
సౌకర్యం
అనంతగిరి
పర్యాటక
కేంద్రం
హైదరాబాద్‌కు
76 కి.మీ
దూరంలో
ఉంది.
తాండూరు-
హైదరాబాద్
మార్గంలో
వెళ్లే ప్రతి
బస్సు
అనంతగిరిలో
ఆగుతుంది.
ఇక
ముంబయి,
రాయలసీమ,
హరిప్రియ,
హుస్సేన్‌సాగర్,
పూణె,
లోకమాన్యతిలక్,
మన్మాడ్,
పల్నాడు
తదితర
ఎక్స్‌ప్రెస్
రైళ్లు
వికారాబాద్‌లో
ఆగుతాయి.
వీటితో
పాటు
పలు
ప్యాసింజర్
రైళ్లు
వికారాబాద్
మీదుగా
వెళ్తాయి.
ఇక్కడ దిగి ఆటో,
బస్సులో
అనంతగిరి
వెళ్లేందుకు
వీలుంటుంది.
బుగ్గరామేశ్వరాలయం
రాముడు
అరణ్యవాసం
చేస్తున్నప్పుడు
బుగ్గరామేశ్వరంలో
లింగాన్ని
ప్రతిష్ఠించిన
సందర్భంలో
స్వయంగా
పాతాళ
గంగ
వెలిసిందన్నది
పురాణగాథ.
నిరంతరం
నీరు
బుడగలతో
ఉబికి పైకి
వస్తుంది.
అందుకే
బుగ్గరామేశ్వరం
అన్న పేరు
వచ్చింది.
ఇందులో
స్నానం
చేసి లింగాన్ని
పూజిస్తే
సకల
పాపాలు
పోతాయన్నది
భక్తుల
నమ్మకం.
ఎలా
వెళ్లాలి:
వికారాబాద్‌కు
5
కిలోమీటర్ల
దూరంలో
రామయ్యగూడ
రోడ్డు
మీదుగా
తాండూరు
వెళ్లే దారిలో
ఈ ఆలయం ఉంది.
వికారాబాద్
నుంచి
ఆటోలు, నిర్ణీత
వేళల్లో
బస్సులు
వెళ్తాయి.
కోట్‌పల్లి
ప్రాజెక్టు
జిల్లాలో
మధ్యతరహా
ప్రాజెక్టు
కోట్‌పల్లి. దీని
ఆయకట్టు 9200
హెక్టార్లు.
ఇటీవల
ప్రాజెక్టు
సందర్శించేందుకు
పర్యాటకులు
భారీగా
తరలివస్తున్నారు.
నీటితో ఈ
ప్రాజెక్టు
ఎప్పుడూ
కళకళలాడుతుంది.
వికారాబాద్
నుంచి
పెద్దేముల్
మీదుగా
తాండూరు
వెళ్లే దారిలో
కోట్‌పల్లి
ప్రాజెక్టు
వస్తుంది.
ఎలా
వెళ్లాలి:
వికారాబాద్
నుంచి
ధారూర్,
అక్కడి
నుంచి
ప్రాజెక్టుకు
ఆటోలో
వెళ్లొచ్చు.
దామగుండంలో
రామలింగేశ్వరస్వామి
శతాబ్దాల
కిందట
దాముడు,
గుండుడు
అనే
భక్తులు
నిర్మించిన ఈ
ఆలయానికి
దామగుండం
అనే
పేరు
వచ్చింది.
కొండలు,
చుట్టూ
దట్టమైన
అడవి
మధ్య ఈ
ఆలయం
ఉంటుంది.
ఇక్కడ
నిరంతరం
నీరు
ప్రవహిస్తుంటుంది.
పూడూరు
మండల
కేంద్రానికి 2
కి.మీ,
వికారాబాద్‌కు
7
కిలోమీటర్ల
దూరంలో
దామగుండం
అడవిలో
రామలింగేశ్వరాస్వామి
ఆలయం
ఉంది.
వికారాబాద్
నుంచి ఆటోలో
వెళ్లొచ్చు.
గండిపేట
గండిపేట
జలాశయం
నగరానికి
అతి
సమీపంలో
ఉంది.
హైదరాబాద్
నుంచి
కేవలం 12
కి.మీ.
మాత్రమే
ఉంటుంది.
పావుగంటకో
ఆర్టీసీ బస్సు
ఉంది.
మెహిదీపట్నం
నుంచి 120
నెంబరు
గల
బస్సులో
గండిపేట
చేరుకోవచ్చు.
జలాశయం
మధ్యలోనే
పచ్చని
పార్కు
ఉంది.
గండిపేటకు
సమీపంలోనే
గోల్కొండ
కోట ఉంది.
అలాగే
గండిపేట
జలాశయాలను
ఆనుకొని
పలు
రిసార్టులు
ఉన్నాయి.
వీటితో పాటు
ఓషియన్
పార్కు
కూడా ఉంది.
నగరం
నుంచి
సొంత
వాహనాలపై
వచ్చే
పర్యాటకులు
లంగర్‌హౌజ్,
టిప్పుఖాన్
వంతెన,
రాందేవ్‌గూడ
మీదుగా
గండిపేట్
చేరుకోవచ్చు.
జలాశయానికి
16
క్రస్ట్‌గేట్‌లు
ఉన్నాయి.
హిమాయత్‌సాగర్
హిమాయత్
సాగర్‌కు
మొత్తం 22
క్రస్ట్
గేట్‌లు
ఉన్నాయి.
సాగర్‌లోకి
మూసీ
వాగు
వరద
నీరు
వస్తుంది.
హిమాయత్‌సాగర్
జలాశయానికి
డిజైన్
ఇంజినీర్‌గా
మోక్షగుండం
విశ్వేశ్వరయ్య
వ్యవహరించగా,
కన్సల్టింగ్
ఇంజినీర్‌గా
నవాబ్ అలీ
నవాబ్ జంగ్
వ్యవహరించారు.
దీని నిర్మాణాన్ని
1920లో
మొదలు
పెట్టగా 1927లో
పూర్తి
చేశారు.
ఈరోజుల్లో ఈ
జలాశయం
నిర్మాణానికి
రూ.93
లక్షలు
వెచ్చించారు.
నగరం
నుంచి 10
కిలోమీటర్ల
దూరం
ఉంటుంది.
కోఠి నుంచి
95
నెంబరు
బస్సులో
హిమాయత్
సాగర్
చేరుకోవచ్చు.
అలాగే
మెహిదీపట్నం
నుంచి 288బి, 288జడ్
నెంబర్ల
బస్సులు
హిమాయత్‌సాగర్
మీదుగా
వస్తాయి.
మృగవని
పార్కు
నగర
సమీపంలోని
గండిపేట,
హిమాయత్‌సాగర్
చెరువులకు
కుడి,
ఎడమ
వైపుల ఉన్న
చిలుకూరు
మృగవని
జింకల
పార్కు
మొత్తం 1211
ఎకరాల
విస్తీర్ణంలో
ఉంది.
రోజురోజుకు
అడవులు
అంతరించిపోతున్నాయనే
ఉద్దేశంతో
అప్పటి
ముఖ్యమంత్రి
నందమూరి
తారకరామారావు
చిలుకూరు
రెవెన్యూ
పరిధిలోని
సర్వేనెం.1లో
ఉన్న
ప్రభుత్వ
భూమిలో
ఈ
పార్కును
అభివృద్ది
చేశారు.
అంతకుముందు
చిలుకూరు
రిజర్వు
ఫారెస్టుగా
ఉన్న దీన్ని మృగవని
పార్కుగా
తీర్చిదిద్దారు.
అనంతరం
పార్కును
1998లో
మృగవని
జాతీయ
జింకల
పార్కుగా
మార్చారు.
పార్కులో
అన్ని
రకాల
వన్యప్రాణులు
ఉన్నాయి.
ప్రస్తుతం
ఇందులో 450
చుక్కల
జింకలు, 40
సాంబర్
జింకలు, 250
అడవిపందులు,
200ల
నెమళ్లు,
115 రకాల
పక్షులు,
20 రకాల
సీతాకోక
చిలుకలు,
20 రకాల
కోబ్రాలు,
పాములు,
మోనిటర్
బల్లులు,
గెక్కాస్,
తాబేళ్లు,
అడవిపిల్లులు,
చిరుతపులులు,
ఉడుములు,
కుందేళ్లు,
రెండు
బ్లాక్
కోబ్రాలు
ఉన్నాయి.
కొన్నాళ్లుగా
ఇతర
ప్రాంతాల
నుంచి
పాముల్ని
పట్టుకుని
నాగపంచమి
సందర్భంగా
వాటిని
నగరానికి
తీసుకొచ్చి
విక్రయించడం
ఎక్కువైంది.
భూతదయ
గలవారు
వాటిని కొని
ఇక్కడ
వదులుతుంటారు.
అడవిలో
600
రకాలు
మొక్కల
జాతులుండగా,
130 రకాల
ఔషధ
చెట్లు
ఉన్నాయి.
పార్కులోకి
వెళ్లగానే
సువాసనలు
వెదజల్లుతాయి.
నెమళ్ల
నాట్య
విన్యాసాలు
పర్యాటకులను
ఎంతగానో
అలరిస్తాయి.
చిలుకూరు
బాలాజీ
దేవాలయం
కోరిన
కోరికలు
తీర్చే
ఇలవేల్పుగా..
తెలంగాణ
తిరుమలగా
వెలుగొందుతున్న
చిలుకూరు
బాలాజీ
దేవాలయానికి
సైతం
వేసవి
సెలవుల్లో
భక్తులు,
సందర్శకులు
ఎక్కువగా
వస్తారు.
తిరుమల
తిరుపతికి
ఉన్న విశిష్టత
చిలుకూరు
బాలాజీ
దేవాలయానికి
ఉంది.
చిలుకూరు
బాలాజీ
దేవాలయానికి
దాదాపు 500ల
సంవత్సరాల
చరిత్ర ఉంది.
చిలుకూరు
గ్రామానికి
చెందిన
గున్నాల
మాధవరెడ్డి
అప్పట్లో ప్రతీ
సంవత్సరం
తిరుమల
కొండకు
కాలినడకన
వెళ్లేవాడు.
వృద్ధాప్యంలో
సైతం
గ్రామం
నుంచి
తిరుమలకు
కాలినడకన
బయలుదేరగా
గ్రామ
శివారులో
నడువలేని
స్థితిలో
సొమ్మసిల్లి
పడిపోయాడు.
అప్పుడు
వెంకటేశ్వర
స్వామి అతని
కలలోకి
వచ్చి
భక్తా
నీవు ఈ
వయసులో
కూడా ఇంత
దూరం
కాలినడకన
నా
వద్దకు
రావాల్సిన
అవసరం
లేదు. నీవు
నిద్రిస్తున్న
స్థలం
పక్కనే ఉన్న
పుట్టలో
కొలువై
ఉన్నాను.
బయటకు
తీసి పూజలు
చేసిన
అనంతరం
ఇక్కడే ఓ
దేవాలయాన్ని
నిర్మించమని
చెప్పి
మాయమైపోయాడు.
నిద్రలో నుంచి
తేరుకున్న
అతను
వెంటనే
విషయాన్ని
గ్రామస్తులకు
చెప్పడంతో
అంతా
కలిసి
పుట్టను
గునపాలతో
తవ్వడం
ప్రారంభించారు.
ఈ
క్రమంలో
గునపం
పుట్టలో ఉన్న
బాలాజీ
ఎద
భాగంలో
తగిలి
రక్తం
కారడం
మొదలైంది.
భక్తులంతా
కలిసి
పాలాభిషేకం
చేసి
బాలాజీని
బయటకు
తీశారు.
అక్కడే
దేవాలయాన్ని
నిర్మించి
బాలాజీని
అందులో
ప్రతిష్టించి
పూజలు
చేయడం
ప్రారంభించారు.
ఇప్పటికీ
బాలాజీ
ఎదభాగంలో
గునపం
తగిలిన
ఆనవాళ్లు
కనిపిస్తాయి.
చిలుకూరు
బాలాజీ
దేవాలయానికి
ఆనుకొనే
గండిపేట
జలాశయం
ఉంది. నగరం
నుంచి ప్రతీ 15
నిమిషాలకో
ఆర్టీసీ బస్సు
ఉంది.
నగరంలోని
దిల్‌సుఖ్‌నగర్,
హయత్‌నగర్,
అఫ్జల్‌గంజ్,
రాణిగంజ్,
ఉప్పల్,
సికింద్రాబాద్,
కూకట్‌పల్లి,
కోఠి,
సెంట్రల్
యూరివర్సిటీ,
మెహిదీపట్నం
నుంచి
బస్సులు
ఉన్నాయి.
నగరం
నుంచి
సరిగ్గా 18
కిలోమీటర్లు
ఉంటుంది.
అలాగే
మెహిదీపట్నం
288డీ, 288
బస్సులు
వెళతాయి.
No comments:
Post a Comment