అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, April 25, 2012

ఇంటర్ సెకండియర్‌లోనూ బాలికలే టాప్


జిల్లాలో 51 శాతం ఉత్తీర్ణత
గత ఏడాదితో పోలిస్తే అరశాతం తక్కువ
సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలలు
తొగుట కళాశాలలో వంద శాతం ఉత్తీర్ణత
సీఈసీలో ముగ్గురికి రాష్ట్ర స్థాయిలో స్థానం


సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ బాలికలు సత్తా చాటారు. జిల్లాలో జనరల్ కేటగిరీలో 51 శాతం, ఒకేషనల్ విభాగంలో 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణుల య్యారు. జనరల్ కేటగిరీలో బాలికలు 53.31, బాలురు 49.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. జనరల్ కేటగిరీలో గత ఏడాది 51.50 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది స్వల్పంగా తగ్గడం గమనార్హం. ప్రైవేటు జూనియర్ కళాశాలలతో పోలిస్తే ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం 69గా నమోదైంది. తొగుట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. కౌడిపల్లి, రామాయంపేట, చేగుంట, వెల్దుర్తి, ములుగు, పాపన్నపేట, కంగ్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా 90 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదైంది. సీఈసీ విభాగంలో జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. పసల నవీన్ (953) రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలవగా, గరుగుల ప్రశాంత్ (951) మూడో స్థానం, శివ్వ హరీష్ (938) ఏడో స్థానంలో నిలిచారు. ఇతర విభాగాల్లోనూ జిల్లా విద్యార్థులు సత్తా చూపారు.

No comments:

Post a Comment