హైదరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో క‘న్నీటి’ కష్టాలు ప్రారంభమయ్యాయి. సాగు మాటెలావున్నా, తాగునీటికీ కరవొచ్చే పరిస్థితి దాపురించింది. వచ్చే వేసవికి సమస్య మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ముంచుకొస్తోందని భూగర్భ జలాల నిపుణులు
హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో వేసివిలో చుక్క నీరు దొరకటం గగనమయ్యే పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్టవ్య్రాప్తంగా భూగర్భ జలాలు మీటర్లకొద్దీ దిగజారిపోవటం, జలాశయాల్లో నీరు అడుగంటడం, గత వానాకాలంలో మోస్తరు వర్షాలు కూడా లేకపోవటం, రాష్ట్రంలో నీటి అవసరాలు అంతకంతకూ పెరుగుతుండటం వంటి కారణాలు కటకటకు దారితీస్తున్నాయి. ప్రధానంగా గత సీజన్‌లో వర్షాభావం వచ్చే వేసవిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదే సంభవిస్తే సాగునీటి సంగతెలావున్నా, తాగునీటికి మైళ్ల దూరం పరుగులు తీయాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.తాజా లెక్కల ప్రకారం జనవరి నాటికే భూగర్భ జలాల పరిస్థితి దారుణంగా తయారైంది. క్రమేపీ ముప్పు మరింత ఆందోళనకరంగా మారుతోంది. ఎప్పుడూ వర్షాలు, తుపానులతో అతలాకుతలమయ్యే కోస్తా జిల్లాల్లో సైతం భూగర్భ జలాలు లోలోపలకు పోతుండటం పరిస్థితి తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 6.29 మీటర్ల కిందకు భూగర్భ జలాల మట్టం పడిపోయింది. గత 2010 డిసెంబర్‌లో 3.85 మీటర్లకే నీరు లభ్యమైతే, గత డిసెంబర్‌లో ఏకంగా 10.14 మీటర్లకు వెళ్తే తప్ప నీరు లభించని పరిస్థితి నెలకొంది. దీన్నిబట్టి రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతోంది.
మొత్తం కోస్తా పరిస్థితి గమనిస్తే 2010 డిసెంబర్‌లో సగటున 4.17 మీటర్ల లోతులో నీరు లభిస్తే, ప్రస్తుతం ఏడున్నర మీటర్ల కిందకు వెళ్లినా తడి తగులుతుందన్న నమ్మకం కలగటం లేదు. కోస్తా జిల్లాల్లోనే పరిస్థితి ఇంత దారుణంగావుంటే, రాయలసీమ, తెలంగాణ జిల్లాల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. సీమ జిల్లాల్లో సగటున 2010 డిసెంబర్‌లో 7.98 మీటర్ల లోతున నీరు లభించగా, ఇప్పుడు 11 మీటర్లకు నీటి లభ్యత పడిపోయింది. తెలంగాణలో 2010 డిసెంబర్‌లో 7.09 మీటర్ల వద్ద నీరు లభిస్తే, ఇప్పుడు పది మీటర్ల మీటర్ల కిందకు భూగర్భ జలం దిగజారింది. అత్యధికంగా భూగర్భ జలాలు పడిపోయిన ఆందోళనకర పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఉండగా, రంగారెడ్డి, మెదక్, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కనీసం నాలుగు మీటర్లకన్నా ఎక్కువ లోతుకు నీటి మట్టం పడిపోయింది. ఒక్క నిజామాబాద్‌లో మాత్రం పరిస్థితి దయనీయంగా మారకుండా కొంతవరకు మెరుగు కనిపిస్తోంది. ఇక్కడ భూగర్భ జలాలు తగ్గినప్పటికీ కేవలం 0.97 మీటర్లకు మాత్రమే తగ్గడంతో, ఇంకా ప్రమాదకర స్థాయికి చేరుకోలేదని తెలుస్తోంది.
ఒకవైపు భూగర్భ జలాల పరిమాణం దిగజారుతుంటే, మరోవైపు జలాశయాల్లోనూ నీటి మట్టం పడిపోతుండటం భవిష్యత్ పరిస్థితిని సూచిస్తోంది. గత ఏడాది వర్షాకాలంలో సరైన వర్షాలు లేకపోవటం వల్ల ప్రధాన జలాశయాల్లో నీరు ఆశించిన స్థాయిలో నిల్వ కాలేదు. ఇదే సమయంలో రబీ నీటి వినియోగాన్ని ఎక్కువ చేయడం కూడా సమస్యకు కారణంగా నిలుస్తోంది. ఈ పరిస్థితిని ముందుగానే గమనించిన ప్రభుత్వం బోర్ల తవ్వకాలపై నిషేధం విధించడంతోపాటు, చిన్న నీటి పారుదల చెరువులను మరమ్మతు చేసేందుకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే అనుకోని అతిధిలా అకాల వర్షాలు సంభవిస్తే తప్ప నీటి సమస్యకు మోక్షం లభించడం కష్టమేనని నిపుణులు అంటున్నారు.

No comments:
Post a Comment