అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, April 23, 2012

రవాణా సౌకర్యాలు :


జిల్లాలో సుమారు మూడు వేల కి.మీ.లకు పైగా రోడ్లున్నాయి. ఇందులో ప్రధానంగా హైదరాబాద్‌-నాగపూర్‌ జాతీయ రహదారి సహా హైదరాబాద్‌-
ముంబయి జాతీయ రహదారి, హైద్రాబాద్‌-కరీంనగర్‌ రాజీవ్‌ రహదారులున్నాయి. జిల్లాలో ఎన్‌హెచ్‌-44 హైదరాాబాద్‌ నుంచి నిజామాబాద్‌ మార్గంలో జిల్లాలో సుమారు 58 కి.మీ మేరకు ఉంది. ఇక హైద్రాబాద్‌-జహీరాబాద్‌-బీదర్‌ మార్గంలో ఎన్‌హెచ్‌-65 సుమారు 100 కి.మీల వరకు ఉంటుంది. ఇక జిల్లాలో ఆర్టీసీ బస్సులు సహా ప్రైవేటు వాహనాలు వేల సంఖ్యలో ఉన్నాయి. సుమారు నలభై ఏళ్లుగా ఆర్టీసీ సౌకర్యం ప్రయాణీికులకు అందుబాటులో ఉంది. మరోవైపు జిల్లాలో సికింద్రాబాద్‌-నిజామాబాద్‌ రైలుమార్గం సహా సికింద్రాబాద్‌-జహీరాబాద్‌ మార్గాల్లో రైలు సౌకర్యాల్ని జిల్లా ప్రజలు వినియోగించుకుంటున్నారు. 1920-30వ సంవత్సరం మధ్య కాలంలోనే జిల్లాలో రైలు మార్గంఏర్పాటైంది. ఈ రెండు మార్గాలు రెండు జాతీయ రహదారులకు అనుసంధానంగా ప్రయాణికులకు రైలు సేవల్ని అందిస్తున్నాయి. జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రాలు సహా పర్యాటక కేంద్రాలను ప్రయాణికులు దర్శించుకునేందుకు వీలుగా రవాణా సౌకర్యాలు జిల్లాలో మెరుగయ్యాయి.
సంగారెడ్డి
ఆర్టీసీ బస్సు సమాచార కేంద్రం. ఫోన్‌ నం.08455-276382
రైల్వే రిజర్వేషన్‌ కేంద్రం. ఫోన్‌నం.08455-270131
బస్సులు, రైళ్ల వివరాలు
సిద్ధిపేట : సిద్ధిపేట నుంచి నిజామాబాద్‌, బోధన్‌, యేస్గి, లాతూర్‌, పూణె మీదుగా ముంబాయికి బస్సు సౌకర్య ఉంది. సిద్ధిపేట నుంచి ఉదయం 10గంటలకు బయలుదేరుతుంది.
సిద్ధిపేట- షోలాపూర్‌: సిద్ధిపేట నుంచి హైదరాబాద్‌, జహీరాబాద్‌, హుమ్నాబాద్‌ మీదుగా షోలాపూర్‌ వరకు మూడు బస్సు సర్వీసులు ఉన్నాయి. సిద్ధిపేట నుంచి ఉదయం 7:30, 10:30, సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరుతాయి.
సిద్ధిపేట-గోండా: సిద్ధిపేట నుంచి హైదరాబాద్‌, కరీంనగర్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, చంద్రాపూర్‌, గోరేగావ్‌ మీదుగా గోండాకు బస్సు సౌకర్యం ఉంది. సిద్ధిపేట నుంచి మధ్యాహ్నం 2:40 గంటలకు బస్సు బయలు దేరుతుంది.
సంగారెడ్డి- బెంగుళూరు: సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌, కర్నూల్‌, అనంతపూర్‌, మీదుగా బెంగుళూరుకు బస్సు సౌకర్యం ఉంది. సంగారెడ్డి నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుంది.
జహీరాబాద్‌- బెంగుళూరు: జహీరాబాద్‌ నుంచి హైదరాబాద్‌, అనంతపూర్‌, మీదుగా బెంగుళూరుకు బస్సు సౌకర్యం ఉంది. జహీరాబాద్‌ నుంచి మద్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరుతుంది.
గజ్వెల్‌ ప్రజ్ఞాపూర్‌-ముంబాయి: గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ నుంచి చెర్యాల్‌, సిద్ధిపేట, జేబీఎస్‌, జహీరాబాద్‌, హుమ్నాబాద్‌, షోలాపూర్‌, పూణె మీదుగా ముంబాయికి బస్సు సౌకర్యం ఉంది. గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ నుంచి ఉదయం 10:15 గంటలకు బయలుదేరుతుంది.
రైల్వే సమాచారం
జిల్లాలో సంగారెడ్డి, సిద్ధిపేటలో రైల్వే రిజర్వేషన్‌ కేంద్రాలు ఉన్నాయి. జహీరాబాద్‌, తూప్రాన్‌ మండలం మనోహరాబాద్‌
తూప్రాన్‌ మండలం మనోహరాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరే రైళ్ల వివరాలు
మనోహరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని పర్‌పని వరకు రైలు సౌకర్యం ఉంది. మధ్యాహ్నం 12:26 గంటలకు బయలుదేరుతుంది.
మనోహరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని మన్మాడ్‌ వరకు రైలు సౌకర్యం ఉంది.
జహీరాబాద్‌ నుంచి రైల్వే సౌకర్యం
జహీరాబాద్‌ నుంచి ఔరంగాబాద్‌కు రైల్‌ సౌకర్యం ఉంది. రాత్రి 12:30 గంటలకు బయలుదేరుతుంది.
జహీరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని పూర్ణకు రైల్‌ సౌకర్యం ఉంది. ఉదయం 11:30 గంటలకు బయలుదేరుతుంది.
జహీరాబాద్‌ నుంచి నాందేడ్‌కు రైల్‌ సౌకర్యం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుంది.
జహీరాబాద్‌ నుంచి షిరిడీకి రైల్‌ సౌకర్యం ఉంది. రాత్రి 7:30 గంటలకు బయలుదేరుతుంది.

No comments:

Post a Comment