అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, April 23, 2012

వ్యవసాయం

నీటిపారుదల :
జిల్లాలో 7,49,300 హెక్టార్ల భూమిఉంది. ఇందులో సాగుకుయోగ్యమైన విస్తీర్ణం 2,37,881 హెక్టార్లు. ఇందులో 72,700 హెక్టార్లకు మాత్రమే సాగునీటి వసతి ఉంది. మూసీ నది జిల్లాలోనే పుట్టి ప్రవహిస్తూ హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్లకు
ప్రధాన నీటివనరుగా ఉంది. ఇదిమొత్తం సాగునీటి అవసరాలకు వినియోగమవుతోంది. కాగ్నా నదిపై కోట్పల్లి వద్ద మధ్యతరహా ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దీనిఆయకట్లు 3726 హెక్టార్లు. ఇదే నదిపై నవాంద్గి నీటి పథకం ఉంది. కోట్పల్లితోపాటు జుంటుపల్లి, లక్నాపూర్‌ మధ్యతరహా ప్రాజెక్టులున్నా వాటి ఆయకట్టు తక్కువే. అత్యధికశాతం భూగర్భ జలాల మీదనే సాగవుతోంది.
ప్రధాన పంటలు :
 రంగారెడ్డి జిల్లాలో 19 రకాల పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్‌లో 1,84,395 హెక్టార్లలో పంటలు సాగవుతుండగా రబీలో 75వేల హెక్టార్లలో పంటలు సాగవుతుంటాయి. జిల్లాలో 18,69,566 ఎకరాల భూభాగం ఉంది. 1,42,560 ఎకరాల్లో అటవీ భూములు.. 1,22,989 ఎకరాల్లో బీడు భూములు.. 1,96,372 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం 781 మి.మీ.గా ఉంది.
పంటల వారీగా విస్తీర్ణం వివరాలు(హెక్టార్లలో)
పంటలు సాధారణ విస్తీర్ణం
వరి 21,806
జొన్న 18,228
మొక్కజొన్న 26,257
రాగి 1214
ఉలవలు 246
పెసర 11,368
మినుము 7,566
కంది 34,855
మిర్చి 1036
ఆలుగడ్డ 88
పసుపు 3984
ఉల్లి 270
పత్తి 22,447
వేరుసెనగ 169
నువ్వులు 694
ఆముదం 6085
పొద్దుతిరుగుడు 185
చెరకు 1280
ఆహారేతర పంటలు 4272
ఇతర పంటలు 21,657
ప్రాజెక్టులు :




జిల్లాలో పెద్ద ప్రాజెక్టులు ఏమీ లేవు. అన్నీ చిన్న తరహా ప్రాజెక్టులే. ప్రధానంగా చెరువులపై ఆధారపడి వ్యవసాయం సాగుతోంది. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు
ఆయకట్టు - 1250 ఎకరాలు
ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు ఘనమైన చరిత్ర ఉంది. 500 ఏళ్ల క్రితం దీనిని నిర్మించారు. వర్షాలు బాగా కురిస్తే 0.8 టిఎంసీల నీరు నిల్వ ఉంటుంది. అలాంటిది ప్రస్తుతం ఈ చెరువులో చుక్క నీరు చేరడం కూడా గగనంగా మారింది.
సాలార్‌నగర్‌ ప్రాజెక్టు
ఆయకట్టు- 1327 ఎకరాలు
సాగవుతున్నది - 300
గండేడ్‌ మండలంలోని సాలార్‌నగర్‌ ప్రాజెక్టును 1975లో నిర్మించారు. దీని కింద 1327 ఎకరాల ఆయకట్టు ఉంది. మరమ్మతుల కోసం రూ. 1.1 కోట్లు మంజూరుకాగా అందులో రూ. 11 లక్షలతో అలుగు నిర్మించారు. కాలువలు, తూముల మరమ్మతులు జరగవలసివుంది. నిల్వ సామర్థ్యం తగ్గడంతో ఏటా 300 ఎకరాలకు మించి సాగవడం లేదు.
శామీర్‌పేట పెద్దచెరువు
ఆయకట్టు - 2600
సాగవుతోంది - 800
శామీర్‌పేట పెద్ద చెరువు 956 ఎకరాల్లో విస్తరించి 42 అడుగుల లోతు కలిగి ఉంది. శామీర్‌పేట చెరువు పూర్తిస్థాయిలో నిండితే 2600 ఎకరాలకు రబీ, ఖరీఫ్‌ సీజన్లలో నీరందుతుంది. చెరువు ఆయకట్టు పొలాల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం వల్ల 1800 ఎకరాలకు సాగు విస్తీర్ణం పడిపోయింది.
ప్రాంతాల వారీగా ఉన్న ప్రాజెక్టులు
పెద్దేముల్‌     కోట్‌పల్లి
తాండూరు     శ్రీరాములవారి ప్రాజెక్టు
తాండూరు     అల్లాపూరు
యాలాల      జుంటుపల్లి
వికారాబాద్‌    సర్పన్‌పల్లి
మోమిన్‌పేట   నందివాగు
గండేడ్‌       సాలార్‌నగర్‌
పరిగి        లఖ్నాపూర్‌
ధారూర్‌      మూన్నూరు సోమారం
మర్పల్లి       కొంశెట్‌పల్లి
పెద్దేముల్‌    పెద్దేముల్‌ పెద్దచెరువు
తాండూరు    అంతారం పెద్దచెరువు
గండేడ్‌      మహమ్మదాబాద్‌మల్కచెరువు
గండేడ్‌      జూలపల్లి వూరచెరువు
శామీర్‌పేట   శామీర్‌పేట పెద్దచెరువు
కుల్కచర్ల    దంతెకాని చెరువు
కుల్కచర్ల    అంతారం పాటిమీది చెరువు
కుల్కచర్ల    కామన్‌పల్లి
దోమ       ఐనాపూర్‌ పెద్దచెరువు
నదులు :
జిల్లాలోని అత్యధిక భాగం మూసీ నదీ పరీవాహక ప్రాంతంగా ఉంది. అనంతగిరి కొండల్లో ఈ మూసీ ప్రవహిస్తోంది. హైదరాబాద్‌, నల్గొండ జిల్లాల మీదుగా ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. ఈసీ వాగు కూడా ఇక్కడినుంచే ప్రారంభమవుతుంది. మూసీపై ఉస్మాన్‌సాగర్‌ రిజర్వాయర్‌ ఉండగా ఈసీపై హిమాయత్‌సాగర్‌ ఉంది. ఇవి రెండూ హైదరాబాద్‌ మంచినీటి అవసరాలకు ఉద్దేశించినవి కావడంతో ఈ నదుల నీటిని సాగు అవసరాలకు వినియోగించుకోవడంపై నిషేధం ఉంది. బీమా ఉపనదిగా ఉన్న కాగ్నా నది జిల్లా మీదుగానే ప్రవహిస్తున్నది. దీని ఆధారంగానే ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులు కొన్ని ఏర్పాటయ్యాయి.

No comments:

Post a Comment