అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, April 25, 2012

ద్వితీయంలో...నాలుగో స్థానం


ఇంటర్‌ సెకండియర్‌లో 66.22 శాతం ఉత్తీర్ణత
గత అయిదేళ్లలో అతితక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు
ఫలితాల్లో ఈసారి బాలికలదే పైచేయి 
న్యూస్‌టుడే, రంగారెడ్డిజిల్లా
ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా నాలుగో స్థానానికి పడిపోయింది. గతేడాది రాష్ట్రంలో రెండో స్థానం సాధించగా ఈ సారి మరో రెండు స్థానాలు పడిపోయింది. 2011-12 సంవత్సరానికి జిల్లా విద్యార్థులు 66.22 శాతం ఉత్తీర్ణత సాధించారు. 82,682 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 54,435 మంది పాసయ్యారు. ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం ఫలితాలను ఇంటర్మీడియట్‌ బోర్డు మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాలు జిల్లా విద్యావర్గాల్లో నిరాశనే నింపాయి. ఏయేటికాయేడు ఉత్తీర్ణత శాతం పడిపోతుండగా రాష్ట్రంలో జిల్లా ర్యాంకు తగ్గుతూ వస్తోంది. గతేడాది ఉత్తీర్ణతశాతం 72 ఉండగా 66 శాతానికి పడిపోయింది. గత అయిదేళ్లలో ఇదే అతి తక్కువ ఉత్తీర్ణత శాతం కావడం విశేషం. సమ్మెలు, బంద్‌ల ప్రభావంతో విద్యా సంవత్సరంలో ఏర్పడిన ఆటంకాలు ఉత్తీర్ణతపై ప్రభావం చూపినట్లు అధ్యాపకులు చెబుతున్నారు. అలాగే ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో 357 కళాశాలలు ఉండగా ఇందులో 32 ప్రభుత్వ, ఎయిడెడ్‌ విభాగంలో నడుస్తున్నాయి. ఆయా కళాశాలల నుంచి బాలుర విభాగంలో 46,132 మంది పరీక్ష రాయగా 62.90శాతం ఉత్తీర్ణతతో 29,015 మంది పాసయ్యారు. 36,550 మంది బాలికలు పరీక్ష రాయగా 69.55 శాతం ఉత్తీర్ణతతో 25,420 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 2,028 మంది విద్యార్థులకు 1048 మంది ఉత్తీర్ణులయ్యారు. 52 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు.
ఏ గ్రేడ్‌ సాధించిన వారే ఎక్కువ 
ప్రభుత్వం గతేడాది నుంచి గ్రేడింగ్‌ విధానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ీఎ' గ్రేడ్‌లో ఎక్కువ మంది పాసయ్యారు. ఇందులో మాత్రం బాలురే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
* ఓకేషనల్‌ విభాగంలో 313 మంది విద్యార్థులు ఏ గ్రేడ్‌ సాధించగా 590 మంది బీ గ్రేడ్‌, 138 మంది సీ గ్రేడ్‌, ఏడుగురు డీ గ్రేడ్‌ సాధించారు.
సత్తాచాటిన విద్యార్థులు
ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ విభాగాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. బైపీసీ విభాగంలో జిల్లాకు చెందిన సంతోషిరూప 988 మార్కులతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది.
బైపీసీ జిల్లా ట్యాపర్లు వీరే 
* 1215229599 - బావి సంతోషిరూప(988)
* 1215242898 - కామనేని నరేష్‌బాబు(986)
* 1215248424 - బత్తుల మౌనిక(983)
* 1215253214 - అల్లం ప్రియాంక(982)
* 1228220544 - వి.మధులిక(982)
ఎంపీసీ ట్యాపర్లు వీరే
* 1228246357 - పి.సాయిప్రసాద్‌(986)
* 1215223869 - పి.శివాని(985)
ఎంఈసీ ట్యాపర్లు వీరే
* 1215245918 - నలమోతు జయరవళి(972)
* 1215244593 - ఎర్రవెల్లి నీరజ్‌కుమార్‌(970)
* 1228226347 - వినీతాగుప్తా(968)
* 1215243262 - కె.స్నిగ్దరాజ్‌(968)

No comments:

Post a Comment