అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Sunday, April 29, 2012

25 లక్షలమందికి రేషన్‌ కటకట


మే నెలలో బియ్యం, కందిపప్పు, పామాయిల్‌ కష్టమే
కూపన్ల పంపణీ జరగనందునే
పౌరసరఫరాలశాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితం

Thursday, April 26, 2012

' తూర్పు'లో 'ఉపాధి' అంతంతమాత్రం!

  • చాలాచోట్ల కూలి రూ.40తో సరి
  • 12 వేల కుటుంబాలకే 100 రోజుల పని

వస్తోందోయ్... కలల రైలు-1


వస్తోందోయ్... కలల రైలు-2


మిర్చి రైతు కంట్లో ‘కారం’!



వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు సంబంధించి దళారుల మోసాలను కాసేపు పక్కన పెడితే... అనేక కారణాల వలన కూడా ధరలకు నిలకడ కొరవడుతున్నదని చెప్పక తప్పదు. ప్రభుత్వ యంత్రాంగం ధరల స్థిరీకరణకు వ్యవస్థాగతంగా ఇప్పటివరకూ సానుకూల చర్యలు చేపట్టలేదు. ధరల స్థిరీకరణ జరగకనే దళారులు దండుకుంటున్నారనే వాస్తవాన్ని ప్రభుత్వం గమనించనట్టు నటిస్తున్నది.వ్యవసాయ ఉత్పత్తుల ధరలను దళారులతో పాటు రాష్ట్రీయ, అంతర్రాష్ట్రీయ మార్కెట్ శక్తులు నిర్ధారిస్తాయనేది ఓ నగ్న సత్యం. ఈ పరిస్థితుల్లో బక్కచిక్కిన సన్న, చిన్నకారు రైతన్నల బాగోగులకు బాధ్యత వహించాల్సింది వ్యవస్థే! రైతు

Wednesday, April 25, 2012

ప్రోత్సాహం ఏదీ?


ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందని చేయూత
అరకొరగా ఐఐపీపీ 2010-15 అమలు
ఆటోమొబైల్ యూనిట్లకే పరిమితం
పెద్ద పరిశ్రమలన్నీ స్థానికేతరులవే
అవగాహనపై ఐపీఓల నిర్లక్ష్యం

వెనకబడ్డాం


రాశి తగ్గింది.. ర్యాంకూ పడిపోయింది..
ఇంటర్ ద్వితీయంలో 66 శాతం ఉత్తీర్ణత
రాష్ట్రంలో నాలుగో స్థానంలో జిల్లా
సర్కారు కళాశాలల్లో 53.18 శాతం పాస్
ఉత్తీర్ణతలో అవ్మూరుులదే పైచేరుు

ఇంటర్ సెకండియర్‌లోనూ బాలికలే టాప్


జిల్లాలో 51 శాతం ఉత్తీర్ణత
గత ఏడాదితో పోలిస్తే అరశాతం తక్కువ
సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలలు
తొగుట కళాశాలలో వంద శాతం ఉత్తీర్ణత
సీఈసీలో ముగ్గురికి రాష్ట్ర స్థాయిలో స్థానం

ప్చ్...


ప్చ్...


సిటీబ్యూరో, న్యూస్‌లైన్: రాష్ట్ర రాజధాని.. చదువులకు కేరాఫ్ అడ్రస్.. పెద్ద పెద్ద విద్యాసంస్థలన్నీ కొలువుదీరిన కేంద్రం.. చెప్పుకోవడానికి విశేషాలు చాలా ఉన్నా.. ఇంటర్మీడియట్ ఫలితాల్లో మాత్రం ఈ హైటెక్ నగరానికి ఈ ఏడాది నిరాశే మిగిలింది. గతేడాది టాప్‌టెన్‌లో కొన్ని స్థానాలు

అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి


సాధించారు....


విద్యార్థుల్లో డిటైన్‌' టెన్షన్‌


* ఈ నెల 30 నుంచి సెమిస్టర్ల పరీక్షలు ప్రారంభం
* వర్సిటీ, కళాశాలల మధ్య కొరవడిన సమన్వయం
* అడిగినంత పైసలిస్తే హాజరు శాతం తక్కువున్నా ప్రమోట్‌
* వర్సిటీ పాలకవర్గం దృష్టికి వచ్చినా పట్టించుకోని వైనం
* ఇదీ జేఎన్‌టీయూ-హెచ్‌ అనుబంధ కళాశాలల విద్యార్థుల పరిస్థితి
జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే
విద్యార్థులకు ఎంత హాజరు తక్కువ ఉంటే అంత మంచిదనే అభిప్రాయంలో ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ప్రయోజనాల కంటే వారి నుంచి ఎంత మేరకు డబ్బు వసూలు చేయాలన్న దానిపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదెక్కడో కాదు... రాష్ట్రంలోనే సాంకేతిక విద్యలో ప్రథమస్థానంలో ఉన్న జేఎన్‌టీయూ-హెచ్‌ అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థుల దుస్థితి.
విద్యార్థులు బేజారు
వర్సిటీకి అనుబంధ కళాశాలల విద్యార్థులు సెమిస్టర్ల పరీక్షలకు హాజరయ్యేందుకు 72 శాతం హాజరు ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత గుర్తింపు పొందిన వైద్యుడి వద్ద నుంచి సర్టిఫికెట్‌ సమర్పించాలి. దాని వల్ల 10 శాతం హాజరు శాతం నుంచి మినహాయింపు ఉంటుంది. కచ్చితంగా 65 శాతం హాజరు ఉంటే సెమిస్టర్‌ పరీక్షలకు అనుమతిస్తారు. ఏదేనీ కారణాల వల్ల 65 శాతం కన్నా హాజరు తక్కువ ఉంటే సెమిస్టర్ల పరీక్షలకు అనుమతి ఉండదు. వేలాది మంది విద్యార్థులు ప్రస్తుతం డిటైన్‌ అయి ఇంట్లో చెప్పుకోలేక పోతున్నారు. ఏడాది పాటు చదువుకు బ్రేక్‌ పడుతుందన్న విషయంలో స్పష్టత రావడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
ఆందోళన...
సుమారు 100 కళాశాలల నుంచి 10 వేల మంది విద్యార్థులను డిటైన్‌ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఓ రెండు ప్రైవేటు కళాశాలల నుంచి గత వారం ఒక్కో కళాశాలలో 100 మందికి పైగా డిటైన్‌ చేసినట్లు పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చారు. అసలే బీటెక్‌ 2-2, 3-2, 4-2 సెమిస్టర్ల పరీక్షలు కావడంతో ప్రస్తుత సంవత్సరం పూర్తి చేసుకొని తదుపతి చదువులు కొనసాగించాలనుకునేవారికి భంగపాటు తప్పడం లేదు. విద్యార్థులే ముందుకు వచ్చి తమను ఎలాగైనా డిటైన్‌ నుంచి గట్టెక్కిస్తే దానికి ప్రతిఫలంగా తాము డబ్బు ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఈ పరిణామం ఆయా కళాశాలలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీన్నే అదునుగా చూసుకొని హాజరు శాతాన్ని బట్టి యాజమన్యాలు మరింత డబ్బు డిమాండ్‌ చేస్తున్నాయని పలువురు విద్యార్థులే పేర్కొంటున్నారు.
అడిగినన్ని సమర్పించుకుంటేనే...
హాజరు ఎంత ఉంటే మీకెదుకు సారు... చెప్పండి ఇంత ఇస్తవా ఇవ్వు లేదంటే నీ ఇష్టం... అంటూ ఆయా కళాశాలల ప్రతినిధుల నుంచి విద్యార్థులకు అందుతున్న ప్రతిస్పందన ఇది. ఈ విషయాన్ని యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్తే... తక్కువ హాజరు ఉంటే డిటైన్‌ చేయరా... అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. మరో వారం రోజుల్లో పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో విద్యార్థులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.
చివరి ఏడాది సంకటం
బీటెక్‌ పూర్తయిన విద్యార్థుల... ఉన్నత చదువులు... ఉద్యోగాల కలలు కల్లలుగానే మిగలనున్నాయి. హాజరు శాతం తక్కువ అంటూ వందలాది మందిని డిటైన్‌ చేసి ఆయా కళాశాలల నోటీస్‌ బోర్డుల్లో జాబితాను ఉంచారు. ఫైనల్‌ ఇయర్‌ చివరి సెమిస్టర్‌ పరీక్షలకు హాజరు కాకపోతే మరో సంవత్సరం చదవాల్సిన దుస్థితి నెలకొంది. కళాశాలల యాజమాన్యాలు, వర్సిటీ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, తల్లిదండ్రులు, స్నేహితుల వద్ద నుంచి డబ్బులు తీసుకొని రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆయా కళాశాలల ప్రతినిధులకు ముట్టజెప్పి ప్రమోట్‌ చేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పరీక్షల విభాగం బేఖాతర్‌...
ఈ నెల 30 నుంచి పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఎందరు? ఎంత మందిని డిటైన్‌ చేశారన్న విషయమై... ఆ విభాగం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గోవర్థన్‌ను ీన్యూస్‌టుడే' సంప్రదించగా తమ దగ్గర జాబితా చూసి ఇస్తామని చెప్పారు. రోజులు గడిచినా చివరకు ఆయన ఫోన్లోనూ అందుబాటులోకి రాలేదు. వర్సిటీ అధికారులకు ఆయా కళాశాలల నుంచి ముడుపులు అందుతున్నాయన్న వార్తలు ఇటీవల ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పత్రికల్లో డిటైన్‌ జాబితా బయటకు వస్తే... తమ పరువు ఎక్కడ పోతుందోనని యాజమాన్యాలు భయపడుతున్నాయని విద్యార్థులు అంటున్నారు

ద్వితీయంలో...నాలుగో స్థానం


ఇంటర్‌ సెకండియర్‌లో 66.22 శాతం ఉత్తీర్ణత
గత అయిదేళ్లలో అతితక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు
ఫలితాల్లో ఈసారి బాలికలదే పైచేయి 

'ఫలితం' సగమేనోయి! మెదక్


'ఫలితం' సగమేనోయి! - మెదక్


'ఫలితం' సగమేనోయి!
ఇంటర్‌లో 51 శాతమే ఉత్తీర్ణత
వచ్చే ఏడాదైనా ఓ పట్టు పట్టాలి సుమా
న్యూస్‌టుడే - సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, పటాన్‌చెరు, గజ్వేల్‌ టౌన్‌

విహరిద్దాం రండి..!



జిల్లాలోనే దర్శనీయ స్థలాలెన్నో
సెలవుల్లో మధురానుభూతులకు వీలు

Monday, April 23, 2012

అమ్ముకోలేక.. దాచుకోలేక..


పంట అమ్మాలంటే ధరల్లేవు.. నిల్వ చేద్దామంటే గిడ్డంగులు లేవు
గిడ్డంగుల అద్దెలు పైపైకి.. పంటల ధరలు కిందికి
ఆరుగాలం కష్టపడినా మార్కెట్ మాయతో దగా
దళారుల నిలువు దోపిడీతో నష్టాలే మిగులు..
రైతు కష్టాలకు కేరాఫ్‌గా మారిన మిర్చి మార్కెట్లు
పసుపు రైతులదీ ఇదే వ్యథ..
రాష్ట్రంలో 5 లక్షల టన్నుల పంట ఉత్పత్తి అయితే.. 600 క్వింటాళ్లు సేకరించిన సర్కారు


పర్యాటక రంగం :



ప్రధాన ఆలయాలు
బిర్లామందిరం, అంబేద్కర్‌కాలనీ, ఆదర్శనగర్‌- 040-3233259
శివం ఆలయం, దుర్గాబాయ్‌దేశ్‌ముఖ్‌ కాలనీ, న్యూనల్లకుంట

వాణిజ్యం

పరిశ్రమలు :


హైదరాబాద్‌ జిల్లాలో చాలా వరకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలే ఉన్నాయి. సనత్‌నగర్‌, ఆజామాబాద్‌లో

నదులు



మూసీనది
రాష్ట్రరాజధాని నగరంలో ప్రవహించే మూసీనదిని ప్రాచీనకాలంలో ముచికుంద అని వ్యవహరించేవారు. రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి కొండల్లో

హైదరాబాద్ రేఖాచిత్రం