అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, March 2, 2012

రాజధానిలో జోరుగా అక్రమనీటి వ్యాపారం

Published Date : Friday, 10/2/2012 1:11 PM IST


* పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ బోర్లు
* చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
* అడుగంటుతున్న భూగర్భ జలాలు


నగర శివార్లలో అక్రమ మంచినీటి వ్యాపారం జోరందుకుంటోంది. ఎక్కడపడితే అక్కడ బోర్లు వేసి నీటిని తోడేస్తున్న అక్రమార్కులు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. కళ్ళముందే నీటి వ్యాపారం జరుగుతున్నా..అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు

వ్యవహరిస్తున్నారు. కూకట్‌పల్లి సర్కిల్‌లో జరుగుతున్న నీటివ్యాపారంపై స్మాల్‌ ఫోకస్‌.. వేసవికి ముందే రాజధానిలో నీటి దందా మొదలయ్యింది. 
అడ్డు..అదుపు లేకుండా బోర్ల మీద బోర్లు వేస్తున్న కొంతమంది భూగర్భ జలాలను తోడేస్తున్నారు. వాల్టా చట్టాన్ని తుంగలోకి తొక్కి అక్రమ నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కూకట్‌పల్లి సర్కిల్‌లో ఈ నీటి వ్యాపారం మూడు ట్యంకర్లు.. ఆరు ట్రిప్పులు చందంగా సాగుతోంది. కూకట్‌పల్లి పరిధిలో యల్లమ్మబండ, నిజాంపేట్‌, మూసాపేట, వెంకటేశ్వర నగర్‌ తదితర ప్రాంతాల్లో జనావాసాల మధ్య... సుమారు వెయ్యి నుంచి 12 వందల అడుగుల లోతులో బోర్లు వేస్తున్నారు. 
ఈ బోర్ల నంచి వస్తోన్న మంచి నీటిని స్థానికంగా ఉన్న హోటల్స్‌, ప్రైవేటు సంస్థలకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు సుమారు 500 నుంచి 800 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ అక్రమ బోర్ల నుంచి పెద్దమొత్తంలో నీటిని తోడేస్తుండటంతో కాలనీలోని బోర్లు ఎండిపోతున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసి అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తున్నా వారు పట్టించుకున్న పాపాన పోవటం లేదు. 
బోర్లకు విద్యుత్‌ కనెక్షన్లను కట్‌ చేయటంతో వీరి అక్రమాలను నియంత్రించవచ్చని స్థానికులు సూచిస్తున్నారు. అయితే.. అక్రమ నీటి వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని బాలానగర్‌ తహశిల్దార్‌ బాలయ్య తెలిపారు. భూగర్భ జలాలను అక్రమంగా తోడేస్తున్న వారి ఆగడాలను వెంటనే నియంత్రించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments:

Post a Comment