అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, March 2, 2012

గుక్కెడు నీళ్లూ.. కరువే


- అడుగంటిన భూగర్భ జలాలు
- వర్షాభావం, వినియోగం పెరగటమే కారణం 
- గ్రామాల్లో తీవ్రమవుతున్న తాగునీ ఎద్దడి
- తెలంగాణలో మరింత దిగజారిన పరిస్థితులు
- 150-250 అడుగుల లోతులోనూ నీరు కష్టమే 


హైదరాబాద్, జనవరి 26 (టీ న్యూస్):రాష్ట్రంలో రోజురోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొంతకాలంగా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా
భూగర్భజలాలు గతంలో ఎన్నడూలేని విధంగా అడుగంటాయి. ఏటా జూలై, ఆగస్టుల్లో కురవాల్సిన వర్షాలు ఈసారి లేకపోవడంతో తెలంగాణలో భూగర్భజలాలు మరింత దిగజారాయి. దీనికితోడు నీటివినియోగం విపరీతంగా పెరిగింది. పదిహేనేళ్ల కిందట తెలంగాణ జిల్లాల్లో 65 నుంచి 135 అడుగుల లోతులోనే నీరు పుష్కలంగా లభించేది. గడిచిన ఐదేళ్ల నుంచి 150-250 అడుగుల లోతులో బోరు వేసినా నీరు లభించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో అత్యధిక చేతిబోర్లున్న జిల్లా మహబూబ్‌నగర్. ఇక్కడ పదేళ్ల కిందట 60-135 అడుగుల లోతులోనే నీరు పుష్కలంగా లభించేంది. ప్రస్తుతం 175 అడుగుల లోతు బోరులోనూ నీరు కనిపించడం కష్టం. నల్లగొండ జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పదేళ్ల కిందట 75-145 అడుగుల లోతు బోర్లలోనూ నీరు పుష్కలంగా ఉండేది. ప్రస్తుతం 225 అడుగుల లోతు బోరు వేసిన నీరు లభించే పరిస్థితి లేదు. రంగాడ్డిలో 95 అడుగు లోతు బోరులో నీరు లభించే పరిస్థితుల నుంచి ప్రస్తుతం 215 అడుగులకు పెరిగింది. కరీంనగర్ జిల్లాలో 120 అడుగుల నుంచి 220 అడుగులకు పెరిగింది. దీంతో భూమి పోరల్లో నీటి లభ్యత క్రమక్షికమంగా తగ్గి గ్రామాల్లో బోర్లు, బావులు నీళ్ళులేక వట్టిపోయి తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. వేసవికి ముందే గ్రామాల్లో నెలకొన్న ఈ సమస్యతో ప్రజలు రానున్న రోజుల్లో తలెత్తే పరిస్థితులను ఉహించుకొని ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో గ్రామాల్లో చెరువులు నీళ్ళులేక నోళ్లు తెరుస్తున్నాయి. నిజామాబాద్, చిత్తూరు, కడప జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. మరోవైపు గ్రామాల్లో ప్రజలకు తాగునీరు అందించే బోర్లనీరు ఫ్లోరిన్‌తో కలుషితమై తాగడానికి పనికిరాకుండా పోయాయి. గ్రామాల్లో తాగునీటిని అందించడానికి ఏర్పాటుచేసిన పథకాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. తాగునీటి పథకాల కోసం నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకులకు నీటిని సరఫరా చేసే పైప్‌లైన్ పనులు జిల్లాల్లో ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో కోట్లాది రూపాయల ఖర్చుచేసి నిర్మించిన ఈ ట్యాంకులు గ్రామాల్లో ఉత్సవ విగ్రహాలుగా దర్శనమిస్తున్నాయి. తరచూ గ్రామాల్లో తాగునీటి పథకాల పైప్‌లైన్‌లు పగిలి నీటి సరఫరా నిలిచిపోతుంది. గ్రామాల్లో కలుషిత తాగునీటి బారి నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం.. గ్రామాల్లో ఇప్పటివరకు ప్రజలకు తాగునీటి కోసం ఉపయోగపడిన చేతిబోర్ల మరమత్తులను నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా చేతిబోర్లన్నీ నిరుపయోగంగా మారాయి. మరోవైపు గ్రామాల్లో విద్యుత్ కొరత పెరిగింది. ఫలితంగా తాగునీటి పథకాలకు అవసరమైన విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా అవుతోంది.

ఖమ్మం జిల్లాలోని 32 మండలాలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని 15 గ్రామాల్లో తాగునీరులేక కలుషిత నీరే తాగుతున్నారు. నల్లగొండ జిల్లాలోని సగానికిపైగా మండలాల్లో ప్రజలు ఫ్లోరిన్ నీటినే వాడుతున్నారు. అంతేకాక గ్రామాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా చేయాలంటే తాగునీటి పథకాల నిర్వహణకు అవసరమైన విద్యుత్ చార్జీలు పంచాయతీలకు పెనుభారంగా మారాయి. బకాయిలను చెల్లించాలంటూ విద్యుత్ శాఖ ఇటీవల పంచాయతీలకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.529.36 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని తేల్చిచెప్పింది. దీంతో పంచాయతీలు ప్రజల నుంచి పన్నుల రూపంలో నిధులు వసూలు చేయాలని భావిస్తున్నాయి. కానీ స్థానిక ఎన్నికల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉందని వెనకడుగు వేస్తున్నాయి. రాష్ట్రంలో 21,06 గ్రామపంచాయతీలుండగా వీటిలో 1,247 మేజర్ పంచాయతీలు 360.15 కోట్లు, 20,559 మైనర్ పంచాయతీలు 169 కోట్లు బకాయి పడ్డాయి.

విచ్చలవిడి బోర్లతో దుష్పరిణామాలు: శివకేశవ్
విచ్చలవిడిగా బోర్లు వేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతుందని జియాలజిస్టు శివకేశవ్ హెచ్చరించారు. తెలంగాణలో పదిహేనేళ్ల కిందట 60 అడుగుల లోతులోనే నీరు పుష్కలంగా లభించేదని, వినియోగం పెరగడంతోపాటు అవగాహనా రాహిత్యంతో వేసే బోర్ల కారణంగా నీటిఎద్దడి ఏర్పడుతోందన్నారు. ఇప్పటివరకు తాను తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని భూగర్భ జలాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ జిల్లాలో కూడా గత 15 ఏళ్లుగా 60 అడుగుల లోతులో నీరుండే ప్రాంతాల్లో ఇప్పుడు 200 అడుగులకుపైగా లోతులో బోర్లు వేసినా నీరు లభించడం లేదని చెప్పారు.

No comments:

Post a Comment