అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, March 2, 2012

ఎరువుల సబ్సిడీకి కోత


న్యూఢిల్లీ   Fri, 2 Mar 2012, IST

33 శాతం తగ్గిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం 
రైతులపై ధరల పిడుగు


వ్యవసాయ ఖర్చులు పెరిగి, పంటకు ధర దక్కక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉండగా కేంద్ర మంత్రివర్గం ఎరువులపై సబ్సిడీకి కోత విధించింది. డై అమ్మోనియం ఫాస్ఫేట్‌ (డిఎపి), మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంఓపి) వంటి కీలక ఎరువులపై ప్రస్తుతం అందిస్తున్న సబ్సిడీల్లో 33 శాతం మేర కోత విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. డిఎపి, ఎంఓపి
ఎరువులపై ప్రస్తుతం అందిస్తున్న సబ్సిడీల్లో 33 శాతం మేర కోత విధించింది. 2012-13 ఆర్థిక సంవత్సరం నుండి అమలులోకి వచ్చే ఈ నిర్ణయం ద్వారా ఖజానాకు రు.10 వేల కోట్ల మేర మిగులుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎరువుల తయారీకి అవసరమైన పోషకాల ధరలు అంతర్జాతీయంగా 20 శాతం మేర తగ్గిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ పోషకాల్లో అధికభాగం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నవే. పోషకాల ధరల ఆధారంగా ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని అందచేస్తోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఫాస్ఫేట్‌, పొటాష్‌ ఎరువులపై 20 శాతానికి పైగా సబ్సిడీ కోతను విధిస్తున్నట్లు ప్రభుత్వం ఒక అధికార ప్రకటనలో వివరించింది. కొత్త రేట్ల ప్రకారం సబ్సిడీ నైట్రోజన్‌(ఎన్‌) రూ.27.15 నుండి రూ.24కు, ఫాస్పేట్‌ (పి) రూ. 32.33 నుండి 24కు, పొటాష్‌ (కె) రూ. 26.76 నుండి రూ. 21.80కు తగ్గించారు. 2012 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ డిఎపి, ఎంఒపిలపై సబ్సిడీ టన్నుకు రూ.14,350, రూ.14,440గా ఉండనుంది.

ప్రభుత్వ నిర్ణయం తమకు సంతృప్తికరంగానే వుందని ఫెర్టిలైజర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎఐ) డైరెక్టర్‌ జనరల్‌ సతీష్‌ చందర్‌ అన్నారు. సబ్సిడీ అన్నది ప్రభుత్వ ఇష్టానికి సంబంధించిందని, ఇప్పుడు సబ్సిడీలో కోత వల్ల ఎరువుల రిటైల్‌ ధరలో ఎటువంటి మార్పూ వుండబోదని ఆయన చెప్పడం విశేషం. ఇప్పటికే ఎరువుల ధరలు పెరిగి తీవ్ర ఇక్కట్ల పాలైన రైతులకు ప్రభుత్వ నిర్ణయం పిడుగుపాటే.

No comments:

Post a Comment