అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, March 1, 2012

పాతాళానికి ప్రాణ జలాలు!


అంతకంతకూ తరిగిపోతున్న భూగర్భ జలవనరులు 
85 శాతం బోర్లపై ప్రభావం 
అప్పుడే తాగునీటికి కటకట 
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
భూగర్భ జలాలు అంతకంతకూ తరిగిపోతుండటంతో తాగునీరు, సాగునీరుపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో 85 శాతం బోర్లలో వచ్చే నీళ్లు తగ్గడం, లేదా ఎండిపోవడం జరిగే పరిస్థితి ఏర్పడిందని భూగర్భ జల వనరులశాఖ
అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడే తాగునీటికి కటకట ఏర్పడింది. 'గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్‌)' దాదాపు 250 గ్రామాలకు తాగునీటి రవాణాను మొదలుపెట్టింది. కొన్ని జిల్లాల్లో గ్రామస్థులే సుదూర ప్రాంతాల నుంచి ట్యాంకర్లలో తాగునీరు తెప్పించుకుంటున్నారు.

సమస్యకు కరెంటు కోత తోడు 
వర్షాల ప్రభావంతో సాధారణంగా జూన్‌ నుంచి నవంబరు వరకు భూగర్భ జల మట్టం పెరుగుతుంది. తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇది ఏటా జరిగేదే. ఈసారి రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొనడం వల్ల భూగర్భ జలమట్టం ఎక్కువగా పెరగలేదు. అందుకే సెప్టెంబరు నుంచే భూగర్భ జలాలు తరిగిపోతూ వస్తున్నాయి. రాష్ట్రం మొత్తమ్మీద చూస్తే సరాసరిన ఇప్పటికే 10 మీటర్ల లోతులోకి వెళ్లినట్లు భూగర్భ జల వనరులశాఖ గుర్తించింది. మే నాటికి ఇవి మరింతగా క్షీణిస్తాయని భూగర్భ జల వనరులశాఖ అంచనా వేసింది. 2009 తర్వాత ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారి. నెల్లూరు, చిత్తూరు, కడప, నిజామబాద్‌, ఆదిలాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. తాగునీటితోపాటు సాగునీటి బోర్లలో వాటి సామర్థ్యం మేరకు నీరు రావడంలేదు. కొద్దిసేపు వచ్చి ఆగిపోతున్నాయి. కొన్ని బోర్లలో చుక్క కూడా రావడం లేదు. సమస్యకు కరెంట్‌ కోత తోడైంది. కరెంట్‌ లేకపోతే తాగేనీళ్లు రావు. మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు భూగర్భ జలాలను జాగ్రత్తగా వాడుకోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ఇకనైనా పక్కా ప్రణాళికతో సాగకపోతే మున్ముందు ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవు.

No comments:

Post a Comment