2031 వరకు ప్రణాళికబద్ధమైన పురోగతి
వ్యవసాయ, నివాస జోన్లకే పెద్దపీట
బృహత్ ప్రణాళికలో అనేక కీలక మార్పులు
రవాణా వ్యవస్థకు సమగ్ర రూపం
చర్చనీయాంశంగా మారిన 'మారటోరియం'
(ఈనాడు, హైదరాబాద్) January 26, 2013
నడవాలంటే ఒక దారి కావాలి. మరి అభివృద్ధికి.. ఒక వ్యూహం.. అంతకుమించిన ప్రణాళిక ఉంటేనే అది అర్థవంతమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంచనాలకు మించి దూసుకుపోతున్న పట్టణీకరణ దరిమిలా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ప్రాధాన్యం ఎంతో పెరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరం రోజురోజకీ శరవేగంగా విస్తరిస్తోంది. గణనీయమైన అభివృద్ధి సాధిస్తోంది. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి రూపొందించిన బృహత్ ప్రణాళిక-2031 ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల కసరత్తుతో రానున్న 20 ఏళ్లకు వేసిన ప్రణాళికలోని ప్రధాన అంశాలను ఓసారి పరిశీలిస్తే...
ఇక అయిదు ప్రణాళికలే
ఇప్పటివరకు రాజధాని, దాని చుట్టూ ఉన్న విస్తరించి ఉన్న ప్రాంతాలకు సంబంధించి ఏడు బృహత్ ప్రణాళికల రూపకల్పన జరిగింది. ఇవి నిర్ణీత సమయంలో పూర్తి కాకపోవడం, అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగలేదు. దీంతో పారిశ్రామిక, నివాసయోగ్యాలు మిళితమై నగరం గందరగోళంగా మారింది. ప్రకృతి, సహజ వనరుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా వచ్చిన హెచ్‌ఎండీఏ బృహత్ ప్రణాళికతో సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. నగరంపై భారం తగ్గడంతోపాటు చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలపై పట్టణీకరణ అవకాశం లభించనుంది. దీని అమలుతో గతంలో రూపొందించిన ప్రణాళికల సంఖ్య తగ్గనుంది. ఐదు ప్రణాళికలు మాత్రమే వాస్తవికంగా అమలులో ఉండనున్నాయి. సంగారెడ్డి, భువనగిరి మున్సిపాలిటీల ప్రణాళికలు తెరమరుగుకానున్నాయి. ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ పరిధిలో ఉండే గ్రోత్ కారిడార్‌కు తాజా ప్రణాళిక ప్రకారమే ఆధారం కానుంది.
నివాసానికి తొలి ప్రాధాన్యం
బృహత్ ప్రణాళిక ముసాయిదాలో నివాస యోగ్యాలకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ.. తుది ప్రణాళికలో అది ఇంకా పెరిగింది. 5,965 విస్తీర్ణంలో నివాస జోన్లకు తొలుత 12.88 శాతం(763.52 చదరపు కిలోమీటర్లు) కేటాయించారు. ఏడాదిన్నరపాటు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి అత్యధికంగా ఇదే అంశంపై వినతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా నివాస జోన్లకు పెద్దపీట వేసింది. ముసాయిదాలో కంటే 1.11 శాతాన్ని పెంచడంతో విస్తీర్ణం 835.10 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
* నివాసయోగ్య జోన్లలో మరో కీలకమార్పు జరిగింది. నాలుగు జిల్లాల్లోని ప్రాంతాల్లో ఇప్పటివరకు ఆకాశహర్మ్యాలు 15 మీటర్ల వరకు మాత్రమే పరిమితం కావాలనే నిబంధన ఉంది. ఇక నుంచి వాటి ఎత్తు 18 మీటర్లకు పెంచుకోవచ్చు.
* ముసాయిదా.. తుది ప్రణాళికకు పెరిగిన ప్రధాన నివాస ప్రాంతాల్లో పదకొండు చిన్న పట్టణాలున్నాయి. 83 చదరపు కిలోమీటర్ల మేరలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాలు... మన్నెగూడ, పోల్కంపల్లి, ఖానాపూర్, సుభాన్‌పూర్, తుమ్మలూరు, దయ్యాలతండ, లేమూరు, తంగడపల్లి, ధర్మవరం, విలపల్లి, మల్కాపూర్.
పెరిగిన వ్యవసాయ విస్తీర్ణం...
తుది ప్రణాళికలో చోటుచేసుకున్న పెద్ద మార్పులో వ్యవసాయ విస్తీర్ణం ప్రధానమైనది. మొత్తం విస్తీర్ణంలో తొలుత 39.2 శాతం వ్యవసాయ(కన్జర్వేషన్) జోన్‌గా గుర్తించారు. అంటే 2,338.20 చదరపు కిలోమీటర్లను దీనికి కేటాయించారు. దానిని ఏకంగా 9.3 శాతం పెంచడం విశేషం. ప్రస్తుతం 2,893.02 చదరపు కిలోమీటర్లతో ప్రణాళికలో వ్యవసాయానికి పెద్దపీట వేశారు. మెదక్ జిల్లాలోని ఎనిమిది మండలాల పరిధిలో తొలుత నిర్ణయించిన సహజ వారసత్వ ప్రాంతం(నేచురల్ హెరిటేజ్ జోన్)పై ఆయా ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీని నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో ఒక్కసారిగా వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది.
* వ్యవసాయ విస్తీర్ణానికి ప్రాధాన్యం ఇవ్వడంతో భవిష్యత్తులో నివాసయోగ్యానికి మార్గం సుగమమైనట్లే. గతంలో నగరానికి ఆనుకుని ఉన్న మున్సిపాలిటీల పరిధిలో అన్నీ వ్యవసాయ భూములే ఉండేవి. పట్టణీకరణ, స్థిరాస్తి వ్యాపారంలో జోరు పెరగడంతో అవి ప్లాట్లుగా మారాయి. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములను నివాసయోగ్య భూములుగా మార్చుకోవడం సులువైన ప్రక్రియే. నిర్ణీత మేర నాలా పన్ను చెల్లిస్తే అధికారికంగా భూ మార్పిడి జరుగుతుంది. పదేళ్ల కిందటితో పోలిస్తే నగరం చుట్టుపక్కల వ్యవసాయం గణనీయంగా తగ్గింది. అన్నీ ప్లాట్లుగా మారడంతో వ్యవసాయ కమతాలు లేకుండాపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కాకున్నా... రానున్న 20-30 ఏళ్లలో ఈ ప్రణాళిక పరిధిలో జరిగే అభివృద్ధికి అనుగుణంగా వ్యవసాయ విస్తీర్ణం తగ్గుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సమగ్ర రవాణాకు రూపం...
ప్రస్తుతం దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే నగర విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణంలో రహదారులు ఉన్నాయి. ఇతర నగరాల్లో 9 నుంచి 15 శాతం వరకు ఉంటే... ఇక్కడ మాత్రం కేవలం ఆరు శాతమే ఉన్నాయి. ఫలితంగా ట్రాఫిక్ నిత్య నరకంగా మారింది. బృహత్ ప్రణాళికతో మున్ముందు ఆ సమస్య లేకుండా పలు చర్యలు తీసుకున్నారు.
* గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 42 కిలోమీటర్ల మేర అంతర వలయ రహదారి(ఇన్నర్ రింగు రోడ్డు) ఉంది. దీని ద్వారా నగరంలోని ప్రధాన రహదారులపై కాస్త భారం తగ్గినట్లయింది.
* ఈ రహదారికి ఆవల... ఔటర్ రింగు రోడ్డుకు ఇవతల మధ్యంతర (ఇంటర్మీడియట్) రోడ్డు వ్యవస్థ ఉంది. దీనికి అనుసంధాన రోడ్లు లేకపోవడం, నగరం చుట్టూ విస్తరించకపోవడంతో పెద్దగా ఇది ప్రాచుర్యం పొందడంలేదు.
* ఔటర్ రింగు రోడ్డు 150 మీటర్ల వెడల్పుతో నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కొంతమేర పనులు పూర్తి కావాల్సి ఉంది. దీనికి అనుసంధానంగా ప్రణాళికలో రేడియల్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా నగరంపై భారం గణనీయంగా తగ్గుతుంది.
* ప్రణాళికలో రూపకల్పన చేసిన ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) 5,965 చదరపు కిలోమీటర్ల పరిధిలో పెరిగే ట్రాఫిక్ అవసరాలకు కేంద్ర బిందువుగా మారనుంది. దీనిని 90 మీటర్ల వెడల్పుతో 287 కిలోమీటర్ల మేర చేపట్టేందుకు ప్రణాళికలో పొందుపరిచారు.వాస్తవంగా దీనిని 150 మీటర్ల వెడల్పుతో చేపట్టాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ.. భూసేకరణలో ఇబ్బందులతో కుదించారు.
రహదారుల వ్యవస్థలో మార్పులు
రవాణా వ్యవస్థను మరో రూపంలో బలోపేతం చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందులో అనేక ప్రాంతాల్లో 30, 40, 60 మీటర్ల రహదారులను ప్రతిపాదించారు. తొలుత వీటి మార్గాలను పరిశీలిస్తే అధికారులు ఇష్టానుసారంగా రూపొందించారనే విమర్శలు వచ్చాయి. పలు గ్రామాల్లో ఏకంగా మధ్య నుంచే వెళ్లడంతో భారీఎత్తున నివాస ప్రాంతాలు కనుమరుగు కానున్నాయి. పల్లెలు రూపురేఖలు కోల్పోతాయనే ఆందోళన వ్యక్తమైంది. వ్యతిరేకతకు తలొగ్గిన అధికారులు ఆ మేరకు మార్పులు చేశారు. దీని ప్రకారం...
* ఆయా ప్రాంతాల్లో ప్రతిపాదిస్తున్న పెద్ద రహదారులు గ్రామ సరిహద్దు వరకే పరిమితమవుతాయి.
* ఆ తర్వాత గ్రామానికి ఒకవైపు నుంచి(బైపాస్) మళ్లిస్తారు.
* గ్రామాల్లో ఉండే తొమ్మిది మీటర్ల రహదారి యథావిధిగా ఉంటుంది. ఈ నిర్ణయంతో అనేక గ్రామాలకు ఊరట కలిగింది.
గోప్యంగా మైనింగ్ జాబితా
ప్రణాళికలో మరో కీలకమైన అంశం... మైనింగ్. వాస్తవంగా ఔటర్ రింగు రోడ్డుకు ఆవల... నాలుగు జిల్లాల పరిధిలో (5,965 చదరపు కిలోమీటర్ల పరిధిలో) భూమి లోపల వివిధ రకాల సహజ వనరులకు కొదవ లేదు. ఈ మేరకు ఏయే ప్రాంతాల్లో ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి? ఎంతమేర విస్తరించి ఉన్నాయి? ఈ జాబితాను మైనింగ్ శాఖ ముందుగానే హెచ్‌ఎండీఏకు సమర్పించింది. సాధారణంగానైతే ప్రణాళికా పటంలో వీటిని గుర్తించాల్సి ఉంటుంది. అదే జరిగితే.. ఆయా జోన్లలో ఇష్టానుసారంగా తవ్వకాలు జరుగుతాయి. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు పటంలో వాటిని చూపించలేదు. దీని ద్వారా ప్రభుత్వ అనుమతిలేనిదే ఏ ప్రాంతంలోనైనా తవ్వకాలు చేసేందుకు వీలుండదు.
భూ వినియోగ మార్పిడిపై మరిన్ని అభ్యంతరాలు
బృహత్ ప్రణాళిక ఈ నెల 30 నుంచి అమలులోకి రానుంది. ఇక నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా... ఇదే మార్గదర్శకంగా పని చేస్తుంది. అధికారులు గుర్తించిన ఆయా జోన్లకు సంబంధించి మార్పులు రావాలంటే సర్కారు గడప తొక్కాల్సిందే. ఎంతో కసరత్తు తర్వాత గుర్తించిన ఈ జోన్లలో నిర్దేశించిన అవసరాలకు భూమిని వినియోగించాల్సి ఉంది. అందుకే ప్రణాళిక అమలులోకి వచ్చినప్పట్నుంచి నిర్దేశిత అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగించాలంటే భూ వినియోగ మార్పిడి అనివార్యం. ఈ ప్రక్రియ అమలు మరుసటి రోజు నుంచే చేపట్టవచ్చా? అనే సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. వాస్తవంగా మారటోరియం (కొంత కాలం పాటు వినియోగ మార్పిడిపై నియంత్రణ) విధించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకైతే అలాంటిదేమీ లేదని హెచ్‌ఎండీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే భూ వినియోగ మార్పిడికి సంబంధించి ప్రతిపాదనలు కుప్పలుగా వచ్చిపడుతుండటం విశేషం.
భారీ టౌన్ షిప్పుల నిర్మాణం
ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ భవిష్యత్తులో రూపు రేఖలు మారిపోనున్నాయి. ప్రణాళిలో నివాస ప్రాంతాలకు పెద్దపీట వేయడంతో భారీ టౌన్ షిప్పులు రానున్నాయి. దాదాపు 46 చిన్న పట్టణాలు, మరో 13 అర్బన్ నోడ్‌లు రూపు దిద్దుకోనున్నాయి. నివాస జోన్లను మూడు కేటగిరీలుగా విభజించారు. జోన్-1లో భారీ భవంతలకు ఆకాశమే హద్దు. ఇక జోన్ 2, 3లో 13 నుంచి 18 మీటర్ల ఎత్తు వరకు భవనాలు నిర్మించుకునే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ పథకాలకు హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీని ద్వారా కొంతమంది గ్రూపుగా ఏర్పడి ఉమ్మడిగా భూములను అభివృద్ధి చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధి
ప్రస్తుతం నాలుగు జిల్లాలోని దాదాపు 850పైగా గ్రామాల పరిధిలోని 5,965 చదరపు కిలోమీటర్ల మేర విస్తరిత ప్రాంతానికి ఎలాంటి ప్రణాళిక లేదు. దీంతో అడ్డదిడ్డంగా నిర్మాణాలు వచ్చేవి. ఇకనుంచి ఆయా గ్రామాల్లో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి జరగనుంది. పరిశ్రమలు, వాణిజ్య, నివాస, బహుళ అవసరాల ప్రాంతాలను వేర్వేరుగా చూపడటంతో భవిష్యత్తులో అక్కడ మాత్రమే ఆయా నిర్మాణాలకు అనుమతి ఇస్తారు. నివాస ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఉండదు. అలాగే పారిశ్రామిక వాడల్లో నివాసాలకు అనుమతించరు. అయితే ఇప్పటి వరకు సంప్రదాయ బద్దమైన విధానానికి అలవాటు పడ్డ గ్రామీణులు ఈ మార్పులను ఏ మేరకు పాటిస్తారనేది సందేహమే.
మార్పు కావాలంటే జీవో రావాల్సిందే!
భూములను నిర్దేశిత అవసరాలకు కాకుండా ఇతర కార్యాకలాపాలకు వినియోగించాలంటే నేరుగా వీలుపడదు. భూ వినియోగ మార్పిడి చేయాలంటే హెచ్‌ఎండీఏ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి రుసుం చెల్లించాక విచారణ చేసి ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. ఇదంతా ఒక ప్రహసనమే. దీంతో ప్రజలపై ఆర్థికభారం పడే అవకాశం ఉంది.
గ్రామకంఠం పెరుగుదలతో కొంత వూరట
గ్రామ కంఠం పరిధి పెంపుతో సుమారు 840 గ్రామాల ప్రజలకు పెద్ద వూరటే. ముసాయిదా ప్రణాళికలో ఈ పరిధిని కేవలం వంత మీటర్లకే పరిమితం చేశారు. ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించే సమయంలో చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇళ్లు కట్టుకోవాలంటే ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టు పక్కల నివాస ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి ఉంటుంది. ఇది పల్లెల మనుగడపైనే ప్రభావం చూపే అవకాశం ఉండటంతో హెచ్‌ఎండీఏ పునరాలోచనలో పడింది. కొందరు కిలోమీటరు, అర కిలోమీటరు, 500 మీటర్ల వరకు పరిధిని పెంచాలని కోరినా... కేవలం 300 మీటర్లకు వరకు పెంచుతూ తుది ప్రణాళికలో నిర్ణయం తీసుకుంది. ఇది కొంతలో కొంత వూరటే.

No comments:
Post a Comment