అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, March 11, 2013

ఈఎస్‌ఐ ఉనికి ప్రశ్నార్థకం!



ఆసుపత్రి తరలింపునకు రంగం సిద్ధం
స్వాధీనానికి కార్పొరేషన్‌ ప్రయత్నం
వైద్య కళాశాలకు కేటాయించే యోచన
ఈనాడు- హైదరాబాద్‌, న్యూస్‌టుడే- సనత్‌నగర్‌
తరతరాలుగా లక్షలాది కార్మికులకు సేవలు అందిస్తున్న సతన్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రి ఉనికి ప్రశ్నార్థకంలో పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ వైద్యాలయాన్ని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ నుంచి లేఖ రావడం కలకలం రేపోతోంది. కార్పొరేషన్‌ నిర్ణయమే కీలకం కావడంతో ఆసుపత్రి తరలింపు ఖాయంగా కన్పిస్తోంది. ఈ విషయమై ఉద్యోగులు, కార్మికశాఖ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ ఆసుపత్రిని దాదాపు 30 ఎకరాల్లో 1968లో స్థాపించారు. ఇందులో ఇప్పటికే స్టాఫ్‌ క్వార్టర్స్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్‌ కళాశాల కోసం ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ 25 ఎకరాల వరకు స్వాధీనం చేసుకుంది. పోను మరో 5 ఎకరాల్లో 500 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తోంది. ప్రస్తుతం ఈ ఆసుపత్రి పరిధిలో 8.5 లక్షల మంది బీమాదారులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. రోజూ 1500-2000 మంది వరకు బయటి రోగులు (ఔట్‌ పేషంట్లు)గా వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 500 పడకలు ఎటూ చాలడం లేదు. కొన్నిసార్లు ఒక్కో పడకకు ఇద్దరు రోగులను కేటాయిస్తున్నారు. వైద్యాధికారులు, పారామెడికల్‌, నర్సింగ్‌ స్టాఫ్‌, ఇతర ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులతో కలిసి సుమారు 500 మంది వరకు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఒప్పంద, పోరుగు సేవల (కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌్‌ సిబ్బంది అదనం. ఇంత కీలకమైన ఆసుపత్రిని కార్పొరేషన్‌ స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతుండటం విమర్శలకు దారితీస్తోంది.
వైద్యకళాశాలకు కేటాయింపు...
ఈ ఆసుపత్రి ప్రాంగణంలో ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందట 140 పడకల సామర్థ్యంతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించిన సంగతి తెలిసిందే. వైద్య కళాశాల నిర్మాణం పనులను కూడా కార్పొరేషన్‌ చేపడుతోంది. వచ్చే సంవత్సరం అందుబాటులోకి రానున్న ఈ కళాశాల అవసరాల కోసం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని 500 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిని స్వాధీనం చేసుకునేందుకు కార్పొరేషన్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఇక్కడ అధికారులకు లేఖ రాశారు. ఆసుపత్రిని అప్పగించి వేరొక చోట ఏర్పాటు చేసుకునే విషయాన్ని పరిశీలించాలని ఆ లేఖలో కోరినట్లు సమాచారం. దీంతో ఈఎస్‌ఐ డైరెక్టర్‌, సూపరింటెండెంట్‌, ఇతర అధికారులు జీడిమెట్లలోని మూతపడిన హెచ్‌ఎంటీ కంపెనీ భవనాన్ని ప్రత్యామ్నాయంగా పరిశీలించి వచ్చినట్లు తెలుస్తోంది.
* తప్పని ఇబ్బందులు...
ఒకవేళ ఈఎస్‌ఐ ఆసుపత్రి తరలిస్తే... కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 500 పడకల ఆసుపత్రి నిర్వహించాలంటే 8-10 ఎకరాల స్థలంతో కూడిన భవన సముదాయాలు అవసరం. నగరంలో ఈ స్థాయి భవంతులు దొరకడం కష్టం. ఒకవేళ అందుబాటులో ఉన్న అద్దెలు, లీజుల పేరుతో ఈఎస్‌ఐ అనదంగా రూ.కోట్లలోనే భారం పడనుంది. ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా పరిశీలించిన పాత హెచ్‌ఎంటీ భవనం కూడా 500 పడకలకు చాలదని అధికారులే చెబుతున్నారు. నగరానికి దూరంగా ఉండటంతో రోగులతో పాటు ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగులు ఇతర సిబ్బందికి కష్టాలు తప్పవు.
* నిరసనల వెల్లువ...
ఈ విషయమై కార్మికులు, ఉద్యోగుల నుంచి నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆసుపత్రిని కార్పొరేషన్‌ స్వాధీనం చేసుకునే అంశాన్ని ఉద్యోగ సంఘాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి విస్తరణ పనుల్లో భాగంగా రూ.19 కోట్ల వ్యయంతో రెండు కొత్త బ్లాకులను నిర్మించారు. కావాలంటే ఈ భవనాలను స్వాధీనం చేసుకుని పాత ఆసుపత్రిని మాత్రం యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ ఆసుపత్రిని స్వాధీనం చేసుకొని ప్రత్యామ్నాయంగా మరోచోట ఏర్పాటు చేయక పోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు ఉద్యోగులందరినీ వేర్వేరు చోట్లకు బదిలీ చేయని తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయమై ఈఎస్‌ఐ రాష్ట్ర డైరెక్టర్‌ మల్లేశ్వరరావు స్పందిస్తూ ఆసుపత్రి స్థలం స్వాధీనం చేయాలని లేఖ రావడం వాస్తమేమన్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పార

No comments:

Post a Comment