నార్నియా',
'లైఫ్ ఆఫ్ పై' సినిమాల్లోని అద్భుతమైన గాఫిక్స్ వెనుక వందల
మంది యానిమేటర్ల శ్రమ ఉందన్నది తెలిసిందే! కానీ వారందరినీ ఒక్కతాటిపైకి
తెచ్చి, అద్భుతాలు ఆవిష్కరించడం వెనుక ఓ తెలుగమ్మాయి ఉంది. ఉత్తమ విజువల్
ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ సాధించిన 'లైఫ్ ఆఫ్ పై'కి గ్రాఫిక్స్ అందించిన
రిథమ్ అండ్ హ్యూస్ సంస్థ ఆసియా విభాగానికి విజయనగరానికి చెందిన వాణి
సరస్వతి వెలగం నేతృత్వం వహిస్తున్నారు.
'ఆస్కార్ సాధించినందుకు 'కంగ్రాట్స్' అంటూ మాట కలిపినప్పుడు చెప్పిన విశేషాలివి... మేం చూపించిన క్రియేటివిటీకి ఆస్కార్ గుర్తింపు లభించినందుకు నన్నూ, మా సిబ్బందినీ చాలామంది అభినందించారు. ఆ చప్పట్లలో, కేరింతల్లో నా బాల్యం గుర్తొచ్చింది. చిన్నప్పుడు విజయనగరంలో... తరవాత ముంబయి, చెన్నై, హైదరాబాద్‌లలో చదువుకొన్నా. కానీ ఎక్కడ ఉన్నా రామాయణ, మహాభారతాల్లోని హనుమంతుడూ, ఘటోత్కచుడు వంటి పాత్రల్ని చూసినప్పుడు చప్పట్లు కొట్టేదాన్ని. గాలిలోకి ఎగరడం, ఆకాశంలో యుద్ధం చేయడం చదివినా, టీవీలో చూసినా ఎంత గొప్పగా ఉంటాయని! మా నాన్న బ్యాంకు ఉద్యోగి. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఆయనకెంతో ఇష్టం. కృష్ణుడూ, హనుమంతుడు లాంటి పాత్రల్ని యానిమేషన్ రూపంలో ప్రపంచానికి చూపాలనుకునే వారు. అదే ఆలోచనతో ఉద్యోగం మానేసి పలు దేశాల్లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి అధ్యయనం చేశారు. నా మీదా, తమ్ముడి మీదా నాన్న ప్రభావం ఉంది. మేమూ యానిమేషన్ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకున్నాం. నేను డిగ్రీ, పీజీ దూరవిద్యలో చేరా. కాలేజీకి వెళ్లే వయసులో చెన్నైలోని ఒక స్టూడియోలో చేరి విజువల్ ఎఫెక్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించా. తమిళ సినిమాకు 'లోగో యానిమేషన్' నేను చేసిన మొదటి ప్రాజెక్టు. తరవాత ముంబయిలోని ఓ కంపెనీలో చేరా. అక్కడ ఉండగానే సుమారు ముప్ఫై బాలీవుడ్ సినిమాలకు గ్రాఫిక్స్ అందించా.
ఆర్నెల్ల కాంట్రాక్ట్‌తో...
పన్నెండేళ్ల క్రితం, ఎన్నో హాలీవుడ్ సినిమాలకు గ్రాఫిక్స్ అందించిన 'రిథమ్ అండ్ హ్యూస్'లో పనిచేసే అవకాశం వచ్చింది. సంస్థ యజమాని 'ఇండియాలో మా కార్యకలాపాలు ఆరంభించాలనుకుంటున్నాం, మీ ఆలోచనలు ఏంటి...' అనడిగారు. చిన్నగా మొదలుపెట్టి, ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ వెళితేనే మంచిదని చెప్పా. 'అలాగే చేద్దాం' అంటూ ఆర్నెల్ల కాంట్రాక్ట్ ఉద్యోగమిచ్చారు. ముంబయిలో, చిన్న అద్దె గదిలో కార్యాలయాన్ని ఏర్పాటుచేశాం. నెమ్మదిగా సినిమాలకూ, ఇతర ప్రాజెక్టులకూ పనిచేయడం మొదలుపెట్టాం. తరవాత సిబ్బంది పెరిగారు. హైదరాబాద్, మలేషియా, తైవాన్లలో కార్యాలయాలు తెరిచాం. ఆసియా వ్యవహారాలన్నీ నేను చూస్తున్నా. అమెరికాలో మా ప్రధాన కార్యాలయం ఉంది.
ఎన్నో ఆటుపోట్లు...
కంపెనీ కార్యకలాపాలు ఇండియాలో ప్రారంభించాక కూడా మొదట్లో మాకు పని అప్పజెప్పేవాళ్లు కాదు. హాలీవుడ్ డైరెక్టర్లు తమ కళ్ల ముందు పని జరగాలనుకుంటారు. ఇక్కడున్న మమ్మల్ని నమ్మాలని లేదుగా! మొదట చిన్న ప్రాజెక్టులను తీసుకున్నాం. వాటినే బాగా చేశాం. ఐదేళ్లు గడిచేసరికి, పెద్ద ప్రాజెక్టులిచ్చారు. 'నార్నియా'కు మేం చేసిన విజువల్ ఎఫెక్ట్స్ చూశాక, మనవాళ్ల ప్రతిభ ఏ స్థాయిదో అర్థం చేసుకున్నారు. దానిలో కనిపించే సింహం ఇక్కడే డిజైన్ చేశాం. దానికీ ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఈ రంగంలో అర నిమిషం విజువల్స్ కోసం కొన్ని నెలల పాటు కష్టపడతాం. బాగా రావచ్చు. మాకే నచ్చకపోవచ్చు. మళ్లీ మొదలుపెట్టి సంతృప్తి పడేదాకా ప్రయత్నించాలి. మేం అలాంటి ఓపికతో చాలా విజయాలు సాధించాం. కొన్నిసార్లు అతి తక్కువ సమయంలో క్రియేటివిటీ చూపించాల్సి ఉంటుంది. ఆ ఛాలెంజ్‌కీ సిద్ధంగా ఉంటాం. 'లైఫ్ ఆఫ్ పై' సినిమా ఆఖర్లో దీవిలో చిన్న చిన్న మీర్ క్యాట్లని పెద్ద సంఖ్యలో చూపించే సన్నివేశం ఉంది. నిజానికి అది అమెరికాలో చేయాల్సింది. కానీ చివరకు మాకు అప్పగించారు. మూడు నెలలు పట్టే పనిని నెలలో పూర్తి చేశాం. మీ పులి.. మీరూ పులే..
'లైఫ్ ఆఫ్ పై'లో 70 శాతం గ్రాఫిక్సే. పులి పాత్ర ఎంతో కీలకం. దాన్ని గ్రాఫిక్స్‌లో చేయాలి. దర్శకుడు ఆంగ్ లీ పులి గురించి మాకు వివరిస్తూ ''పులి మీ దేశానిదే. మీరు పులిలాంటి వాళ్లు. నిజమైన పులిలా గ్రాఫిక్స్ ఉండాలి'' అన్నారు. చాలా జూలకు వెళ్లి పులులను పరిశీలించి గ్రాఫిక్స్ తయారు చేశాం. మేం చేసిన పులిని చూశాక, మా పనితీరుకి ఆయన చాలా సంతోషపడ్డారు. 'ఇంత మంది సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టులు పూర్తి చేయడం ఎలా సాధ్యం...' అని కొందరు అడుగుతుంటారు. ప్రత్యేకంగా విజయ రహస్యం అంటూ ఏం లేదు. ఆఫీసులో చిన్నా, పెద్దా తేడా చూపకుండా పనిచేస్తాను. ప్రతిరోజూ వందశాతం కష్టపడి పని పూర్తి చేయాలనుకుంటా. ఏడాదిలో నెల రోజులు కూడా ఇండియాలో ఉండను. అయినా ఇక్కడి వ్యవహారాలన్నీ నేనుంటే ఎలా సాగుతాయో అలానే సాగుతాయి. దీనికి నమ్మకమే ప్రధాన కారణం. ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాను. ఆర్నెల్లకోసారి సరికొత్త సాంకేతికాంశాల మీద శిక్షణ తరగతులు ఉంటాయి. నేను మా ఉద్యోగులకు చెప్పేదొక్కటే, 'ఆత్మాభిమానంతో, ఆత్మవిశ్వాసంతో పని చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ విలువల్ని విడిచిపెట్టొద్దు.' యానిమేషన్ రంగంలో యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ మీద మమకారం ఉన్న వాళ్లకి సహకరించేందుకు అసిఫా (ఇంటర్నేషనల్ యానిమేటెడ్ ఫిలిం అసోసియేషన్) అనే సంస్థ ఉంది. దాని ఇండియా విభాగానికి నేను అధ్యక్షురాలిగా ఉన్నా. ఆసక్తి ఉన్నవాళ్లు మేం నిర్వహించే వర్క్‌షాప్‌లకి హాజరు కావచ్చు.

No comments:
Post a Comment