అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...
లెక్క తేలడంలేదు - దగ్గరపడుతున్న డిజిటైజేషన్ గడువు
నూరు శాతం
దాటిందంటున్న మంత్రిత్వ శాఖ
సగం కూడా
కాలేదంటున్న ఆపరేటర్లు
పొంతన లేని
గణాంకాలతో అంతా గజిబిజి
అందుబాటులో
లేని సెట్‌టాప్ బాక్సులు
1నుంచి టీవీ ప్రసారాలపై
అసందిగ్ధత
ఈనాడు -
హైదరాబాద్
సెట్‌టాప్
బాక్స్ లేకపోతే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర రాజధాని, విశాఖపట్నం సహా దేశంలోని 38
నగరాల్లో కేబుల్ ప్రసారాలు తిలకించలేరంటూ ప్రచారం హోరెత్తుతోంది. సెట్‌టాప్
బాక్సులు లేకపోతే ఈ నగరాల్లో టీవీ ప్రసారాలు చూడలేరని ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్
ఫెడరేషన్ స్పష్టం చేసింది. గడువు పొడిగిస్తారనే భావనతో సెట్‌టాప్
బాక్సుల కొనుగోలుపై ప్రజలు అంతగా ముందుకు రాలేదు. గడువు దగ్గర
పడుతుండటంతో కేబుల్ ఆపరేటర్లు విక్రయిస్తున్న బాక్సులను ఖాతాదారులు
కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ పరిధిలో
ఇప్పటికే ఇళ్లన్నిటికీ సెట్‌టాప్ బాక్సులు ఉన్నాయని కేంద్ర సమాచార, ప్రసార
శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇంకా 50 శాతం కనెక్షన్లు డిజిటైజేషన్
జరగాల్సి ఉందని మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్‌ఓ) చెబుతున్నారు.
విశాఖపట్నంలో ఎన్ని కనెక్షన్లు డిజిటైజేషన్ చేయాలో లెక్కలే లేవు. సెట్‌టాప్
బాక్సులను రూ.1200-1500 మేర విక్రయిస్తున్నారు. అయితే ప్రమాణాల ప్రకారం
ఇవి తయారవుతున్నాయా అనే విషయమై స్పష్టత ఇచ్చే యంత్రాంగమే లేదు.
బాక్సుల లభ్యతా తక్కువగానే ఉంది.
రాజధాని అవసరమే
మరో 11 లక్షలు- అందుబాటులో 3 లక్షల బాక్సులు: రాష్ట్ర ప్రధాన నగరాల్లోనే
కేబుల్ డిజిటైజేషన్ ఎంతవరకు పూర్తయింది, ఇంకా ఎంత జరగాల్సి ఉంది అనే
విషయమై అస్పష్టత నెలకొంది. హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ
పరిధిలో నమోదైన ఎంఎస్‌ఓలు పదుల సంఖ్యలో ఉన్నా, తమ పరిధిలో ఆపరేటర్లను
నియమించుకుని, కనెక్షన్లు ఇస్తున్నవారు 10 మంది ఉన్నారు. జంట నగరాల్లో
25 లక్షల వరకు టీవీలు ఉన్నాయన్నది వీరి అంచనా. ఇప్పటివరకు డీటీహెచ్
కనెక్షన్లు 5.5 లక్షలు ఉంటే, అందరు ఎంఎస్‌ఓల పరిధిలోని కేబుల్ వినియోగదార్లలో
సెట్‌టాప్ బాక్సులు తీసుకున్నవారు గరిష్ఠంగా 6.25 లక్షలు ఉంటారని సిటీ
కేబుల్ ఉన్నతాధికారి ఒకరు 'ఈనాడు'తో చెప్పారు. అంటే డిజిటల్ సిగ్నల్స్ అందుకునేందుకు
సిద్ధంగా ఉన్నవారు 11.75 లక్షల మందే. ఇంకా 13.25 లక్షల కనెక్షన్లకు సెట్‌టాప్
బాక్సులు అందించాల్సి ఉంది. వాస్తవానికి అందరు ఎంఎస్‌ఓల వద్ద కలిపి మరో 3 లక్షల
వరకు మాత్రమే సెట్‌టాప్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. విశాఖపట్నంలో
5.5 లక్షల నివాసాల్లో 8 లక్షల టీవీలుంటాయని అంచనా. ఇక్కడ నమోదైన ఎంఎస్‌ఓల్లో
ఇద్దరు మాత్రమే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఇక్కడ కేబుల్ కనెక్షన్లకు ఎన్ని సెట్‌టాప్ బాక్సులు అమర్చారో గణాంకాలు అందుబాటులో
లేవు. మరో రెండు, మూడు నెలలైనా గడువు పొడిగించకపోతే ఇన్ని లక్షల సెట్‌టాప్
బాక్సులను సమకూర్చడం సాధ్యం కాదని ఎంఎస్‌ఓలు స్పష్టం చేస్తున్నారు.
మూడు నెలల నుంచే ప్రభుత్వం హెచ్చరిస్తున్నా, ప్రజలు కొనుగోలు చేయనందునే
సెట్‌టాప్ బాక్సులు తగినన్ని సమకూర్చుకోలేదని పేర్కొంటున్నారు. వీటిని
విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉందని, భారీ పెట్టుబడులు పెట్టలేకే
కొనుగోళ్లకు అనుగుణంగా తెప్పిస్తున్నట్లు వివరించారు. గడువు పొడిగించరని
స్పష్టమైతే సెట్‌టాప్ బాక్సులను ధరలను ఆపరేటర్లు పెంచివేయవచ్చనే
ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రూ.1,799
కే డీటీహెచ్
నేరుగా ఇంటికే
టీవీ ప్రసారాలు అందించే డీటీహెచ్ సంస్థలు తమ విక్రయాలు పెంచుకునేందుకు
ప్రయత్నిస్తున్నాయి. ఈనెల 31 వరకు డీటీహెచ్ కనెక్షన్ రూ.1,799కే ఇచ్చేందుకు
డిష్ టీవీ, సన్ డైరెక్ట్, టాటా స్కై, ఎయిర్‌టెల్, డీ2హెచ్ (వీడియోకాన్),
బిగ్ టీవీ (రిలయన్స్) సిద్ధం అయ్యాయి. డిష్ టీవీ 1.50 లక్షల సెట్‌టాప్ బాక్సులను
సిద్ధంగా ఉంచిందని ఆ సంస్థ రీజినల్ మేనేజర్ వినోద్ తెలిపారు. మిగిలిన సంస్థలు
కూడా సరిపడా సెట్‌టాప్ బాక్సులు ఉన్నాయని పేర్కొంటున్నాయి.
పర్యవేక్షణాధికారి
ఏమంటున్నారంటే..
పార్లమెంటు
చట్టం మేరకు సమాచార, ప్రసార శాఖ కేబుల్ డిజిటైజేషన్ అమలు బాధ్యతను
పర్యవేక్షిస్తోంది. ఈ శాఖ పరిధిలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా
లిమిటెడ్ (బెసిల్) ఈ వ్యవహారాలను పరిశీలిస్తోంది. తమ వద్ద నెలరోజుల క్రితం
గణాంకాలు ఉన్నాయని బెసిల్ జనరల్ మేనేజరు ఆర్.నరసింహస్వామి 'ఈనాడు'తో
చెప్పారు. గత 2 వారాల్లో సెట్‌టాప్ బాక్సుల కొనుగోళ్లు పెరిగాయని చెప్పారు.
ఎంఎస్‌ఓలు ఇచ్చిన లెక్కలే ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వీటిపై అస్పష్టత ఉందని
అంగీకరించారు. డిజిటైజేషన్ ప్రక్రియ మాత్రం ఏప్రిల్ 1 నుంచి అమలవుతుందనే
పేర్కొన్నారు.
No comments:
Post a Comment