నగరం చుట్టూ ప్రణాళికాబద్ధంగా..
అడ్డదిడ్డ కట్టడాలకు చెల్లుచీటీ
సహజ వారసత్వ ప్రాంతం నుంచి వూరట
300 మీటర్ల వరకూ గ్రామ కంఠ పరిధి
బృహత్తర ప్రణాళికపై ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
ఈనాడు - హైదరాబాద్ Friday, January 25, 2013
హైదరాబాద్ మహానగరాభివృద్ధి బృహత్తర ప్రణాళికకు ఎట్టకేలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ముసాయిదాను విడుదల చేసిన దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రణాళికను అమల్లోకి తెస్తూ గురువారం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ముసాయిదాలో స్వల్ప మార్పులు చేర్పులు చేసింది. వచ్చే 20 ఏళ్లలో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి అంతా ఈ ప్రణాళికను అనుసరించే జరగనుంది. 2031 వరకూ హైదరాబాద్ చుట్టూ 5 జిల్లాల్లోని 35 మండలాలు... 849 గ్రామాలు... 5,965 చదరపు కిలోమీటర్ల విస్తరిత ప్రాంతం కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించింది.
ప్రణాళికలో ప్రధాన అంశాలు
* బృహత్తర ప్రణాళిక పరిధి 5,965 చదరపు కిలోమీటర్లు.
* మొత్తం మండలాలు 35. మెదక్‌లోని 10, రంగారెడ్డిలోని 22, మహబూబ్‌నగర్‌లోని 2, నల్గొండలోని 5 మండలాలు ఇందులో ఉన్నాయి. భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో ఈ ప్రణాళికను అనుసరించి హెచ్‌ఎండీఏ అనుమతులు మంజూరు చేస్తుంది.
* వరంగల్ రహదారిలో భువనగిరి, విజయవాడ దారిలో యాచారం, శ్రీశైలం మార్గంలో కందుకూరు, బెంగుళూరు వైపు షాద్‌నగర్, వికారాబాద్ మార్గంలో ఆలూరు, ముంబయివైపు సంగారెడ్డి ప్రధాన సరిహద్దు పట్టణాలుగా గుర్తించారు.
* మెదక్ జిల్లా మనోహరాబాద్, ఏదుల నాగులపల్లి వద్ద ప్యాసింజర్ టెర్మినళ్లు, రంగారెడ్డి జిల్లా రావులపల్లిలో రవాణా టెర్మినల్, మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాపూర్, నల్గొండ జిల్లా భువనగిరి వద్ద ప్యాసింజర్, రవాణా టెర్మినళ్లకు ప్రణాళికలో చోటు దక్కింది.
* ప్రస్తుతం ఉన్న రహదారులను అభివృద్ధిచేయడంతోపాటు 90 మీటర్ల వెడల్పుతో నగరం చుట్టూ 290 కిలోమీటర్ల పొడవుతో ప్రాంతీయ రింగురోడ్డును ప్రతిపాదించారు.
* రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 12చోట్ల లాజిస్టిక్ హబ్‌లు రానున్నాయి.
* పరిశ్రమల కాలుష్యం నుంచి నగర వాసులకు వూరట లభించనుంది. ఔటర్ అవతల పరిశ్రమలకు బృహత్తర ప్రణాళికలో ప్రత్యేక జోన్ కేటాయించారు. రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, బీబీనగర్, భువనగిరి, తూప్రాన్, వర్గల్, చౌటుప్పల్, పటాన్‌చెరు, సంగారెడ్డి తదితర మండలాల్లో 40పైగా గ్రామాల్లో దాదాపు 209 చదరపు కిలోమీటర్ల మేర కేటాయించారు.
* భవిష్యత్తులో నగరం చుట్టూ పెద్ద భవంతులు రానున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని 46 ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు చేపట్టే విధంగా మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేశారు.
* ఇప్పటి వరకూ పంచాయతీ అనుమతితో చిన్న లేఅవుట్లు వేసేవారు. ఇక నుంచి వీటికి కాలం చెల్లినట్లే. కనీసం 4 హెక్టార్లు ఉంటే తప్ప లేఅవుట్ వేసేందుకు అనుమతులు లేవు. ఇందులో 10 శాతం కచ్చితంగా సామాజిక అవసరాలకు కేటాయించాల్సి ఉంటుంది.
ముసాయిదాలో మార్పులు
* తొలుత మెదక్ జిల్లాలోని 8 మండలాల పరిధిలో 325 చదరపు కిలోమీటర్ల పరిధిలో సహజ వారసత్వ ప్రాంతం (నేచురల్ హెరిటేజ్ జోన్) ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనివల్ల దాదాపు 150 గ్రామాల్లో అభివృద్ధి ప్రశ్నార్థకం అవుతుందని స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో వాస్తవ ప్రణాళికలో ఎత్తివేశారు. దానిని కేవలం రక్షిత (వ్యవసాయం) ప్రాంతంగానే గుర్తించారు.
* ముసాయిదాలో గ్రామ కంఠం పరిధిని 100 మీటర్లకే పరిమితం చేయడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ పరిధిని 300 మీటర్లకు పెంచారు.
నివాస ప్రాంతం పెంపు
* ముసాయిదాలో నివాస ప్రాంతం 12.88 శాతం ఉండగా.... దానిని 14 శాతానికి పెంచారు.
* పారిశ్రామిక ప్రాంతం కోసం తొలుత కేవలం 1.7 శాతం కేటాయించగా... దానిని 3.5 శాతానికి పెంచారు.
* ప్రస్తుతం వ్యవసాయానికి 39.2 శాతం ఉండగా... తాజాగా అది 48.5 శాతానికి పెరిగింది.

No comments:
Post a Comment