'లైఫ్ ఆఫ్ పై' ఆస్కార్‌లో భాగ్యనగరానికి భాగస్వామ్యం
ఈనాడు ప్రత్యేక విభాగం
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటిని పాత్రలుగా తీర్చిదిద్దడంలో మన కుర్రకారు మంచి సమర్థులు కూడా. రాముడు, కృష్ణుడు వంటి క్యారెక్టర్లు.. కథలు మన దగ్గర చాలానే ఉన్నాయి. వీటికి కాస్త మార్పులుచేస్తే ప్రంపచ దృష్టిని సైతం ఆకర్షించగలుగుతాం అంటున్నారు నిపుణులు. ఆసక్తికర విషయం ఏంటంటే 'లైఫ్ ఆఫ్ పై' గత మార్చిలోనే పూర్తికావాల్సి ఉంది. అయితే యానిమేషన్ వర్క్ చాలా ఎక్కువగా ఉండటంతో అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తయ్యేలా కనిపించలేదు. దీంతో మరోమాట లేకుండా నేరుగా షూట్ చేసిన క్లిప్పింగులను యానిమేషన్ కోసం హైదరాబాద్‌కు పంపేశారు. ఒక్క రోజు పట్టే సమస్యను ఒక్క గంటలో పరిష్కరించగల నైపుణ్యం ఉండటం వల్లే మనకు అంతర్జాతీయంగా అంత పేరొచ్చిందని ఆయన వివరించారు. అమెరికన్లతో పోల్చితే మన కుర్రకారుకే సృజనాత్మకత ఎక్కువన్నది నిపుణుల అభిప్రాయం. యానిమేషన్ కంపెనీలు, శిక్షణ సంస్థలు, నిపుణులు, విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో ఈ రంగానికి హైదరాబాద్ ఇప్పుడో చిరునామాగా మారుతోంది.
యానిమేటర్ కావాలంటే?: యానిమేషన్ అనగానే కంప్యూటర్లు, గ్రాఫిక్స్‌తో ఆడుకునే నేర్పుండాలనుకుంటారు చాలామంది. ఇది కేవలం అపోహ. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం తెలియని పేపరుపై బొమ్మలేసే కళాకారులూ ఇక్కడ కీలకమే. ఈగ లాంటి క్యారెక్టర్‌ను, అవతార్ లాంటి ఊహాత్మక పాత్రను తెరపైకి తేవాలంటే ముందుగా బొమ్మ గీయాల్సిందే. కాగితంపై చేసిన పనిని డిజిటలైజ్ చేసిన తర్వాతే వాటికి నిజ జీవిత కదలికలను అన్వయిస్తారు. ఇందుకోసం 2డి, 3డి విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్‌ఎక్స్)ను వాడతారు. వీటిని నేర్చుకోడానికి పెద్ద చదువులేం అక్కర్లేదు. సృజనాత్మకంగా ఆలోచించడం, రంగులు, డిజైన్లు, పాత్రల కదలికలపై ఓ మోస్తరు అవగాహన ఉంటే చాలు. ఇంటర్మీడియట్ చదివినవారు కూడా దూసుకుపోవచ్చంటున్నారు అరీనాకు చెందిన శిక్షకుడు శ్రీకాంత్.
-
కిరణ్, సీనియర్ యానిమేటర్
|
No comments:
Post a Comment