అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, March 1, 2013

వేసవి రాకమునుపే కోత!




నేటి నుంచి అధికారికంగా రెండు గంటల కరెంటు కోతలు
ఈనాడు, హైదరాబాద్‌
వేసవి రాకమునుపే నగరంలో విద్యుత్తు కోతలు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి గ్రేటర్‌ పరిధిలోని రెండు గంటల పాటు గృహ వినియోగదారులకు కరెంటు సరఫరా అధికారికంగా నిలిపివేయనున్నారు. విద్యుత్తు డిమాండ్‌ పెరగడంతో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య రెండు విడతలుగా గంటపాటు సరఫరా నిలిపివేయనున్నారు. 50-70 మి.యూ. కొరత ఏర్పడిందని, అందుకే కోతలు అమలు చేస్తున్నట్లు సీపీడీసీఎల్‌ సీఎండీ అనిల్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రోజోన్‌ పరిధిలోని మూడు సర్కిళ్లలో సబ్‌స్టేషన్ల వారీగా ఐదు విభాగాలుగా కోతల షెడ్యూల్డ్‌ను అధికారులు రూపొందించారు.  గ్రూప్‌-ఏ: ఉదయం 6- 7 గంటల వరకు; 11- 12 గంటల వరకు
ఏసీగార్డ్స్‌, అత్తాపూర్‌, సీఆర్‌ఫీఎఫ్‌, తారామతి బారాదరి, దుర్గానగర్‌, ఎగ్జిబిషన్‌, గోల్కొండ, గురునానక్‌, హకీంపేట్‌, హుస్సేన్‌సాగర్‌, ఇందిరాపార్కు, ఆర్‌.పి.నిలయం, ఆసిఫ్‌నగర్‌, లేక్‌వ్యూ, లంగర్‌హౌస్‌, మచ్చబొల్లారం, మాదాపూర్‌, మైత్రీవనం, ఎల్లారెడ్డిగూడ, కల్యాణ్‌నగర్‌
గ్రూప్‌-బి: ఉదయం 7- 8 గంటల వరకు; 12 నుంచి 1 గంట వరకు
అంబర్‌పేట, భూదేవినగర్‌, బోయిన్‌పల్లి, చిన్నతోకుంట, క్లాక్‌టవర్‌, ఈఎన్‌టీ ఆసుపత్రి, ఫలక్‌నుమా, గోషామహల్‌, హెచ్‌ఏఎల్‌, హైదర్‌గూడ, ఐడీపీఎల్‌, ఐఐసీటీ, ఇండస్ట్రీయల్‌ ఏరియా, జేమ్స్‌ స్ట్రీట్‌, ఉస్మానియా ఆసుపత్రి, మీరాలం, యాకుత్‌పురా, మోండామార్కెట్‌
గ్రూప్‌-సి: ఉదయం 8 నుంచి 9 వరకు; మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు
అడ్డగుట్ట, నెహ్రూనగర్‌, ఏయిర్‌పోర్ట్‌, అల్విన్‌, కందికల్‌గేట్‌, రోడ్‌నెంబర్‌-2, అయ్యప్ప సొసైటీ, బన్సీలాల్‌పేట, బేగంపేట, చంచల్‌గూడ, చిలకలగూడ, ఈఎస్‌ఐ, ఫీవర్‌హాస్పిటల్‌, ఫిల్మ్‌నగర్‌, గ్రీన్‌ల్యాండ్స్‌, సంజీవయ్యపార్క్‌, సంతోష్‌నగర్‌, పేట్లబురుజు, పంజీష, సరోజినిదేవి హాస్పిటల్‌
గ్రూప్‌-డి: ఉదయం 9 నుంచి 10; మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు
కంచన్‌బాగ్‌, కార్వాన్‌, కిల్వత్‌, కిమ్స్‌, లాలాగూడ, లుంబినీపార్క్‌, ఎల్‌వీప్రసాద్‌మార్గ్‌, మలక్‌పేట గంజ్‌, ఎంఎల్‌ఏ కాలనీ, మోతీమహాల్‌, మూసారాంబాగ్‌, నారాయణగూడ, నిమ్స్‌, ప్రాగటూల్స్‌, ప్రశాంతినగర్‌, పబ్లిక్‌గార్డెన్‌, రోడ్‌నెంబరు-22, సుల్తాన్‌బజార్‌, విఠల్‌వాడీ, సలార్‌జంగ్‌, టోలిచౌకి.
గ్రూప్‌-ఇ: ఉదయం 10 -11 వరకు: మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు
గుడిమల్కాపూర్‌, జింఖానా, హెచ్‌ఎంటీ, బతుకమ్మకుంట, సీతారాంబాగ్‌, జవహార్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, కుందన్‌బాగ్‌, మలక్‌పేట, మారేడ్‌పల్లి, అస్మాన్‌ఘడ్‌, నాంపల్లి, మోతీనగర్‌, పాటిగడ్డ, సీతాఫల్‌మండి, శ్రీనగర్‌కాలనీ, రోడ్‌నెంబరు-12
రంగారెడ్డి జిల్లా పరిధిలో...
ఆర్‌ఆర్‌ జోన్‌ పరిధిలో మూడు సర్కిళ్లలోని సబ్‌స్టేషన్లను రెండు గ్రూపులుగా విభజించి కోతలను అమలు చేయనున్నారు.
** ఆర్‌ఆర్‌ సౌత్‌ సర్కిల్‌: ఉదయం 6 - 7 గంటల వరకు; 11 గంటల నుంచి 12 గంటల వరకు
శంషాబాద్‌, తుర్కయంజాల్‌, ఉప్పల్‌పల్లి, మేడిపల్లి, ఎన్‌ఐఆర్‌డీ, మామిడిపల్లి, ఎన్‌పీఏ, అప్పా, ఇబ్రహీంబాగ్‌, నందనవనం, సీబీఐటీ, చంపాపేట, లెనీన్‌నగర్‌, వనస్థలిపురం, పుప్పాల్‌గూడ, తాండూర్‌, వికారాబాద్‌
** ఆర్‌ఆర్‌ ఈస్ట్‌ గ్రూప్‌-1: ఉదయం 7 - 8 గంటల వరకు; మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల వరకు
ఉప్పల్‌, రామంతాపూర్‌, స్ట్రీట్‌నెంబరు-8, ఐడీఏ ఉప్పల్‌, నాచారం, ఎన్‌జీఆర్‌ఐ, మల్లాపూర్‌, కొత్తపేట్‌, మోహన్‌నగర్‌, మారుతీనగర్‌, బండ్లగూడ, అటోనగర్‌, హయత్‌నగర్‌, రాజీవ్‌ స్వగృహ, తట్టిమైలారం
** ఆర్‌ఆర్‌ ఈస్ట్‌ గ్రూప్‌-2: ఉదయం 9 నుంచి 10 వరకు; మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు
మౌలాలి, వాజ్‌పేయినగర్‌, వినాయక్‌నగర్‌, మల్కాజిగిరి, అనంద్‌బాగ్‌, సైనిక్‌పురి, కుషాయిగూడ, చర్లపల్లి-1, సాకేత్‌, యాప్రాల్‌
** ఆర్‌ఆర్‌ నార్త్‌ గ్రూప్‌-1: ఉదయం 8 నుంచి 9 వరకు; మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు
కొంపల్లి, సుభాష్‌నగర్‌, ఉషాముల్లపూడి, జగద్గిరిగుట్ట, విజయనగర్‌కాలనీ, బాచుపల్లి, డీపీపల్లి, సురారం, జీడిమెట్ల, ఎలీప్‌, ఆర్‌జీకే సురారం, మయూరీనగర్‌, మదీనాగూడ
** ఆర్‌ఆర్‌ నార్త్‌ గ్రూప్‌-2: ఉదయం 10 నుంచి 11 వరకు; మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు
బాలాజీనగర్‌, కెపీహెచ్‌బీ, ఐజేఎం, చందానగర్‌, పాపిరెడ్డి కాలనీ, గచ్చిబౌలి, ఐఐఐటీ, నానక్‌రాంగూడ, ఈఎస్‌సీఐ, ఎల్‌అండ్‌టీ, సెజ్‌, కొత్తగూడ, అయ్యప్పసొసైటీ

No comments:

Post a Comment