అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, February 17, 2012

రాష్ట్ర బడ్జెట్ రూ.1,45, 854 కోట్లు

హైదరాబాద్ : ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి 1,45,854 కోట్లతో 2012-13 సంవత్సరపు వార్షిక బడ్జెట్ ను శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటును రూ. 20,008 కోట్లుగా, రెవెన్యూ మిగులును రూ. 4,444 కోట్ల అంచనాగా చూపించారు. జాతీయ సగటు కన్నా రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2005-11లో రాష్ట్ర వృద్ధిరేటు 9.26 శాతంగా నమోదు అయిందని, దేశ వృద్ధిరేటు 8.5గా
మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.


రూ. 1,45,854 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌
రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు9.26 శాతం
ప్రణాళిక వ్యయం రూ. 54,030 కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ. 91,824 కోట్లు
ద్రవ్యలోటు రూ. 20008 కోట్లు

 రాష్ట్ర విధానసభలో ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి 2012-13 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ముఖ్యాంశాలు :

జాతీయ వార్షిక వృద్దిరేటకన్నా రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా ఉంది
కేంద్రంనుంచి కరువు సాయంగా రూన 3500 కోట్లను కోరినట్టు మంత్రి తెలిపారు.
జాతీయవిపత్తు పద్దు కింద రూ. 246 కోట్లనిధులు రానున్నాయి.
ఆదాయవనరుల సమీకరణ పెంపు
రూపాయికే కిలో బియ్యం
యువతకు ప్రైవేటు రంగంలో 15 లక్షల ఉద్యోగాలు
లక్షమందికి ప్రభుత్వ ఉద్యోగాలు
రైతులకు స్వయంసహాయకబృందాలకు రూ. 1075 కోట్ల వడ్డీలేని రుణాలు
రాజీవ్‌విద్యామిషన్‌లో 2014 నాటికి 15 లక్షల ఉద్యోగాలు
10 లక్షల స్వయంసహాయ బృందాలకు వ్యవసాయ రుణాలు
రూ. 1లక్ష పైబడిన వ్యవసాయరుణాలకు పావలా వడ్డీ
ఇందిర జలప్రభ పథకం కింద లక్షబోరుబావుల తవ్వకం
రెండు రచ్చబండ కార్యక్రమాల్లో 50 లక్షలమందికి లబ్ది
తీరప్రాంత జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 25 కోట్లు
గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక పథకం
గ్రామీణాభివృద్దికి రూ. 600 కోట్ల నిధులు
పంచాయతీరాజ్‌కు రూ. 200 కోట్ల నిధులు
చిన్ననీటిపారుదలశాఖు రూ. 300 కోట్ల నిధులు
రోడ్లు , భవనాలకు రూ. 100 కోట్లు
రైతాంగ వ్యవస్థాగత రక్షణకు చర్యలు
నూనెగింజల దిగుబడి 26 శాతం తగ్గింది.
సకాలంలో చెల్లించే రుణాలు చెల్లించే రైతులకు లక్షవరకు రుణాలపై వడ్డీ మాఫీ
2012-13లో వ్యవసాయరంగానికి రూ. 2572 కోట్ల నిధుల కేటాయింపు
పౌరసరఫరా శాఖకు రూ. 3175 కోట్లు
మాంసం,గుడ్ల ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రానికి రెండోస్థానం
పాలమిషన్‌ కింద మొత్తం రూ. 100కోట్లు
పశువుల వ్యాధి నిరోధకానికి రూ. 50 కోట్లు
పేదరైతులకు పశువుల కొనుగోలుకు సగం సబ్సిడీ
పేదరైతులకు 42 వేల పశువులు అందజేయనున్న ప్రభుత్వం
సముద్ర ఉత్పత్తుల్లో 40 శాతం రాష్ట్రంనుంచే ఉత్పత్తి అవుతోంది.
మత్స్యకారులకు బీమా పథకం కింద రూ. 234 కోట్ల కేటాయింపు
గ్రామీణ ఉపాధికి రూ 188కోట్లు
రాజీవ్‌ యువకిరణాలు పథకం ద్వారా ఉపాధికల్పన
ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 104232మందికి ఉద్యోగాలు
స్వయంసహాయకబృందాలకు రుణాల కోసం స్త్రీనిధి ద్వారా నిధులు
1146 స్త్రీశక్తి భవనాలకు ఒక్కోదానికి రూ. 25 లక్షల చొప్పున కేటాయింపు
వ్యవసాయ రుణాలు రూ. 51020 కోట్లు
2012- 13లో గ్రామీణాభివృద్ధికి రూ. 4703 కోట్లు
జాతీయ ఉపాధి మిషన్‌, ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రానిదే అగ్రస్థానం
ఇంధనం, విద్యుత్‌శాఖకు రూ. 5937 కోట్ల కేటాయింపు
రవాణా, రోడ్లు భవనాలు - రూ. 5032 కోట్లు
పట్టణాభివృద్ధి - రూ. 6586 కోట్లు
సాంఘికసంక్షేమశాఖ - రూ. 2677 కోట్లు
గిరిజన సంక్షేమం రూ. 1540 కోట్లు
బీసీ సంక్షేమం - రూ. 3014 కోట్లు
మహిళా సంక్షేమశాఖ- రూ. 2283 కోట్లు
వికలాంగుల సంక్షేమం - రూ. 66 కోట్లు
మైనార్టీ సంక్షేమం - రూ. 489 కోట్లు
పాఠశాల విద్య - రూ. 15510 కోట్లు
సాంకేతిక విద్య - రూ. 1087 కోట్లు
ఉన్నత విద్య - రూ. 1841 కోట్లు
గృహ నిర్మాణం - రూ. 2302 కోట్లు
కార్మిక ఉపాధిశాఖ - రూ. 500 కోట్లు
సాధారణ పరిపాలన శాఖ - రూ. 88 కోట్లు
మత్స్యశాఖ- రూ. 234 కోట్లు
ఐటీశాఖ - రూ. 151 కోట్లు
నీటి పారుదలశాఖ - రూ. 15010 కోట్లు
పరిశ్రమలు - రూ. 633 కోట్లు
హోంశాఖ - రూ 4832 కోట్లు
వైద్య,ఆరోగ్య, కుటుంబసంక్షేమం - రూ. 5889 కోట్లు
పర్యాటక, సాంస్కృతిక శాఖ, క్రీడలు - రూ. 280 కోట్లు

No comments:

Post a Comment