- ఈ ఏడాది ఇప్పటివరకు 30 మంది మృతి
- మూడురోజుల్లో నాలుగు ప్రాణాలు బలి
- మొద్దునిద్ర వీడని సర్కారు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సోమవారం ఉదయం.. ముత్తంగి వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపైకి వస్తున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఓఆర్‌ఆర్‌లోనే పని చేసే పద్మనాభరెడ్డి (30) దుర్మరణం చెందగా, చంద్రకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు.
మంగళవారం రాత్రి 9.45 గంటలు.. శామీర్‌పేట వద్ద ఔటర్‌పై కారు బోల్తా కొట్టింది. మాజీ మంత్రి పులి వీరన్న కుమారుడు ప్రవీణ్ తేజ (36) మృతి చెందారు.
బుధవారం తెల్లవారుజాము 3 గంటలు.. తొండుపల్లి ఔటర్ జంక్షన్‌లో రోడ్డుపై ఆగి ఉన్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్ సురేందర్‌రెడ్డి (38), క్లీనర్ కేతావత్ చుక్యా (28) మృత్యువాత పడ్డారు. ఇవి నలుగురి ప్రాణాలు తీసిన మూడు ప్రమాదాలు. గత జనవరి నుంచి ఇప్పటివరకు ఔటర్‌పై 23 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 30 మంది దుర్మరణం చెందారు. 39 మంది క్షతగాత్రులయ్యారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర వీడట్లేదు. కేవలం రూ.4 కోట్లు వెచ్చిస్తే చాలావరకు ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు! ఫలితంగా సగటున నెలకు నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
అనేకమంది గాయాలపాలవుతున్నారు. వాస్తవానికి ఔటర్ రింగ్‌రోడ్డు ఇంకా పూర్తే కాలేదు.. పూర్తయిన మేరకు అధికారికంగా ప్రారంభించనే లేదు.. చాలాచోట్ల సర్వీసు రోడ్లు నిర్మించలేదు. ఎక్కడా ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయలేదు.. రెస్క్యూ టీంలు, మొబైల్ అంబులెన్స్‌లు సిద్ధం కాలేదు.. సైన్‌బోర్డులు, రేడియం సిగ్నల్స్ లేనేలేవు.. పెట్రోలింగ్ ఊసు అసలే లేదు... అయినా వాహనాలు అతివేగంగా దూసుకుపోతూనే ఉన్నాయి. ప్రమాదాల బారిన పడుతున్నాయి. ప్రస్తుతానికి సిద్ధమైన ఓఆర్‌ఆర్ మార్గంలో 12 కూడళ్లు మృత్యు కేంద్రాలుగా మారాయి. కేవలం రూ.4 కోట్లు వెచ్చిస్తే ఈ ప్రమాదాలను సగానికి సగం నివారించవచ్చని సైబరాబాద్ పోలీసులు గత డిసెంబర్‌లో ఔటర్‌పై అధ్యయనం చేసి మరీ చెప్పారు.
అప్పుడే ఎందుకు అనుమతిస్తున్నారు?: మౌలిక వసతుల లేమితోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీ సులు గుర్తించారు. పోలీస్ అవుట్ పోస్టు భవనాలు, ఇం టర్సెప్ట్ వాహనాలు తదితర వాటితో వీటిని అధిగమించవచ్చని నిర్ణయించారు. అందుకుగాను రూ.4 కోట్ల నిధు లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి వెచ్చిస్తున్న సుమారు రూ.7 వేల కోట్లతో పోల్చుకుంటే ఇదేమంత భారీ వ్యయం కాదు. కానీ టోల్‌గేట్ల ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్న సర్కారు ప్రయాణికుల ప్రాణాలు కాపాడటంపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ నిధులు ఎప్పు డో కేటాయించి భద్రతా ఏర్పాట్లు చేసి ఉంటే అన్ని ప్రమాదాలు జరిగేవి కాదు.. ఇన్ని ప్రాణాలు పోయేవి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు మౌలిక వసతుల్లేని విశాలమైన రహదారిపై ప్రయాణానికి అనుమతించడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తయిన ఔటర్‌పై ఎక్కడా వాహనాలను నియంత్రించే వ్యవస్థ కనిపించదు. రోడ్డు నిర్వహణ మచ్చుకైనా లేదు. ఎక్కడ వాహనాలు నిలిచి ఉంటాయో తెలియదు.. ఎక్కడెక్కడ రాళ్ల కుప్పలు అకస్మాత్తుగా అడ్డువస్తాయో అంతకన్నా తెలియదు. ఫలితంగా సువిశాలమైన రోడ్డుపై అతివేగంతో వెళ్తున్న వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. యథేచ్ఛగా జరిగే బైక్ రేసింగ్‌లకు తోడు సినిమా షూటింగ్‌ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
సైబరాబాద్ పోలీసుల ప్రతిపాదనలివి...
- పెద్ద అంబర్‌పేట్, బొంగులూరు రోడ్, అప్పా జంక్షన్, శంషాబాద్ వద్ద నాలుగు పోలీస్ అవుట్ పోస్ట్ భవనాల నిర్మాణం
- వాహనాల తనిఖీకి 10 పది ఇంటర్సెప్ట్ వాహనాల ఏర్పాటు
ఈ ఏడాది జరిగిన కొన్ని ప్రమాదాలు...
జనవరి 8: హయత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో డీసీఎం డ్రైవర్ వికలయ్య మృతి
జనవరి 20: బొంగులూర్ గేట్ వద్ద ప్రమాదంలో బీటెక్ విద్యార్థి స్వాగత్ మృతి... మరో విద్యార్థికి తీవ్ర గాయాలు.
జనవరి 25: రాయదుర్గం పరిధిలో 11 మందికి గాయాలు
ఫిబ్రవరి 6: రాజేంద్రనగర్, రాయదుర్గం పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ఏప్రిల్ 28: వట్టినాగులపల్లి వద్ద బాబూ మియా మృతి.
మే 9: పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో సీడ్స్ కంపెనీ డెరైక్టర్ పిచ్చిరెడ్డి మృతి
మే 22: హయత్‌నగర్ పరిధిలో ముగ్గురి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు.
మే 26: తెల్లాపూర్ వద్ద యాక్సిడెంట్‌లో స్నేహిత మృతి... ఒకరికి గాయాలు.
జూన్ 18: దుండిగల్ ఠాణా పరిధిలో జరిగిన యాక్సిడెంట్‌లో మల్లికార్జున్, నవిన్ మృతి...ముగ్గురికి తీవ్ర గాయాలు.
జూన్ 30: అప్పా జంక్షన్ సమీపంలో ప్రతాప్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, భవ్యల మృతి
జూలై 3: మియాపూర్ పోలీస్ పరిధిలో శ్రీవాత్సవి మృతి. ఇద్దరికి గాయాలు.
జూలై 7: పెద్ద అంబర్‌పేట్ జంక్షన్ వద్ద శ్రీనివాస్ మృతి. ఇద్దరికి గాయాలు.
జూలై 27: కొత్వాల్‌గూడ సమీపంలో చెంచులమ్మ మృతి... ముగ్గురికి గాయాలు.
ఆగస్టు12: హయత్‌నగర్ పరిధిలో హిమబిందు, శ్రావణి మృతి,ముగ్గురికి గాయాలు.
ఆగస్టు 20, 21, 22: నలుగురు మృతి... ఒకరికి తీవ్ర గాయాలు.

No comments:
Post a Comment