అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...
కామాంధులపై 'కారప్పొడి' అస్త్రం
పెప్పర్ స్ప్రే
చల్లి, ఆటోలోంచి దూకి
తప్పించుకున్న
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని
24 గంటల్లోపే
నిందితుల అరెస్టు
హైదరాబాద్
- న్యూస్‌టుడే
హైటెక్
సిటీలో మంగళవారం అపహరణ యత్నానికి గురైన యువతి తనను తాను రక్షించుకున్న
వైనం మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తాగిన మైకంలో ఉన్న ఆటోడ్రైవర్
అతని స్నేహితులు ఆటో దారి మళ్లించి ఒంటరిగా ఉన్న తనను అపహరణ చేయడానికి
యత్నించినప్పుడు ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించి తన వద్ద ఉన్న పెప్పర్
స్ప్రే (కారం) చల్లి, నడుస్తున్న ఆటోలోంచి దూకి తెగువతో తనను తాను రక్షించుకుంది.
మాదాపూర్‌లో మంగళవారం రాత్రి యువతి అపహరణ యత్నం కేసును పోలీసులు
24 గంటల్లోపే ఛేదించారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. బుధవారం
రాత్రి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు
చేసిన విలేకర్ల సమావేశంలో పోలీసు కమిషనర్ తిరుమలరావు ఈ కేసు వివరాలు
వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం రాంబిల గ్రామానికి చెందిన బిపిన్‌కుమార్ అలియాస్
రాజారెడ్డి(28) కొంత కాలం క్రితం జూబ్లీహిల్స్ ప్రాంతానికి వలస వచ్చి కారు డ్రైవర్‌గా
చేస్తున్నాడు. నల్గొండ జిల్లా దిండి మండలం ఎర్రారం గ్రామానికి చెందిన అంకుర్
జంగయ్య(22) వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. ఇతను సంజీవ్‌రెడి ్డనగర్‌లోని సర్వాజ్
నగర్‌లో నివాసముంటున్నాడు. ఇద్దరూ స్నేహితులు. మంగళవారం సాయంత్రం
మద్యం తాగి తమ ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని అమీర్‌పేట వైపు
వెళుతున్నారు. మార్గమధ్యలో మాదాపూర్ పెట్రోల్ బంక్ వద్ద సాఫ్ట్‌వేర్
ఉద్యోగిని ఈ ఆటో ఎక్కింది. అప్పటికే అందులో ఇద్దరు పురుషులు మరో మహిళ
ప్రయాణిస్తున్నారు. వీరు మార్గమధ్యలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టువద్ద దిగిపోయారు.
డ్రైవర్ జంగయ్య సీటుపక్కనే బిపిన్ కూర్చొని ఉన్నాడు. యూసఫ్‌గూడ చెక్‌పోస్టువద్దకు
రాగానే జంగయ్య ఆటోను వెనక్కి తిప్పాడు. తిరిగి జూబ్లీహిల్స్, పెద్దమ్మగుడి మీదుగా
మాదాపూర్, గచ్చిబౌలి వైపు బయలు దేరారు. దీంతో అనుమానం వచ్చిన యువతి ఈ విషయాన్ని
ఫోన్లో తన స్నేహితుడికి తెలియజేసి.. అప్రమత్తమైంది. ట్రిపుల్ ఐటీ
జంక్షన్‌కు రాగానే ముందు సీటులో కూర్చున్న బిపిన్ వెనక సీటులోకి వచ్చాడు.
వెంటనే ఆమె పెప్పర్ స్ప్రేతో ప్రతిఘటించింది. రాత్రి 9.50నిమిషాల ప్రాంతంలో
ఐఎస్‌బీ రోడ్డులో ఆమె ఆటో నుంచి కిందకు దూకేసింది. వెనక ద్విచక్రవాహనంపై
వస్తున్న నవీన్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆమెను గమనించి చికిత్స నిమిత్తం మాదాపూర్
ఇమేజ్ ఆసుపత్రికి తరలించారు. ఈలోపు ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం
అందించారు. బాధితురాలు ఇమేజ్ ఆసుపత్రిలో ఉందని తెలియడంతో అక్కడికి
వెళ్లి వివరాలు సేకరించి, ఆమె తలకు తీవ్రగాయకాగా చెవిలో నుంచి రక్తస్రావం జరగడంతో
అనంతరం ఆమెను అపోలోకు తరలించారు. సీసీటీవీలో లభించిన ఆటో చిత్రాల ఆధారంగా
పోలీసులు కేసును చేధించారు. నిందితులను గాలించి పట్టుకున్నారు. వారినుంచి
బాధితురాలి బ్యాగు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
తాగిన మైకంలో
చేశాం... నిందితులు: తాగిన మైకంలోనే తామీ
పని చేశామని నిందితులు మీడియా ఎదుట చెప్పారు. ప్రయాణికులంతా జూబ్లీహిల్స్
వద్ద దిగిపోవడంతో యువతి ఒక్కటే ఉండటంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డామని పేర్కొన్నారు.
'తాగిన మైకంలో చేశాం. క్షమించడ'ంటూ నిందితుడు బిపిన్ రోదించాడు.
భయపెట్టొద్దు...
సీపీ: ఐటీ సెక్టార్‌లో కట్టుదిట్టమైన భద్రత
ఉందని సీపీ పేర్కొన్నారు. 6 శాశ్వత చెక్‌పోస్టులతోపాటు 4 క్యూఆర్‌టీ
(క్విక్ రియాక్షన్ టీం) వాహనాలు గస్తీ తిరుగుతున్నాయని, సీసీ కెమెరాలతో
నిఘా ఉంటుందన్నారు. సదరు క్యూఆర్‌టీ నెంబర్లును సైతం ఐటీ ఉద్యోగులకు
అందించామని తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై జరిగిన సంఘటనను ఢిల్లీ తరహాలో
పొల్చుతూ మీడియా ప్రజలను భయాందోళనకు గురిచేయడం సరికాదన్నారు.
సదరు మహిళ తన బ్యాగులో ఉన్న పెప్పర్‌స్ప్రేను సమయస్ఫూర్తిగా ఉపయోగించి
తప్పించుకోగలిగిందన్నారు.
No comments:
Post a Comment