అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, March 28, 2013

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 25 పంచాయతీల విలీనం!



పక్షం రోజుల్లోగా ప్రజాభిప్రాయ సేకరణ
నోటిఫికేషన్‌ జారీ
ఈనాడు, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా
హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో మరో 25 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నగరానికి అత్యంత సమీపంలో ఉండి, అభివృద్ధి చెందుతున్న ఆయా పంచాయతీలను మహానగరంలో కలిపేయాలన్న ప్రతిపాదన కొన్నేళ్లుగా ఉంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే 25 గ్రామ పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు సర్కారు కార్యాచరణ ప్రారంభించింది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం మంగళవారం అర్ధరాత్రి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలోని 56 గ్రామ పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని తొలుత భావించింది. చివరి నిమిషంలో జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేల ఒత్తిడితో 18 గ్రామాలను నాలుగు నగర పంచాయతీలుగా మార్చింది. మిగతా 38 గ్రామపంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 13 పంచాయతీల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. విలీన ప్రక్రియను న్యాయస్థానం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. మిగతా 25 పంచాయతీల్లో పదింటికి విలీనంపై స్థానికంగా ఆమోదం ఉంది. మిగతా 15 చోట్ల ఆమోదం లేదు. తాజాగా న్యాయస్థాన పరిధిలోలేని 25 పంచాయతీల విలీనానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం సర్కారు నోటిఫికేషన్‌ జారీచేసింది. దీని ప్రకారం 15 రోజుల్లో ఆయా పంచాయతీల ప్రజల అభిప్రాయాలను సేకరించి, ప్రభుత్వం విలీనంపై నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికలు జరుగుతాయా, లేదా?
జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ప్రతిపాదించిన 25 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయా, లేదా అన్న సందిగ్ధత నెలకొంది. 13 పంచాయతీలు హైకోర్టును ఆశ్రయించడం, న్యాయస్థానం స్టే విధించడంతో అక్కడ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని అధికారులు భావిస్తున్నారు. విలీనానికి ప్రతిపాదించిన 25 పంచాయతీలను పంచాయతీరాజ్‌ శాఖ తమ పరిధి నుంచి తొలగిస్తూ ఇంకా 'డీనోటిఫై' చేయలేదు. అలాగే, వీటిని జీహెచ్‌ఎంసీలో కలుపుతున్నట్లు పురపాలకశాఖ 'నోటిఫై' చేయలేదు. అంటే ఈ పంచాయతీల స్థాయి ప్రస్తుతం యథాతథంగా ఉన్నట్లే లెక్క! సాధారణంగా డీనోటిఫై చేయని పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితిని కమిషన్‌కు వివరిస్తే.. ఈ పాతిక పంచాయతీలను ఎన్నికల పరిధి నుంచి తాత్కాలికంగా మినహాయించే అవకాశముంది.

No comments:

Post a Comment