హైదరాబాద్:
రాష్ట్ర రాజధాని మరోమారు బాంబుపేలుళ్లతో రక్తసిక్తమైంది. దిల్‌సుఖ్‌నగర్
ప్రాంతంలో గురువారం వరుస పేలుళ్లు సంభవించాయి.
- 2007లో నాలుగు నెలల వ్యవధిలోనే రెండు ప్రాంతాల్లో బాంబుపేలుళ్లు సంభవించాయి. ముందుగా మక్కా మసీదులో, తర్వాత కొద్ది వ్యవధిలోనే కోఠిలోని గోకుల్‌ఛాట్, సచివాలయానికి ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. విహారానికి వచ్చిన కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా పార్కులో చనిపోయారు. అంతకుముందు 2002 నవంబరు 21వ తేదీన దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబు దేవాలయం వద్ద పేలుడు జరిగింది. లుంబినీపార్కు, గోకుల్‌ఛాట్ పేలుళ్లు జరిగిన ఆరేళ్ల తర్వాత గురువారం మరోమారు ఈ తరహా పేలుళ్లతో రాజధాని భయంతో వణికిపోయారు.
- 1997 నవంబరు 20: జూబ్లీహిల్స్‌లో తెదేపా నేత పరిటాల రవి లక్ష్యంగా పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 23 మంది చనిపోగా 31 మంది గాయపడ్డారు. ఈ ఘటన రాయలసీమ ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలో జరిగింది.
- 2002 నవంబరు 21: దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఒక మహిళ మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు.
- 2004 నవంబరు 1: సరూర్‌నగర్ దగ్గర పార్కు చేసిన ఇంజినీరింగ్ కళాశాల బస్సు కింద బాంబు పేలి ఇద్దరు గాయపడ్డారు.
- 2004 నవంబరు 4: పోలీస్ కంట్రోల్ రూం సమీపంలోనే పేలుడు సంభవించింది. ఈ సందర్భంగా ఒక పాదచారి గాయపడ్డారు.
- 2004 నవంబరు 12: జామియా ఎ ఉస్మానియా రైల్వేస్టేషన్ సమీపంలో ప్రైవేటు బస్సులో పేలుడు జరిగింది.
- 2005 ఏప్రిల్ 14: నెక్లెస్‌రోడ్డు సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన బాంబు పేలుడు చోటు చేసుకుంది.
- 2005 అక్టోబరు 12: బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఒక హోంగార్డు మరణించగా కానిస్టేబుల్ ఒకరు గాయాలపాలయ్యారు.
- 2006 మే 7: నగరంలోని ఓడియన్ థియేటర్‌లో బాంబు పేలుళ్లు సంభవించి ఒక యువతితో సహా ముగ్గురు గాయపడ్డారు.
- 2006 మే 11: బంజారాహిల్స్ సమీపంలోని ఇందిరానగర్‌లోని ఇంట్లో చెత్త సామాన్లు తొలగిస్తుండగా ఒక బాక్సులోని బాంబు పేలింది. మరో బాంబును పోలీస్ అధికారులు నిర్వీర్యం చేశారు.
- 2007 మే 1: మలక్‌పేటలో లెటర్ పార్శిల్ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ గాయపడింది.
- 2007 మే 18: పాతబస్తీ మక్కా మసీదులో బాంబులు పేలి 14 మంది మృత్యువాత పడ్డారు. పోలీసులు మరో మూడు బాంబులను కనుగొని నిర్వీర్యం చేశారు.
- 2007 ఆగస్టు 25: లుంబినీపార్కు, కోఠిలోని గోకుల్‌ఛాట్‌లో సంభంవించిన పేలుళ్లలో 42 మంది మరణించారు. దిల్‌సుఖ్‌నగర్ పాదచారుల వంతెన కింద మరో బాంబును కనుగొన్నారు.
No comments:
Post a Comment