అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...
ఉగ్రవాదుల అడ్డా ఆంధ్రప్రదేశ్
లష్కర్ ఏ తోయిబా,
ఇండియన్ ముజాహిదీన్‌ల పాగా
ఎంతోమంది తీవ్రవాదుల
ఆశ్రయం
కర్ణాటక, మహారాష్ట్రాల్లోనూ
తిష్ఠ
కోర్టుకు తెలిపిన
ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్
ఉగ్రవాదుల అడ్డాగా మారిందా అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ పోలీసులు. మొన్న గోకుల్
చాట్, లుంబిని పార్కు, నేడు దిల్‌షుక్‌నగర్ వరుస బాంబు పేలుళ్లలో అట్టుడికిన
రాష్ట్రం ఉగ్రవాదుల జాడలతో బీతిల్లుతోంది. ఈ తరుణంలో మన రాష్ట్రం లష్కర్ ఏ తోయిబా,
ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందనే చేదు నిజాన్ని ఢిల్లీ
పోలీసులు ప్రకటించారు. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. గతేడాడి జరిగిన పుణె
బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు న్యాయస్థానంలో దాఖలు చేసిన
అభియోగపత్రంలో ఈ విషయాలు తెలిజయేసింది. ఈ కేసులో అరెస్టయిన ఉగ్రవాదులు
స్వయంగా ఈ విషయాలు వెల్లడించారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంస్థలకు
చెందిన ఎంతోమంది ఉగ్రవాదులు దాక్కుని ఆశ్రయం పొందుతూ ఉగ్రవాద కార్యకలాపాలు
సాగిస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. ఆంధ్రాతో పాటు పొరుగునున్న కర్ణాటక,
మహారాష్ట్రల్లోనూ ఈ ఉగ్రవాదులు ఎంతోమంది దాక్కుని ఉన్నట్లు నిందితులు వెల్లడించారని
పోలీసులు తెలిపారు. ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు
ఇమ్రాన్, సయ్యద్ ఫిరోజ్, లంగ్డే ఇర్ఫాన్ ముస్తఫా, సయ్యద్ మక్బూల్‌ను
ఢిల్లీ పోలీసులు గతేడాది అరెస్టు చేశారు. వీరిలో మక్బూల్‌ను హైదరాబాద్‌లోనే
అరెస్టు చేసి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం వీరిపై ఢిల్లీ చీఫ్
మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు.
వీరంతా దేశ రాజధానిలో విధ్వంసం కోసం పేలుడు పదార్థాలు అమర్చడానికి వచ్చారని,
పుణె పేలుళ్లలో కూడా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా 26/11 సూత్రధారి
అబు జున్‌దాల్, లష్కర్ ఏ తోయిబా అధినేత ఫయాజ్ కాగ్జి, ఇండియన్ ముజాహిదీన్
వ్యవస్థాపకులు ఇక్బాల్ భత్కల్ ఆదేశాలతో ఉగ్రవాద చర్యల కోసం పనిచేస్తున్నారని
పోలీసులు తెలిపారు. కాగ్జి సహా మరో ఎనిమిది మందిపైనా అభియోగాలు మోపారు.
పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం మహారాష్ట్రలోని లష్కర్ ఏ తోయిబా
ఉగ్రవాదుల ఆచూకి తెలుసుకోవడానికి ప్రయత్నించామన్నారు. పుణె పేలుళ్ల
కంటే ముందే ఔరంగాబాద్, నాందేడ్‌కు చెందిన కొంతమంది తీవ్రవాదులు సౌదీ అరేబియాకు
వెళ్లి వచ్చారని, పుణె పేలుళ్ల అనంతరం వీరంతా రూర్కీ మీదుగా దక్షిణ ఢిల్లీకి
చేరకున్నారని తెలిపారు. నిందితుల్లో ఇమ్రాన్, అసద్‌లు ఆగ్నేయ ఢిల్లీలో హిందువులుగా
చలామణి అవుతున్నారని పోలీసులు తెలిపారు. అలాగే ఎంతో మంది ఇండియన్ ముజాహిదీన్,
లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో
దాక్కుని ఉన్నట్లు వీరు వెల్లడించినట్లు చెప్పారు. నిందితుల్లో మక్బూల్‌ను పోలీసులు
హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment