అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, February 28, 2013

రాష్ట్రానికి 9 ఎక్స్‌ప్రెస్‌లు



రాష్ట్రం మీదుగా ప్రయాణించేవి మరో 6
ఒక మెము, ప్యాసింజర్‌ రైలు కూడా
దేశవ్యాప్తంగా మొత్తం 67 ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు
26 కొత్త ప్యాసింజర్లు
57 రైళ్ల పొడిగింపు
24 రైళ్ల రాకపోకల సంఖ్య పెంపు
ఈనాడు - న్యూఢిల్లీ
రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 9 కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ఒక ప్యాసింజర్‌ రైలు, ఒక మెము రైలు దక్కాయి. మరో ఆరు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాష్ట్రం మీదుగా ప్రయాణిస్తాయి. మొత్తమ్మీద ఈ ఏడాది దేశవ్యాప్తంగా 67 కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 26 ప్యాసింజర్‌ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. కొత్త బడ్జెట్‌లో మరో 57 రైళ్ల గమ్యస్థానాలను పొడిగించారు. ఇంకో 24 రైళ్ల రాకపోకల సంఖ్యను పెంచారు. ఐదు మెము, ఎనిమిది డెము రైళ్లను కూడా ఈ ఏడాది ప్రవేశపెట్టనున్నారు. యాత్రికుల సౌకర్యం కోసం ఆధ్యాత్మిక కేంద్రాలకు ఎక్కువ కొత్తరైళ్లను వేశామని పవన్‌కుమార్‌ బన్సల్‌ పేర్కొన్నారు. రాష్ట్రానికి కేటాయించిన 9 కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రతిరోజూ నడిచే రైలు ఒక్కటే ఉంది. మరొకటి వారానికి రెండురోజులు, మిగిలిన ఏడు వారానికి ఒక్కరోజే నడుస్తాయి.
రాష్ట్రం నుంచి వెళ్లే 9 కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ...
1. కర్నూలు టౌన్‌-సికింద్రాబాద్‌... ప్రతిరోజూ
2. కాకినాడ- ముంబయి... వారానికి 2రోజులు
3. మంగళూరు-కాచిగూడ వయా డోన్‌, గుత్తి, రేణిగుంట ...వారానికి ఒకరోజు
4. నిజామాబాద్‌-లోక్‌మాన్య తిలక్‌(టి)... వారానికి ఒకరోజు
5. తిరుపతి-పుదుచ్చేరి... వారానికి ఒకరోజు
6. తిరుపతి-భువనేశ్వర్‌ (వయా విశాఖపట్నం)... వారానికి ఒకరోజు
7. విశాఖపట్నం-జోధ్‌పూర్‌ (వయా టిట్లాగఢ్‌, రాయ్‌పూర్‌)... వారానికి ఒకరోజు
8. విశాఖపట్నం-కొల్లం ... వారానికి ఒకరోజు
9. గాంధీధామ్‌-విశాఖపట్నం (వయా అహ్మదాబాద్‌, వార్దా, బలార్షా, విజయవాడ) ... వారానికి ఒకరోజు రాష్ట్రం మీదుగా ప్రయాణించే కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు...
1. జబల్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ (వయా నాగ్‌పూర్‌, ధర్మవరం) ... వారానికి ఒకరోజు
2. చెన్నై-నాగర్‌సోల్‌ (షిర్డీ) (వయా రేణిగుంట, డోన్‌, కాచిగూడ) ... వారానికి ఒకరోజు
3. బికనీర్‌-చెన్నై ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (వయా జైపూర్‌, బోఫాల్‌, నాగపూర్‌, విజయవాడ)... వారానికి ఒకరోజు
4. హౌరా-చెన్నై ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (వయా భద్రక్‌, దువ్వాడ, గూడూరు) ... వారంలో రెండురోజులు
5. కామాఖ్య(గౌహతి)-బెంగళూరు ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (వయా విశాఖపట్నం) ...వారానికి ఒకరోజు
6. పాటలీపుత్ర(పాట్నా)-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (వయా విజయవాడ)... వారానికి ఒకరోజు
రాష్ట్రానికి కేటాయించిన ప్యాసింజర్‌, మెము రైళ్లు..
1. నంద్యాల-కర్నూలు టౌన్‌ (ప్యాసింజర్‌)... ప్రతిరోజూ
2. తిరుపతి-చెన్నై (మెము రైలు)
రాష్ట్రంలో పొడిగించిన రైళ్లు...
1. హైదరాబాద్‌-బెల్లంపల్లి ఎక్స్‌ప్రెస్‌...సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వరకు
2. బోధన్‌-కామారెడ్డి ప్యాసింజర్‌ ... మీర్జాపల్లి వరకు
3. మిర్యాలగూడ-నడికుడి డెము... పిడుగురాళ్ల వరకు
4. హైదరాబాద్‌ -దర్భంగ ఎక్స్‌ప్రెస్‌... రక్సాల్‌ వరకు (గేజ్‌ మార్పిడి పూర్తయ్యాక).
5. ఫలక్‌నుమా-భువనగిరి మెము ... జనగాం వరకు
రాష్ట్రం మీదుగా వెళ్లే రైళ్ల పొడిగింపు..
1. దర్భంగా- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌... మైసూరు వరకు
2. గౌహతి-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ ... తిరువనంతపురం వరకు
3. యశ్వంత్‌పూర్‌- హజ్రత్‌ నిజాముద్దీన్‌ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌... చండీగఢ్‌ వరకు
ద.మధ్య రైల్వేకు కేటాయింపులు
దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల సౌకర్యాల కోసం గత ఏడాది రూ.100కోట్లు కేటాయిస్తే... తాజాగా రూ.124 కోట్లు కేటాయించారు. మహారాష్ట్ర నాందేడ్‌ వరకు విస్తరించి ఉన్న ఈ రైల్వే పరిధిలో.... ఆంధ్రప్రదేశ్‌ నుంచి బయలుదేరే పలు రైళ్లతోపాటు, పూర్ణ-పర్లి వైద్యనాథ్‌కు ప్రతిరోజూ నడిచేలా ప్యాసింజర్‌ రైలు, అలాగే నాందేడ్‌-ఉనా/నంగల్‌దాం ఎక్స్‌ప్రెస్‌ (వారానికి ఒకరోజు)ను కూడా ప్రవేశపెట్టనున్నారు. ముంబయి సీఎస్‌టీ-లాతూరు ఎక్స్‌ప్రెస్‌ను నాందేడ్‌ వరకు పొడిగించారు. మంగళవారం సికింద్రాబాద్‌లో కొత్త రైళ్ల వివరాలను ద.మ.రైల్వే అధికారులు వెల్లడించారు. ద.మ.రైల్వేలో కొత్తలైన్ల ఏర్పాటుకు గత ఏడాది మాదిరిగానే ఈసారీ రూ.281కోట్లు కేటాయించారు.

No comments:

Post a Comment