మనోహరబాద్-కొత్తపల్లి లైన్‌కు రూ.20 కోట్లు
అక్కన్నపేట-మెదక్ లైన్‌కు రూ.1.10 కోట్లు
సిద్దిపేట-అక్కన్నపేట కొత్త లైన్ సర్వే
ఇదీ రైల్వే బడ్జెట్ తీరు
న్యూస్‌టుడే, మెదక్
* అక్కన్నపేట-సిద్దిపేట మధ్య కొత్త లైన్ సర్వేకు బన్సల్ ఆమోదం తెలిపారు.
* గత బడ్జెట్‌లో మంజూరు లభించి ప్రస్తుతం ఫైనల్ లొకేషన్ సర్వే జరుగుతున్న అక్కన్నపేట-మెదక్ లైన్‌కు ఈ బడ్జెట్‌లో రూ.1.10 కోట్లు కేటాయించారు. ఇది వరకు మంజూరైన రూ. 3 కోట్లకు ఇవి అదనం. అయితే ఈసారి బడ్జెట్‌లో రూ. 10 కోట్లను మెదక్ ఎంపీ విజయశాంతి మంత్రిని కోరగా రూ.1.10 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం.
* మనోహరాబాద్-కొత్తపల్లి లైన్‌కు ఈ బడ్జెట్‌లో రూ. 20 కోట్లు కేటాయించారు. జిల్లాలో పలు ముఖ్య పట్టణాలను కలుపుతూ 151 కిలోమీటర్ల దూరం నిర్మించ తలపెట్టిన ఈ లైన్‌కు రూ. 975 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేయగా కంటితుడుపుగా కేవలం రూ. 20 కోట్లు మాత్రమే కేటాయించడం ఆయా ప్రాంతవాసులకు తీవ్ర నిరాశ కలిగించింది. గత బడ్జెట్‌లో రూ. 40 కోట్లు కేటాయించగా అందులో రూ. 25 కోట్లు ఇతర ప్రాజెక్ట్‌లకు మళ్లించారు. ఉన్న నిధులతో కూడా ఎలాంటి పనులు జరగలేదు. కాగా ఇప్పుడు కేవలం రూ. 20 కోట్లు కేటాయిచడంవల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తావనలేని ప్రాజెక్టులు
* పటాన్‌చెరువు-ఆదిలాబాద్ మధ్య 317 కిలోమీటర్ల దూరం కొత్త లైన్ నిర్మాణానికి సంబంధించి రూ. 47.55 లక్షలతో సర్వే పనులు చేపట్టారు. కాగా గత, ఈసారి బడ్జెట్‌లోనూ దీనికి సంబంధించి అవసరమైన నిధుల ప్రస్తావన లేదు.
* బోధన్-నారాయణఖేడ్-బీదర్ మధ్య కొత్త లైన్ నిర్మాణానికి సంబంధించి 2010-11లో రూ. 50 లక్షలతో సర్వే పూర్తయింది. ఈ లైన్ నిర్మాణానికి సంబంధించి గతేడాది బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోగా ఈసారి బడ్జెట్‌లో సైతం అదే పరిస్థితి పునరావృతమైంది.
* పటాన్‌చెరువు-తెల్లాపూర్ ఎంఎంటీఎస్ రెండో దశ 8.75 కిలోమీటర్ల దూరం విస్తరణకు రూ. 32 కోట్లు అవసరం. దీనికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే జరిగినప్పటికీ బడ్జెట్‌లో మోక్షం కలుగలేదు.
* తూప్రాన్ మండలం మనోహరాబాద్ వరకు ఎంఎంటీఎస్ రెండో దశపొడిగించాలన్న ప్రతిపాదనకు సైతం మోక్షం కలుగలేదు.
No comments:
Post a Comment