అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...
రాష్ట్రానికి సున్నం : ఈసారీ కేటాయింపుల్లో రిక్తహస్తం
డబ్లింగ్‌కు
గత ఏడాది కంటే రూ.54 కోట్ల తగ్గింపు
కొత్త లైన్లకు
పెరగని కేటాయింపులు
సర్వే పూర్తయిన
ప్రాజెక్టులూ బేఖాతరు
కొత్త రైళ్ల
ప్రకటనలోనూ తీవ్ర అన్యాయమే
ఈనాడు -
హైదరాబాద్
లాభార్జనలో
బంగారు బాతులాంటి దక్షిణ మధ్య రైల్వేకు ఈ బడ్జెట్‌లోనూ తీరని అన్యాయమే
జరిగింది. ముందుగా భావించినట్లుగానే కొత్త రైళ్ల ప్రకటన దగ్గర నుంచి కొత్త
లైన్ల మంజూరు వరకు రైల్వేమంత్రి మొండిచేయి చూపారు. రూ. 126 కోట్లు
ఖర్చయ్యే కాకినాడ-పిఠాపురం లైనుకు కేటాయించింది కేవలం లక్ష రూపాయలంటే..
బడ్జెట్ కేటాయింపుల తీరు ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు
నిధుల కేటాయింపులో గత ఏడాది కంటే కోత విధించారు. గత బడ్జెట్‌లో మంజూరు
చేసిన ప్రాజెక్టులకు కూడా ఈసారి నిధులు మంజూరు చేయకుండా సవతితల్లి
ప్రేమను చూపించారు. దేశంలో మిగిలిన 16 జోన్ల కంటే ఈ జోనే లాభార్జనలో
ఉంది. రూపాయి ఆదాయం వస్తుంటే నిర్వహణ ఖర్చు 79 పైసలే అవుతోంది. అంటే దాదాపు
21 పైసలు లాభాలను ఆర్జిస్తోంది. అన్ని ఖర్చులూ పోను దక్షిణమధ్య రైల్వే దాదాపు
రూ.1,800 కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. దీనికి అనుగుణంగా కేటాయింపులు పెంచితే
మొత్తంగా రైల్వేకు ఆదాయం పెరుగుతుంది.. నష్టాలను అధిగమించే అవకాశం
ఉంది. కాని ఆ ప్రయత్నాలేవీ జరిగినట్లు లేవు.
దక్షిణమధ్య
రైల్వే జోన్లో నిర్మాణంలో ఉన్న కొత్త లైన్లు, తదితర పనులకు రూ. 15,275 కోట్లను
వెచ్చించాల్సి ఉండగా 20012-13 బడ్జెట్‌లో ఇచ్చింది రూ. 1,859 కోట్లు. గత ఏడాది అన్యాయం
జరిగింది కాబట్టి ఈసారి దానిని సరిదిద్దే అవకాశం ఉందని అధికారులు భావించారు. బన్సల్
మాత్రం మరోసారీ రిక్తహస్తమే చూపించారు. గత బడ్జెట్‌లో డబ్లింగ్, విద్యుదీకరణ
ప్రాజెక్టులకు రూ.256 కోట్లను కేటాయిస్తే ఈసారి రూ. 202 కోట్లను మాత్రమే
కేటాయించారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశారో ఇట్టే అర్థమవుతుంది.
నిర్మాణంలో ఉన్న లైన్లకు మాత్రం గత ఏడాది కంటే నిధులు కేటాయింపును కొద్దిగా
పెంచినట్లు చూపించి మాయాజాలం చేశారు. నిర్మాణంలో ఉన్న 17 కొత్త లైన్లకు గత
ఏడాది రూ. 280 కోట్ల మేరకు కేటాయిస్తే ఈసారి రూ. 437 కోట్లను కేటాయించారు.
ఈ నిధుల్లో అధిక భాగం ప్రధాన మార్గాలకు కేటాయించకుండా ఆదాయాన్ని తెచ్చే
పెట్టే కొన్ని లైన్ల నిర్మాణం కోసం కేటాయించారు. కృష్ణపట్నం పోర్టు నుంచి
పెద్దఎత్తున సరకు రవాణాను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో
కొత్త లైను నిర్మాణం చేపట్టాలని తలపెట్టారు. దీనివల్ల ప్రయాణికులకు పెద్దగా
ఉపయోగం లేదు. ఈ లైనుకు గత బడ్జెట్‌లో కేవలం రూ.6 కోట్లను కేటాయిస్తే
ఈ ఏడాది బడ్జెట్‌లో ఏకంగా రూ. 96.9 కోట్లను ఇచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రమంతటికీ
ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులకు మాత్రం కేటాయింపులు కుదించేశారు.
* కొత్తరైళ్లను
మంజూరు చేయడంలోనూ ఈ జోన్‌కు మొండిచేయే మిగిలింది. గత బడ్జెట్‌లో 17
ఎక్స్‌ప్రెస్, 10 పాసింజర్ రైళ్లను మంజూరు చేశారు. ఇప్పుడు 8 ఎక్స్‌ప్రెస్ రైళ్లను
ప్రకటించగా ఇందులో ఒక రైలు రాష్ట్రపరిధిలోనే తిరగనిది.
* మిగిలిన
ఏడింటిలో రెండు మూడు రైళ్లు రాష్ట్ర సరిహద్దుల వెంబడి వెళ్లిపోతున్నాయి.
* కీలమైన
సికింద్రాబాద్ కేంద్రంగా కొత్త రైళ్లను కేటాయిస్తారని అనుకున్నా రైల్వేమంత్రి
పట్టించుకోలేదు.
* పాసింజర్
రైళ్ల కేటాయింపులోనూ రాష్ట్రానికి మేలు జరగలేదు.
* భద్రాచలం
రోడ్డు-సత్తుపల్లి కొత్త లైను ఎంతో కీలకమైంది దీనికి ప్రాజెక్టు మొత్తం
వ్యయం రూ. 337 కోట్లయితే ఈ బడ్జెట్‌లో రూ.5కోట్లే కేటాయించారు.
* విశాఖపట్టణం-విజయవాడ
మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గంగా ఉండటంతోపాటు కాకినాడ పట్టణాన్ని ప్రధాన
లైనులో కలిపే కాకినాడ-పిఠాపురం లైనుకు రూ.126 కోట్లు ఖర్చవుతుందని
అంచనా. దీనికి గత బడ్జెట్‌లో రూ. 20 లక్షలను కేటాయిస్తే ఈసారి కేటాయించింది ఒక
లక్షే. దీన్నిబట్టి చూస్తే ఈ లైనును పూర్తి చేయాలని భావించడం లేదని తేలిపోయింది.
* భద్రాచలం
రోడ్డు-కొవ్వూరు లైను ఎంతో ప్రాముఖ్యత కలిగిందైతే దీనికి కేటాయించింది రూ.
కోటి మాత్రమే.
* కోటిపల్లి-నర్సాపురం
లైనుకు కేవలం రూ. కోటి కేటాయించారు.
* రాష్ట్రప్రభుత్వం
నిధులు భరించే కడప-బెంగళూరు లైనుకు మాత్రం రూ.70 కోట్లు, పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్
లైనుకు రూ. 50 కోట్లు, దేవరకొండ-కృష్ణా లైనుకు ఎక్కువగా రూ.110
కోట్లను కేటాయించారు.
* మొత్తం
మీద గత బడ్జెట్‌లో కొత్తలైన్లకు ఇతరత్రా అభివృద్ధి పనులకు మొత్తం రూ.
1,859 కోట్లను కేటాయిస్తే ఇప్పుడు రూ. 2,175 కోట్లను పెరిగినట్లు చూపించారు.
ఈ పెంపుదల నామమాత్రంగానే ఉంది.
* ఇంకో
ముఖ్య విషయం ఏమిటంటే, బడ్జెట్లో లెక్కచెప్పారు కానీ ఇందులో చివరికి ఎంత విడుదల
చేస్తారన్నది ప్రశ్నార్థకమే.
కొత్తప్రాజెక్టుల
విషయంలోనూ...
రాష్ట్రంలో సర్వే
పూర్తయి లాభదాయకంగా ఉన్న 27 లైన్లు నిర్మాణం చేపట్టడానికి సిద్ధంగా
ఉన్నాయి. వీటిలొ చాలావరకు రైల్వేకు మొదటి ఏడాది నుంచే ఆదాయాన్ని తెచ్చిపెట్టే
అవకాశముందని అధికారులు గుర్తించారు. కాని వీటి గురించి అసలు రైల్వేమంత్రి
పట్టించుకోనే లేదు. సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించిన 4 లైన్లకు
అనుమతించినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దాదాపు పది కొత్త లైన్లకు
లైన్ క్లియర్ అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుల వైపు
మంత్రి చూడలేదు.
No comments:
Post a Comment