అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, September 24, 2012

సుందరీకరణం!

24/09/2012 1:38:00 AM
సిటీబ్యూరో/గచ్చిబౌలి, న్యూస్‌లైన్: ‘ఆలస్యం అమృతం విషం’ అన్న ఆర్యోక్తి సీవోపీ పనులకు అతికినట్టు సరిపోతుంది. సుందరీకరణ అంటూ చేసిన హడావుడి... ఆచరణలో కనబరచకపోవడంతో పనులు ఎక్కడివక్కడే అన్నట్టుగా ఉన్నాయి. గడువు ముంచుకొస్తున్నా పూర్తవుతాయని చెప్పలేని స్థితి. మరోవైపు హడావుడి... పర్యవేక్షణ లేమి... నిధుల వినియోగం తీరుపై అనుమానాలు... ఆధునిక వీధి దీపాలకు ఆటంకాలు... సైనేజీల పట్ల సంశయాలు... వెరసి ‘వైవిధ్యం’ కాస్త తూతూ మంత్రం ఏర్పాట్లతో మమ అనిపించే పరిస్థితి నెలకొంది.


సుందరీకరణలో భాగంగా సెంట్రల్ మీడియన్లలో గ్రీనరీ, ఫ్లై ఓవర్ల దిగువన థీమ్‌ల వారీగా చిత్రాలు, రహదార్ల వెంబడి అందమైన మొక్కల కుండీలు తదితరమైనవి ఏర్పాటు చేయాలని భావించారు. దాదాపు రూ. 10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో చాలావర కు పూర్తికాలేదు. ఈ నెల 25నాటికే పూర్తిచేయగలమని అధికారులు అంచనా వేసినప్పటికీ, ఇంకా సగంలోనే ఉన్నాయి. తెలుగుతల్లి ఫ్లై ఓవర్, తదితర ప్రాంతాల్లో కుడ్యచిత్రాల పనులింకా పూర్తికాలేదు. సెంట్రల్ మీడియన్లలో మట్టిని మార్చి మొక్కలు నాటే పనులు చేస్తున్నారు. సమయాభావం కారణంగా హడావుడిగా పనులు చేస్తుండటంతో.. సీఓపీ తర్వాత ఎన్నిరోజుల వరకు ఈ పనులు మన్నికగా ఉంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంతేకాదు దాదాపు 59వేల కుండీలకు రూ. 1.79 కోట్లు ఖర్చు చేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకముందు నిధుల లేమితో ఆయా మార్గాల్లో సుందరీకరణ పనుల్ని కార్పొరేటర్ సంస్థలు, బ్యాంకులకు అప్పగించాలని నిర్ణయించారు. ఆ ప్రక్రియలో చోటు చేసుకున్న జాప్యంతోనూ పనుల్లో ఆలస్యం జరిగింది.

ఆధునిక దీపాలకూ ఆటంకాలు
ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక వీధిదీపాలను ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచారు. దీనిపై కాంట్రాక్టు అసోసియేషన్లు, ప్రముఖ విద్యుత్ క ంపెనీ ఫిర్యాదు చేయడంతో ఈప్రక్రియను కొంతకాలం వాయిదా వేశారు. ఆ తర్వాత వాటి సంగతే మర్చిపోయారు. ట్యాంక్‌బండ్‌తోపాటు కులీఖుతుబ్‌షా టూంబ్స్, చార్మినార్ వంటి వారసత్వ సంపదలున్న ప్రాంతాల్లోనూ ప్రత్యేకమైన వీధిదీపాల ఏర్పాటు ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది.

తగ్గిన ధగధగలు
నగరాన్ని వెలుగులతో నింపేందుకు వీలుగా అన్నిచోట్లా ఏర్పాటుచేయాలనుకున్న త్రీఫేజ్ భూగర్భ కేబుళ్లు సమయాభావంతో కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. వీఐపీలు పర్యటించనున్న అన్ని మార్గాల్లోనూ అక్టాగోనల్ ఎలక్ట్రికల్ పోల్స్ ఏర్పాటు కూడా టెండర్ల జాప్యంతో కొన్ని మార్గాలకే పరిమితమైంది.

సంశయాల్లో సైనేజీలు..
నగరం మొత్తం ఏర్పాటుచేయాలనుకున్న ఆధునిక సైనేజీల్లో సీఓపీ నాటికి ఎంపిక చేసిన మార్గాల్లోనైనా ఏర్పాటు చేయాలనుకున్నారు. టెండరు ఖరారులో జరిగిన జాప్యం తదితర కారణాలతో పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. దీంతో అనుకున్న మార్గాల్లోనూ సైనేజీలు ఏర్పాటుచేయలేని పరిస్థితి నెలకొంది. ఇందుకుగాను రూ. 9 కోట్లు వెచ్చిస్తున్నారు. ఆయా పనులు వ్యవధిలోగా పూర్తికాకపోతుండటంతో.. నాణ్యత కోసం ప్రాధాన్యత నిస్తున్నామని, హడావుడిగా నాసిరకం పనులు చేసేదిలేదని చెబుతున్నారు.

ఇదీ తీరు ..
గచ్చిబౌలి నుంచి రాయదుర్గం వరకు డివైడర్ల మధ్యలో సారంలేని మొరం, బండరాళ్లతో నింపుతున్నారు.

పైపైన ఎర్రమట్టి పోసి సక్రమంగా చేస్తున్నట్లుగా తప్పుదోవ పట్టిస్తున్నారు.

నాలెడ్జ్ సిటీ జంక్షన్ నుంచి మైండ్‌స్పేస్ జంక్షన్, కావూరి హిల్స్ నుంచి న్యాక్ గేట్ వరకు ఇదే రీతిలో పనులు సాగుతున్నాయి.

గచ్చిబౌలి ఫ్లైఓవర్ కింద మొరం పోసి వందల కొద్ది మొక్కలను నాటారు. ఇవి నిలిచే అవకాశం తక్కువే.

No comments:

Post a Comment