అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, September 24, 2012

బీటీతో చేటే!

మన రైతులపై 'బహుళజాతి' వల
దిగుబడిపేరిట అరచేతిలో స్వర్గం
నిలువెల్లా విషమైన పత్తి మొక్క
పదేళ్లలోనే తొలగిన భ్రమలు
కాచుకుని కూర్చున్న 'వంగ దొంగ'

బీ..టీ.. పదేళ్ల క్రితం ఈ రెండక్షరాలు రైతును ఊరించాయి. మురిపించాయి. మరిపించాయి.
బీ.టీ... ఇవే రెండక్షరాలు మన రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పర్యావరణ వాదులను బెంబేలెత్తిస్తున్నాయి.



హైదరాబాద్, సెప్టెంబర్ 21: మన వ్యవసాయ రంగం సువిశాలం, సువిస్తారం. దీనిపై కన్నేసిన బహుళ జాతి కంపెనీలు.. బీటీ మంత్రం జపించాయి. 'అధిక దిగుబడి... అసలే ఉం డని చీడపీడలు' అనే వల విసిరాయి. ఈ వలలో... అమాయకులైన మన రై తులు సులభంగా పడిపోయారు. దీంతో పత్తి విత్తనాల రూపంలో బీటీ మన దేశంలోకి విజయవంతంగా ప్రవేశించింది. అలా వచ్చి దశాబ్దం గడిచిపోయింది. బ్యాక్టీరియం బాసిల్లస్ తరింజీన్సిస్ నుంచి తీసిన క్రై ప్రోటీన్ (ఎండోటాక్సిన్) జన్యువును ప్రవేశపెట్టడం ద్వారా బీటీ కాటన్ తయారుచేస్తా రు. ఇది మొక్కలోని ప్రతి కణంలోకి వ్యాపిస్తుంది. బ్యాక్టీరియల్ ఎండోటాక్సిన్ ను తయారుచేసి మొత్తం మొక్కనే విషపూరితంగా మారుస్తుంది. అప్పుడు లె ప్టిడోప్టారెన్లు అనే తరహా కీటకాలు ఈ మొక్కను ఆశించలేవు. ఇదీ... బీటీ లెక్క.

బీటీ ఆక్రమణ...
పత్తికి పురుగులే ప్రధాన శత్రువులు. 'పురుగు పట్టదు. పంట పండుతుం ది'... అనగానే పత్తి రైతులు పరవశించిపోయారు. ఒక సంవత్సరం బాగానే ఉంది. రెండో సంవత్సరమూ బాగానే ఉంది. ఒక్కో సంవత్సరం గడిచే కొద్దీ.... అసలు విషయం బయటపడింది. బీటీలోని డొల్లతనం రైతులకు తెలిసొచ్చింది. కానీ... జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్వదేశీ పత్తి విత్తన మార్కెట్‌ను బీటీ ఆక్రమించింది. దేశంలో పత్తి సాగు విస్తీర్ణం 1.11 కోట్ల హెక్టార్లు. ఇందులో 90 శాతం వాటా బీటీదే. కీటకాలు నాశనమయ్యాయి. వాటితోపాటు... రైతు జీవితం కూడా ఆర్థికంగా సర్వనాశనమైంది. నిలువెల్లా విషమైన బీటీ పత్తి మొక్కలు తిన్న పశువులకు చావొచ్చింది. చివరికి... రైతులు కూడా పత్తి చేలలో పనిచేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది.

ఐదేళ్ల ముచ్చట...
బీటీ పత్తిని 2002లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు దిగుబడి ఘ నంగానే ఉంది. తొలి ఐదేళ్లలో బీటీ విస్తీర్ణం 41 శాతానికి చేరింది. దిగుబడి బా గుండటంతో రైతులు మెల్లమెల్లగా దీనిపట్ల ఆకర్షితులు కాసాగారు. ఆ తర్వా త... దిగుబడి మెల్లగా పడిపోవడం మొదలైంది. 'బీటీతో భారీ దిగుబడి' అనే భ్రమ వీడిపోవడం మొదలైంది. దశాబ్ద కాలంలో బీటీ పత్తిసాగు వల్ల సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా మనదేశంపై ఎంతో ప్రభావం కనిపించింది. పంటచేలకు మేలుచేసే కీటకాలూ చనిపోవడంతో పొలాల్లో జీవ వైవిధ్యం నశిస్తోంది. బీటీతో రైతులు దెబ్బతింటున్నారని ప్రభుత్వమూ ఎప్పుడో గ్రహించింది.

వంకాయ దెబ్బ...
బీటీ పత్తితోనే బోలెడంత ముప్పు వచ్చి పడిందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతుండగా... ఇప్పుడు మన వంగ తోటల్లోకి కూడా ప్రవేశించేందుకు విదేశీ బావలు కాచుకు కూర్చున్నారు. బీటీ పత్తిని వాణిజ్య అవసరాలకు మాత్రమే వాడతాం. కానీ... బీటీ వంకాయను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పర్యావరణ సమతూకం, వృక్ష వైవిధ్యంతోపాటు... మనిషి ఆరోగ్యానికీ ముప్పు తప్పదని పర్యావరణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేచోట బీటీ, సాధారణ వంగ రెండూ సాగుచేసినప్పుడు... సాధారణ వంకాయపై కీటకాల దాడి భారీగా పెరుగుతుంది.

కలుపు మొక్కలు కూడా ఎక్కువవుతాయి. అంతేకాదు.. బీటీ వంకాయ నుంచి వచ్చిన ట్రాన్స్‌జీన్లు సాధారణ వంగను కలుషితం చేస్తాయని కూడా చెబుతున్నారు. మన దేశంలో 532 రకాల వంకాయలు పండుతున్నాయి. బీటీ వచ్చిందంటే ఈ వైవిధ్యం మొత్తం సర్వనాశనం అవుతుంది. వీటన్నింటి నేపథ్యంలో... బీటీ వంగపై మన దేశంలో భారీ వ్యతిరేకత వెల్లడైంది. చివరికి... "బీటీ వంగ వినియోగదారులకు సురక్షితమేనని పరిశోధకులు నిరూపించే వరకు దాన్ని మన దేశంలో వాడటానికి వీల్లేదు'' అంటూ 2010లో నాటి పర్యావరణ మంత్రి జైరాం రమేశ్ మారటోరియం విధించారు. దీనిని ఎత్తేయించేందుకు బీటీ పరిశ్రమ వర్గాలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నాయి.

ప్రచారం... వాస్తవం
1) బీటీతో దిగుబడి పెరుగుతుంది: ఇది పూర్తి అవాస్తవం. మన దేశంలో పత్తిని సాగు చేసే పొలాల్లో 2004-05 సంవత్సరంలో కేవలం ఆరు శాతం మాత్రమే బీటీ విత్తనాలు వేసే వారు. ఆ సమయంలో దిగుబడి హెక్టారుకు 470 కేజీలు వచ్చేది. 2010 నాటికి 90 శాతం బీటీ విత్తనాల కిందే ఉంది. అప్పటికి దిగుబడి 474 కేజీలకు ఉంది. అంటే... బీటీ సాగు వల్ల పెరిగిన దిగుబడి హెక్టారుకు కేవలం 4 కిలోలు మాత్రమే.

2) బీటీతో రైతులు బాగు పడ్డారు: ఇదో ఉత్తుత్తి వాదన. బీటీ వల్ల దిగుబడి పెరగనప్పుడు... రైతుకు మాత్రం లాభం ఎలా వస్తుంది? నిజానికి... పత్తి ధరనే బాగా పెరిగింది. ప్రభుత్వమే పత్తి మద్దతు ధరను పెంచింది. 2005-06లో ఒక క్వింటాలు పత్తి 2000-2500 మధ్య ఉండేది. 2010 నాటికి 6,800కు చేరుకుంది. రైతుకు ఏదైనా లబ్ధి చేకూరిందంటే... దానికి ధరల్లో పెరుగుదలే కారణం. బీటీ కాదు. అయితే... తమ బీటీ విత్తనాల వల్ల పత్తి రైతులు రూ.31వేల కోట్లు లబ్ధి పొందారని ఒక కంపెనీ ప్రచారం చేసుకుంది. దీనిని వ్యాపార ప్రకటనల కౌన్సిల్ తప్పుపట్టడంతో... ఆ ప్రకటనను ఉపసంహరించుకోక తప్పలేదు.

3) చీడపీడలు రావు: ఇది కూడా భ్రమే అని దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) చేసిన అధ్యయనంలో తేలింది. వరంగల్ జిల్లాలో బీటీ పత్తికి 'బోల్ వార్మ్' అనే పురుగు ఆశించింది. బోల్‌గార్డ్-1 విత్తనం విఫలం కావడంతో... ఇప్పుడు బోల్‌గార్డ్-2 విత్తనాన్ని తీసుకొచ్చారు. ఈ పంటకూ పురుగు తప్పడంలేదు. దీంతో రైతులు అదనంగా పురుగు మందులు వాడాల్సి వస్తోంది. రసాయన ఎరువులు, సాగునీరు, పురుగు మందులు కూడా ఎక్కువగా వాడక తప్పడంలేదు.

అబద్ధాల ప్రచారం...
బీటీవల్ల సాగు వ్యయం తగ్గుతుందని ఊదరగొట్టా రు. కానీ... అలా జరగలేదు. ఖర్చు మరింత పెరిగింది. బీటి విత్తనాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కేవ లం పదేళ్లలోనే 6 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. బీటీకి కూడా పురుగుల మందుల వాడకం తప్పడంలే దు. కొత్త కొత్త రకాల చీడలు ఆశిస్తున్నాయి. చెట్టు, కాం డం, చివరికి కాయల్లోనూ చేరుతున్న విషం ప్రమాదకరంగా మారింది. ఆకుల్లోకి ప్రవేశిస్తున్న విషం కారణం గా వీటిని తిన్న పశువులు మృత్యువాత పడుతున్నాయి.
- డాక్టర్ దొంతి నర్సింహా రెడ్డి (చేతన )

దేశీయమే ఉత్తమం...
మన వాతావరణానికి తగినట్లుగా ఉండే వంగడాలవల్ల పర్యావరణ సమతౌల్యం నెలకొనేది. దేశీయ వ్యవసాయ వంగడాలు శ్రేష్టమైనవని డాక్టర్ రిచార్య అనే వ్యవసాయ శాస్త్రవేత్త స్పష్టం చేశారు. సంప్రదాయ వ్యవసాయాన్ని పక్కన పెట్టి... ఈ రోజు రైతులు బీటీ విత్తనాల కోసం రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తినే పరిస్థితి కల్పించారు. విదేశీ కంపెనీలపై ఆధారపడాల్సిన దుస్థితి తీసుకుని వచ్చారు. - సరస్వతి కవ్వుల (నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూమెంట్ )

వైవిధ్యంగా..
బర్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా

సుమారు వందేళ్ల క్రితం ఓ కుర్రాడు సరదాగా తన బొమ్మ తు పాకీతో ఆడుకుంటున్నాడు. అతడున్న లం కంత ఇంట్లో ఓ చోట గూడులో ఉన్న పిల్ల పి చ్చుకను గురి చూసి కొట్టాడు. కింద పడి కిచకిచ మంటున్న ఆ ప్రాణి అత న్ని కదిలించింది. పసుపు వర్ణపు మెడ ఉన్న ఆ మూగ జీవి అందంతో ముగ్ధుడయ్యాడు. పక్షుల గురించి తెలసుకోవాలన్న జిజ్ఞాస మొదలైంది. యువకుడిగా మొదలైన అతని ప్రస్థానం ఇక ఎక్కడా ఆగలేదు. దాదాపు 20ఏళ్లపాటు అడవుల్లోనే గడిపాడు. పక్షుల జీవ వైవిధ్యాన్ని దేశానికి అందించాడు. ప్రస్తుతం పక్షులపై పరిశోధన చేయాలంటే ముందుగా ఆయన పుస్తకాలను తప్పక చదవాల్సిందే. ఆ పద్మవిభూషణుడి పేరే సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ(సలీం అలీ). ఆయనే 'బర్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా'.

No comments:

Post a Comment